న్యూఢిల్లీ: స్థూల అడ్వాన్స్‌లు 2022 సెప్టెంబర్ త్రైమాసికం చివరినాటికి 20 శాతం పెరిగి రూ.22,802 కోట్లకు చేరుకున్నాయని ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ శుక్రవారం ప్రకటించింది. గతేడాది ఇదే కాలం నాటికి ఇది రూ.18,978 కోట్లుగా ఉందని వెల్లడించింది.
ఈ ఏడాది జూలై–సెప్టెంబర్‌లో బ్యాంక్ ఇచ్చిన రుణాలు 22 శాతం ఎగసి రూ.3,845 కోట్లుగా ఉంది. మొత్తం డిపాజిట్లు 20 శాతం అధికమై రూ.21,726 కోట్లకు చేరుకున్నాయి. రిటైల్ టెర్మ్ డిపాజిట్లు 13 శాతం దూసుకెళ్లి రూ.7,665 కోట్లు నమోదైంది.
కరెంట్ అకౌంట్ సేవింగ్స్ అకౌంట్స్ (కాసా) రూ.8,200 కోట్ల నుంచి రూ.10,456 కోట్లకు ఎగసింది. నిధుల కోసం చెల్లిస్తున్న వడ్డీ (కాస్ట్ ఆఫ్ ఫండ్స్) 6.81 నుంచి 6.25 శాతానికి వచ్చి చేరిందని బ్యాంక్ వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment