Budget Deficit
-
'అంత బడ్జెట్ మావల్ల కాదు'.. కామన్వెల్త్ గేమ్స్ నిర్వహించలేం
ఒలింపిక్స్ తర్వాత అత్యంత ప్రాధాన్యమున్న టోర్నీ కామన్వెల్త్ గేమ్స్. కాగా నాలుగేళ్లకోసారి నిర్వహించే కామన్వెల్త్ గేమ్స్‌ను 2026లో ఆస్ట్రేలియాలోని విక్టోరియా స్టేట్(Victoria State) వేదిక కానుంది. కానీ తాజాగా తాము కామన్వెల్త్ గేమ్స్ నిర్వహించలేమని విక్టోరియా స్టేట్ తేల్చి చెప్పింది. అనుకున్నదాని కంటే బడ్జెట్ ఎక్కువైతుందని.. ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత బడ్జెట్‌తో కామన్వెల్త్ గేమ్స్ నిర్వహించడం తమకు సాధ్యం కాదని పేర్కొంది. గేమ్స్ నిర్వహణ నుంచి తాము తప్పుకుంటున్నట్లు ఇప్పటికే కామన్వెల్త్ గేమ్స్ అథారిటీకి సమాచారమిచ్చామని.. మా కాంట్రాక్ట్‌ను రద్దు చేసి వేరే వాళ్లకు ఇవ్వడం మంచిదని కోరినట్లు విక్టోరియా స్టేట్ ప్రతినిధులు తెలిపారు. విక్టోరియా స్టేట్ ప్రీమియర్ డానియెల్ ఆండ్రూస్ మెల్బోర్న్లో నిర్వహించిన ప్రెస్ మీట్లో మాట్లాడారు. ''మొదట కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణకు బడ్జెట్లో రెండు ఆస్ట్రేలియన్ బిలియన్ డాలర్స్($2Aus Billion Dollars) కేటాయించాం. కానీ ఇప్పుడు చూస్తే అది ఏడు ఆస్ట్రేలియ బిలియన్ డాలర్లు($7Aus Billion Dollars) అయ్యేలా కనిపిస్తోంది. ఇప్పుడున్న పరిస్థితిలో మాకు ఇది కష్టంగా అనిపిస్తోంది. అసలే లోటు బడ్జెట్‌తో కొట్టుమిట్టాడుతున్న మాకు కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణ భారంగా మారే అవకాశం ఉంది. ఒక ఆసుపత్రి లేదా స్కూల్స్ నిర్వహణకు ఖర్చు చేయాల్సిన దానిని ఇలా కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణకు వినియోగించలేం.. ఇది మాకు మూడింతల బడ్జెట్'' అని తెలిపారు. విక్టోరియా స్టేట్ ప్రతినిధి డానియెల్ ఆండ్రూస్ ► ఇక 2022లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌కు ఇంగ్లండ్‌లోని బర్మింగ్హమ్ పట్టణం ఆతిథ్యమిచ్చింది. ఈ గేమ్స్‌లో ఆస్ట్రేలియా 179 పతకాలతో టాప్‌లో ఉండగా.. రెండో స్థానంలో ఇంగ్లండ్ 176 పతకాలతో ఉంది. ఇక భారత్ ఈ గేమ్స్‌లో 61 పతకాలు(22 స్వర్ణాలు, 16 రజతాలు, 23 కాంస్యాలతో) నాలుగో స్థానంలో నిలిచింది. When the Commonwealth Games needed a host city to step in at the last minute, we were willing to help – but not at any price. And not without a big lasting benefit for regional Victoria. — Dan Andrews (@DanielAndrewsMP) July 17, 2023 చదవండి: Asian Games 2023: ఇదేం క్రికెట్ స్టేడియం.. చైనాపై పెదవి విరుస్తున్న క్రికెట్ ఫ్యాన్స్ -
KCR Government: బడ్జెట్ లోటు.. పూడ్చుకునేదెట్లా? ఏకంగా రూ.45 వేల కోట్ల లోటు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఖజానాకు నిధులు సమకూర్చుకోవడంపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ప్రస్తుత ఆదాయ వనరులను పెంచుకోవడంతోపాటు కొత్త, అదనపు ఆదాయ వనరుల అన్వేషణపై ఫోకస్ చేసింది. 2022–23 బడ్జెట్లో పెట్టుకున్న కేంద్ర పద్దులు, రుణ సేకరణ అంచనాల్లో ఏకంగా రూ.45 వేల కోట్ల లోటు ఏర్పడుతుండటంతో.. దానిని పూడ్చుకునేందుకు చర్యలు చేపడుతోంది. ఈ మేరకు గురువారం మధ్యాహ్నం రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ భేటీలో ఆదాయ వనరుల సమీకరణతోపాటు పలు ఇతర అంశాలపై మిగతా 5వ పేజీలో చర్చ జరుగుతుందని సీఎంవో కార్యాలయ వర్గాలు ప్రకటించాయి. ఆదాయ వ్యయాల లెక్కలు తేల్చి.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆదాయ, వ్యయాల లెక్కలను మంత్రివర్గ భేటీలో పరిశీలించనున్నారని అధికార వర్గాలు చెప్తున్నాయి. రుణ సమీకరణలో కేంద్రం సహాయ నిరాకరణ, గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద సాయంలో తెలంగాణ పట్ల వివక్షపై చర్చించే అవకాశం ఉందని వెల్లడించాయి. ఆర్థిక మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో ఏర్పాటైన సబ్‌కమిటీ సిఫార్సులను కేబినెట్ భేటీలో పరిశీలించి.. ప్రజలపై ఎక్కువగా భారం పడకుండా ఆదాయం పెంచుకునే మార్గాలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నాయి. రుణాలపై కేంద్ర నిర్ణయంతో.. కార్పొరేషన్ల పేరిట తీసుకునే రుణాలకు ప్రభుత్వం ఇచ్చే గ్యారంటీని కూడా.. రాష్ట్ర ప్రభుత్వ అప్పుల కింద లెక్కగడతామని కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. దీనివల్ల ఎఫ్ఆర్బీఎం రుణ పరిమితిపై ప్రభావం పడుతుందని, రుణ అంచనాల్లో రూ.15 వేల కోట్ల వరకు లోటు ఏర్పడుతుందని రాష్ట్ర ఆర్థిక శాఖ అంచనా వేసింది. ఇక గత ఐదేళ్ల గణాంకాలను పరిశీలిస్తే.. గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద కేంద్ర సాయం అంచనాల్లో రూ.18 వేల కోట్ల నుంచి రూ.40 వేల కోట్ల వరకు లోటు ఏర్పడుతోందని అంచనా వేసింది. ఈ లెక్కన ఈసారి రూ.30 వేల కోట్ల మేర తక్కువగా రావొచ్చని లెక్కించింది. మొత్తంగా కేంద్ర ప్రభుత్వ వైఖరి కారణంగా రూ.45 వేల కోట్ల వరకు లోటు ఏర్పడుతోందని ఆర్థికశాఖ అధికారులు చెప్తున్నారు. కేంద్రం పన్నుల్లో రాష్ట్రాల వాటా పెంచామంటున్నా.. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధులు, ఇతర పథకాలకు కోతలతో గతంలో కంటే తక్కువగా నిధులు వస్తున్నాయని అంటున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం పింఛన్లను భారీగా పెంచుతుండటం, రూ.లక్ష వరకు రుణమాఫీ, వరద నష్టం, ప్రాజెక్టుల మరమ్మతులు, నిర్మాణ వ్యయం, రుణాల అసలు, వడ్డీ చెల్లింపుల వంటివాటికి నిధుల అవసరం భారీగా పెరగనుందని వివరిస్తున్నారు. పన్నేతర ఆదాయంపై దృష్టి రాష్ట్రంలో ఇసుక అమ్మకాలు, మైనింగ్ రాయల్టీ పెంపు, రాజీవ్ స్వగృహ ఇండ్లు, నిరుపయోగ భూముల అమ్మకాలు, ఎల్ఆర్ఎస్ అమలు, పన్ను లీకేజీలను అరికట్టడం వంటి అంశాలపై ప్రభుత్వం ఫోకస్ పెట్టనుందని అధికారవర్గాలు చెబుతున్నాయి. భూముల మార్కెట్ విలువలను మరోసారి పెంచే అవకాశాలనూ కేబినెట్ పరిశీలించే అవకాశం ఉందని అంటున్నాయి. ఈ ఏడాది జనవరిలో భూముల విలువలను సవరించినా.. చాలా ప్రాంతాల్లో అంచనా వేసుకున్నదానికన్నా తక్కువే పెరిగిందని, ఆయా ప్రాంతాల్లో మరోసారి భూముల విలువలను సవరించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందని సమాచారం. అన్ని అంశాలపై కూలంకషంగా చర్చించి.. ప్రజలపై ఎక్కువగా భారం పడకుండా అదనపు నిధులను సమీకరించే మార్గాలను ప్రభుత్వం అనుసరించనుందని ఆర్థిక శాఖ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ఈ ఏడాదీ గ్రాంట్లు అంతంతే! 2022–23 ఆర్థిక సంవత్సరానికి గాను ఏప్రిల్ నెల గణాంకాలను మాత్రమే కాగ్ విడుదల చేసింది. ఈ గణాంకాల ప్రకారం రాష్ట్ర బడ్జెట్లో పెట్టుకున్న లక్ష్యంలో.. గ్రాంట్ ఇన్ ఎయిడ్ కేవలం 6 శాతం, కేంద్ర పన్నుల్లో వాటా 5 శాతం మేర మాత్రమే వచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రుణాల కింద 48,724.12 కోట్లు సమీకరించుకోవాలన్నది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యంకాగా.. ఇప్పటివరకు రూ.14,500 కోట్లను ఆర్బీఐ నుంచి బాండ్లను వేలం ద్వారా సమకూర్చుకుంది. మరో రూ.10 వేల కోట్ల రుణ వెసులుబాటుకు కేంద్రం అంగీకరించింది. లక్ష్యం మేరకు మరో రూ.25 వేల కోట్లవరకు బహిరంగ మార్కెట్ నుంచి రుణాలనే సేకరించాల్సి ఉంది. అయితే కార్పొరేషన్ల కింద తీసుకున్న రుణాల విషయం ఇంతవరకు తేలలేదు. ఈ విషయంలో కేంద్రం వెనక్కి తగ్గకుంటే భారీగా నిధుల లోటు ఏర్పడుతుందని ఆర్థిక శాఖ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రత్యేక అసెంబ్లీ సమావేశంపైనా.. భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా ఈనెల 21న నిర్వహించే అసెంబ్లీ ప్రత్యేక సమావేశం, స్థానిక సంస్థల సమావేశాలు, మునుగోడు ఉప ఎన్నిక, ఇతర అంశాలు కూడా కేబినెట్ భేటీలో చర్చకు రానున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. చదవండి: నేతిబీరకాయలో నేతి లాంటిదే.. నీతి ఆయోగ్‌లోని నీతి: మంత్రి కేటీఆర్ ట్వీట్ -
కట్టడిలో ద్రవ్యలోటు.. ఇండియా రేటింగ్స్ నివేదిక
ముంబై: ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) లక్ష్యం కన్నా తక్కువగా 6.6 శాతంగానే నమోదవుతుందన్న అభిప్రాయాన్ని ఇండియా రేటింగ్స్ నివేదిక వ్యక్తం చేసింది. ఈ నెల ప్రారంభంలో ప్రభుత్వం రూ.3.73 లక్షల కోట్ల అదనపు వ్యయ ప్రణాళికలు ప్రకటించినప్పటికీ ద్రవ్యలోటు కట్టుతప్పదని విశ్లేషించింది. ఆదాయాలు బాగుండడం, వివిధ మంత్రిత్వశాఖల తక్కువ వ్యయాలు దీనికి ప్రధాన కారణంగా పేర్కొంది. కరోనా తీవ్ర పరిస్థితుల నేపథ్యంలో 2020–21 స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ) ద్రవ్యలోటు 9.3 (లక్ష్యం 3.5 శాతం) శాతంగా నమోదయ్యింది. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం దీనిని 6.8 శాతం (రూ.15.06 లక్షల కోట్లు) వద్ద కట్టడి చేయాలని 2021–22 బడ్జెట్ నిర్దేశించింది. ద్రవ్యలోటు అక్టోబర్ ముగిసే నాటికి రూ. 5,47,026 కోట్లుగా నమోదయ్యింది. 2021–22 బడ్జెట్ అంచనాల్లో (బడ్జెట్ అంచనా రూ.15.06 లక్షల కోట్లు) ఇది 36.3 శాతం. ఆర్బీఐసహా పలు విశ్లేషణా సంస్థలు 6.8 శాతం వద్ద ద్రవ్యలోటు కట్టడి కష్టమని విశ్లేషిస్తున్న నేపథ్యంలో ఇండియా రేటింగ్స్ తాజా ప్రకటన చేయడం గమనార్హం. బడ్జెట్ అంచనాలను మించి పన్ను వసూళ్లు రూ.5.9 లక్షల కోట్లుగా నమోదవుతాయని ఇండియా రేటింగ్స్ పేర్కొంది. 2025–26 ఆర్థిక సంవత్సరం నాటికి ద్రవ్యలోటును 4.5 శాతానికి తీసుకురావడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని సీతారామన్ 2021–22 బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. చదవండి:100 ట్రిలియన్ డాలర్లకి చేరుకోనున్న ప్రపంచ ఎకానమీ -
ఇదేం ఆర్థిక క్రమశిక్షణ బాబూ?!
తాత్కాలిక కార్యాలయంలో సీసీ కెమెరాలకు రూ. 1.08 కోట్లు లేక్‌వ్యూ అతిథిగృహంలో ఏర్పాటుకు నేడో, రేపో ఉత్తర్వులు హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన హైటెక్కు పాలన ఇంకా మరిచిపోలేదు. లోటు బడ్జెట్‌తో ఉన్న రాష్ట్రానికి ఆర్థిక వనరులు సమకూర్చుకునే వరకు క్రమశిక్షణ పాటించాల్సిందేనంటూ జీవోలిచ్చిన టీడీపీ సర్కారు.. స్వీయ ఆచరణలో మాత్రం ఇవేవీ కానరావడం లేదు. చెట్ల కింద కూర్చొనైనా పాలన సాగిస్తామని చెప్తున్న చంద్రబాబు.. ఇప్పుడు తన కార్యాలయానికి హంగుల కోసం ఏకంగా కోట్లు కుమ్మరించేస్తున్నారు. తన తాత్కాలిక క్యాంపు కార్యాలయంగా వినియోగించుకుంటున్న లేక్‌వ్యూ అతిథిగృహానికి కేవలం సీసీ కెమెరాల ఏర్పాటు నిమిత్తమే ఏకంగా రూ. 1.08 కోట్లు వెచ్చించనున్నారు. ఇందుకు ఆర్థికశాఖ ఆమోదం కూడా పూర్తయింది. నిధుల మంజూరు వ్యవహారం ఆర్ అండ్ బీకి చేరింది. ఇందుకు సంబంధించి మంగళ, బుధవారాల్లో జీవో విడుదల కానుంది. రెండు నెలల్లో ఏపీ పాలన మొత్తం విజయవాడ నుంచే సాగుతుందని అటు మంత్రులు, ఇటు సీఎం సైతం ప్రకటనలు చేస్తున్నారు. తాత్కాలిక రాజధానిగా విజయవాడను ఎంపిక చేసినట్లు ఇటీవలే ప్రకటించారు. ప్రభుత్వ విభాగాధిపతులు తమ కార్యాలయాల్ని తరలించాలని ఉన్నత స్థాయిలోనే సూచనలు అందుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కొన్ని నెలలు తాత్కాలిక కార్యాలయం కోసం ఇంత మొత్తంలో నిధుల వెచ్చింపుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. -
లోటు భర్తీకి కేటాయింపులు చేయండి
కేంద్రాన్ని కోరనున్న చంద్రబాబు హైదరాబాద్: ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో ప్రణాళికేతర పద్దులో ఏర్పడుతున్న రూ.15,691 కోట్ల లోటును భర్తీ చేయడానికి వీలుగా త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో కేటాయింపులు చేయాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రాన్ని కోరనున్నారు. విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు పలు అంశాలపై ప్రధానమంత్రి, పలువురు కేంద్ర మంత్రులతో చర్చిం చేందుకు బాబు గురువారం నుంచి రెండురోజుల పాటు ఢిల్లీలో మకాం వేయనున్నారు. విభజన కారణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏర్పడే రెవెన్యూ లోటును భర్తీ చేస్తామని రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న విష యం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో రాష్ట్రానికి రూ.15,691 కోట్ల లోటు ఏర్పడుతున్నట్టు తేల్చారు. బడ్జెట్ కేటారుుంపులతో ఈ లోటును భర్తీ చేయూలని కోరనున్న సీఎం.. విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్, జలవనరుల మంత్రి ఉమాభారతి, మానవ వనరుల మంత్రి స్మృతి ఇరానీ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు, ఆర్ధికమంత్రి అరుణ్‌జైట్లీ, రైల్వేమంత్రి సదానందగౌడలతో సమావేశం కానున్నారు. -
చీకటి నుంచి చీకటికి
విభజన పర్యవసానంగా దాదాపు 90,000 వేల కోట్ల అప్పుల భారంతో 15,000 వేల కోట్ల లోటు బడ్జెట్‌తో కొత్త సంసారాన్ని ప్రారంభిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట ఆర్థిక పరిస్థితి ఊహించని విధంగా సంక్షోభంలో పడింది. తెలుగు జాతి ఆశా సౌధంగా నిర్మించుకొన్న ఆంధ్రప్రదేశ్ రెండు ముక్కలయ్యింది. రాష్ర్ట విభజనతో దగాపడ్డ రాయలసీమ, ఉత్తరాంధ్ర, మధ్య దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాల ప్రజలు తీవ్రమైన ఆందోళనలో కొట్టుమిట్టాడుతున్నారు. రాయలసీమ మనుగడ ప్రశ్నార్థకమయ్యింది. రాష్ర్ట విభజనలో కాంగ్రెస్‌కు ఎంత భాగస్వామ్యమున్నదో, భారతీయ జనతాపార్టీకి కూడా అంతే భాగస్వామ్యమున్నది. కాబట్టి ప్రస్తుతం అధికారం చేపట్టిన మోడీకి ఆంధ్రులకు జరిగిన నష్టాన్ని భర్తీ చేయవలసిన బాధ్యత ఉంది. అభివృద్ధికి కేంద్రంగా, ఆదాయానికి నెలవుగా, ఉపాధికి కల్పవృక్షంగా ఉన్న హైదరాబాద్ మహానగరాన్ని కోల్పోయిన కోస్తాంధ్ర, రాయలసీమ ప్రజానీకానికి ఉపాధికల్పనతో కూడిన ఆర్థిక, పారిశ్రామికాభివృద్ధి తక్షణావసరం. విభజన పర్యవసానంగా దాదాపు 90,000 వేల కోట్ల అప్పుల భారంతో 15,000 వేల కోట్ల లోటు బడ్జెట్‌తో కొత్త సంసారాన్ని ప్రారంభిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట ఆర్థిక పరిస్థితి ఊహించని విధంగా సంక్షోభంలో పడింది. శ్రీకాకుళం నుండి నెల్లూరు జిల్లా వరకు 900కిలో మీటర్లకుపైగా విస్తరించి ఉన్న సముద్ర తీరాన్ని ఉపయోగించుకొని కొత్త ఓడరేవుల నిర్మాణం విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్, విశాఖ- కాకినాడల మధ్య పెట్రో కారిడార్, కృష్ణా-గోదావరి సహజవాయువు ఆధారంగా ఎరువుల కర్మాగారాలు, విద్యుదుత్పాదనా కేంద్రాలు వగైరా పరిశ్రమలను నెలకొల్పడానికి చర్యలు చేపట్టనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. విభజన చట్టంలో పొందుపరచిన అంశాలను ప్రాతిపదికగా తీసుకొని నేడు చర్చంతా విశాఖ- నెల్లూరు జిల్లాల మధ్య విస్తరించి ఉన్న ప్రాంతంపై కేంద్రీకరించారు. పర్యవసానంగా భూముల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ కృత్రిమ ‘హైప్’ను తగ్గించి, వాస్తవికతకు దగ్గరగా ప్రజలు ఆలోచించేలా మొదట నిర్మాణాత్మకమైన చర్యలను చేపట్టాలి. విద్యుత్ పంపిణీలోనూ ఆంధ్రప్రదేశ్ తీవ్ర అన్యాయానికి గురయ్యింది. ఆస్తులను అప్పులను, జనాభా ప్రాతిపదికపై పంపిణీ చేసి, విద్యుత్తును మాత్రం ప్రస్తుత వినియోగం ఆధారంగా పంపిణీ చేశారు. ఫలితంగా దాదాపు రెండువేల మెగావాట్ల విద్యుత్తును ఆంధ్రప్రదేశ్ నష్టపోయింది. తాత్కాలికంగా కేటాయిస్తే అర్థం చేసుకోవచ్చు. కానీ శాశ్వతంగా నష్టపరచి, నూతన పరిశ్రమల రాకకు అవరోధం కల్పించడం ఏ మేరకు సమంజసం? విద్యుత్ అవసరాల కోసం ప్రత్యామ్నాయంగా సౌర విద్యుత్, పవన విద్యుత్ ఉత్పత్తికి పెద్ద ఎత్తున నిధులను వెచ్చిస్తే సత్పలితాలుంటాయి. భవిష్యత్తు తరాల తలరాతలతో ముడిపడి ఉన్న మౌలిక సమస్యల పరిష్కారానికి నడుం బిగించాలి. నేడు జరుగుతున్న చర్చల సరళిని పరిశీలిస్తే లోపభూయిష్టమైన కేంద్రీకృత అభివృద్ధి ప్రణాళికలే మళ్లీ అమలులోకి వచ్చేలా సూచనలు కనబడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన 1956 నాటికి విశాఖలో హిందుస్థాన్ షిప్‌యార్డు, హైదరాబాద్ ఆల్విన్, నిజామాబాద్‌లో నిజాం చక్కెర పరిశ్రమలు మాత్రమే కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వ రంగ సంస్థలు ఉండేవి. 1965-75 మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ కేంద్రంగా ఇ.సి.ఐ.ఎల్., బి.హెచ్.ఇయల్., ఐ.డి.పి.ఎల్, హెచ్.యం.టి, మిథాని, యన్.యం.డి.సి., యన్.యఫ్.సి., విశాఖపట్నంలో బి.హెచ్.పి.వి., జెన్కో లాంటి భారీ పరిశ్రమలను ప్రభుత్వ రంగంలోనూ, కోరమాండల్ ఎరువుల కర్మాగారాన్ని ప్రైవేటు రంగంలోనూ నెలకొల్పడంతో పారిశ్రామికాభివృద్ధి ఊపందుకొన్నది. ప్రభుత్వ పెట్టుబడులతో భారీ పరిశ్రమలు, మౌలిక సదుపాయాల కల్పన పర్యవసానంగా ముఖ్యంగా హైదరాబాద్, కొంత వరకు విశాఖపట్నం కేంద్రాలలో పారిశ్రామికాభివృద్ధికి బలమైన పునాదులు పడినాయి. ప్రయివేటు పెట్టుబడులు ఇబ్బడిముబ్బడిగా తరలి వచ్చి అభివృద్ధికి పాలుపంచుకొన్నాయి. కానీ నేడు సరళీకృత ఆర్థిక విధానాల అమలు మూలంగా ప్రభుత్వం పెట్టుబడులు పెట్టి పరిశ్రమలను నెలకొల్పే విధానానికి స్వస్తి చెప్పారు. ఈ పూర్వరంగంలో పారిశ్రామికాభివృద్ధికి కేవలం ప్రైవేటు పెట్టుబడులపైనే ఆధారపడవలసిన అనివార్య పరిస్థితి. కానీ రాయలసీమ లాంటి ప్రాంతాలలో ప్రభుత్వ పెట్టుబడులతో పారిశ్రామికాభివృద్ధి చేయకుంటే ఎండమావిగానే మిగిలిపోతుంది. శ్రీకాళహస్తి సమీపంలోని మన్నవరం వద్ద బి.హెచ్.ఇ.యల్., యన్.టి.పి.సి సంస్థలు సంయుక్తంగా నెలకొల్పుతున్న విద్యుత్ పరికరాల పరిశ్రమను సత్వరం పూర్తి చేసి ఉత్పత్తి ప్రారంభించడానికి చర్యలు చేపట్టాలి. తిరుపతి కేంద్రాన్ని ఉన్నత విద్యా కేంద్రంగా, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడంతో పాటు, చుట్టు ప్రక్కల ప్రాంతాలలో ఐ.టి. తదితర పారిశ్రామికాభివృద్ధికి అనువైన వాతావరణాన్ని నిర్మించాలి. ఒకవైపున చెన్నై, రెండవ వైపున బెంగళూర్, అలాగే కృష్ణపట్నం ఓడరేవుకు సమీపంలో ఉండడం వల్ల మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. కడప జిల్లాలో ప్రైవేటు రంగంలోస్థాపించ తలపెట్టి అర్థాంతరంగా ఆగిపోయిన బ్రహ్మణి ఉక్కు కర్మాగారం స్థానంలో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఉక్కు పరిశ్రమను స్థాపించవచ్చు. అనంతపురం జిల్లాలో నెలకొల్పి తలపెట్టి మూలనపడిన లేపాక్షి పారిశ్రామికవాడ ప్రతిపాదనను ఆచరణలోకి తీసుకురావచ్చు. రేణిగుంట రైల్వే వ్యాగన్ రిపేర్ కర్మాగారం స్థాయిని పెంచవచ్చు. కర్నూలు జిల్లాలో ఖనిజాధార పరిశ్రమలకు పుష్కలంగా అవకాశాలున్నాయి. కడప జిల్లాలోని యర్రగుంట్ల, అనంతపురం జిల్లాలోని తాడిపత్రి పరిసరాలలో సిమెంటు కర్మాగారాలు మినహాయిస్తే చెప్పుకోతగ్గ పరిశ్రమలే రాయలసీమలో లేవు. ఈ ప్రాంతాన్ని వేధిస్తున్న అతి పెద్ద సమస్య నీరు. దానికి పరిష్కారాన్ని కనుగొనాలి. -
తొలి అడుగు.. లోటు బడ్జెట్‌తో మొదలు..
-
ఆసియాలో కుబేరుల జోరు..
న్యూఢిల్లీ: ఆర్థిక అనిశ్చిత పరిస్థితులున్నప్పటికీ, ఆసియా ప్రాంతంలో బిలియనీర్ల సంఖ్య పెరుగుతోందని వెల్త్-ఎక్స్ మ్యాగజైన్, యూబీఎస్ల బిలియనీర్ సెన్సస్ 2013 తాజా నివేదిక పేర్కొంది. ఈ ఏడాది ఆసియా ప్రాంతంలో 18 మంది కొత్తగా బిలియనీర్లయ్యారని , ఇదొక రికార్డని ఈ నివేదిక పేర్కొంది. 3 కోట్ల డాలర్లకు పైగా సంపద ఉన్న వారిని ఈ నివేదిక బిలియనీర్లుగా వ్యవహరించింది. ఆసియాలో బిలియనీర్ల జోరు ఇలానే కొనసాగితే, ఐదేళ్లలో బిలియనీర్ల విషయంలో ఈ ప్రాంతం దక్షిణ అమెరికా సరసన చేరుతుంది. మొత్తం మీద ఆసియాలో 44,505 మంది కొత్త ఆల్ట్రా హై నెట్‌వర్త్ వ్యక్తులున్నారు. వీరందని సంపద 6,590 కోట్ల డాలర్లుగా ఉంది. మొత్తం మీద ఈ ఏడాదికి అంతర్జాతీయంగా బిలియనీర్ల సంఖ్య 2,170కు చేరింది.