Equitas Holdings
-
ఈక్విటాస్ ఎస్ఎఫ్బీ జోరు
న్యూఢిల్లీ: స్థూల అడ్వాన్స్‌లు 2022 సెప్టెంబర్ త్రైమాసికం చివరినాటికి 20 శాతం పెరిగి రూ.22,802 కోట్లకు చేరుకున్నాయని ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ శుక్రవారం ప్రకటించింది. గతేడాది ఇదే కాలం నాటికి ఇది రూ.18,978 కోట్లుగా ఉందని వెల్లడించింది. ఈ ఏడాది జూలై–సెప్టెంబర్‌లో బ్యాంక్ ఇచ్చిన రుణాలు 22 శాతం ఎగసి రూ.3,845 కోట్లుగా ఉంది. మొత్తం డిపాజిట్లు 20 శాతం అధికమై రూ.21,726 కోట్లకు చేరుకున్నాయి. రిటైల్ టెర్మ్ డిపాజిట్లు 13 శాతం దూసుకెళ్లి రూ.7,665 కోట్లు నమోదైంది. కరెంట్ అకౌంట్ సేవింగ్స్ అకౌంట్స్ (కాసా) రూ.8,200 కోట్ల నుంచి రూ.10,456 కోట్లకు ఎగసింది. నిధుల కోసం చెల్లిస్తున్న వడ్డీ (కాస్ట్ ఆఫ్ ఫండ్స్) 6.81 నుంచి 6.25 శాతానికి వచ్చి చేరిందని బ్యాంక్ వివరించింది. -
ఈక్విటాస్ స్మాల్ బ్యాంక్.. వీక్ లిస్టింగ్
ఇటీవల పబ్లిక్ ఇష్యూకి వచ్చిన ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లిస్టింగ్‌లో ఇన్వెస్టర్లను నిరాశపరచింది. స్టాక్ ఎక్స్ఛేంజీలలో 6 శాతం తక్కువగా రూ. 31 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. ఇష్యూ ధర రూ. 33తో పోలిస్తే ఇది 6 శాతం తక్కువకాగా.. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో స్వల్ప నష్టంతో రూ. 32.45 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 32.65 వద్ద గరిష్టాన్ని తాకగా.. రూ. 30 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. రెండు రెట్లు కొద్ది రోజుల క్రితం పబ్లిక్ ఇష్యూకి వచ్చిన ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ రూ. 517 కోట్లు సమకూర్చుకుంది. ఇష్యూకి దాదాపు రెండు రెట్లు అధికంగా స్పందన లభించింది. ఆఫర్లో భాగంగా 11.6 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచగా.. 22.6 కోట్ల షేర్లకోసం దరఖాస్తులు లభించాయి. రిటైల్ విభాగం రెండు రెట్లు అధికంగా సబ్స్క్రిప్షన్ సాధించింది. ఇష్యూ నిధులను భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా టైర్-1 క్యాపిటల్‌ను పటిష్ట పరచుకునేందుకు వినియోగించనున్నట్లు బ్యాంక్ ఇప్పటికే తెలియజేసింది. ఈక్విటాస్ హోల్డింగ్స్ ప్రమోటర్‌గా కలిగిన ఈక్విటాస్ స్మాల్ బ్యాంక్ ఆర్బీఐ నిబంధనలకు అనుగుణంగా ఐపీవోను చేపట్టింది. లైసెన్సింగ్ మార్గదర్శకాల ప్రకారం కార్యకలాపాలు ప్రారంభించిన మూడేళ్లలోగా స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్ట్‌కావలసి ఉంది. గత రెండేళ్లలో గత రెండేళ్ల కాలంలో అంటే 2018-20 మధ్య కాలంలో ఈక్విటాస్ స్మాల్ బ్యాంక్ ఆదాయంలో 29 శాతం వృద్ధిని సాధించింది. వార్షిక ప్రాతిపదికన డిపాజిట్లు 39 శాతం, రుణ విడుదల 31 శాతం చొప్పున పుంజుకున్నాయి. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 2.72 శాతాన్ని తాకగా.. నికర ఎన్పీఏలు 1.66 శాతానికి చేరాయి. -
ఈక్విటాస్ స్మాల్ బ్యాంక్‌కు యాంకర్ నిధులు
ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ పబ్లిక్ ఇష్యూ తొలి రోజు(మంగళవారం) 39 శాతం బిడ్స్ దాఖలయ్యాయి. ఐపీవోలో భాగంగా కంపెనీ 11.58 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచగా.. ప్రస్తుతం 4.54 కోట్ల షేర్లకు బిడ్స్ దాఖలయ్యాయి. రిటైల్ ఇన్వెస్టర్ల విభాగంలో అత్యధికంగా 85 శాతం దరఖాస్తులు లభించాయి. ఇష్యూలో భాగంగా 35 యాంకర్ ఇన్వెస్టర్ సంస్థలకు షేరుకి రూ. 33 ధరలో 4.23 కోట్లకుపైగా షేర్లను కేటాయించింది. తద్వారా దాదాపు రూ. 140 కోట్లు సమీకరించింది. ఈక్విటాస్ స్మాల్ బ్యాంక్ ఐపీవోలో ఇన్వెస్ట్ చేసిన యాంకర్ సంస్థలలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్, ఎస్బీఐ లైఫ్, ఫ్రాంక్లిన్ ఇండియా స్మాలర్ కంపెనీస్ ఫండ్, మిరాయి అసెట్ లార్జ్ క్యాప్ ఫండ్, హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ తదితరాలున్నాయి. టైర్-1 క్యాపిటల్ కోసం గురువారం(22న) ముగియనున్న ఈక్విటాస్ స్మాల్ బ్యాంక్ ఐపీవోకి ధరల శ్రేణి రూ. 32-33కాగా.. 450 షేర్లను ఒక లాట్‌గా కేటాయించారు. దీంతో రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 450 షేర్లకు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 518 కోట్లవరకూ సమకూర్చుకోవాలని భావిస్తోంది. ఇష్యూ నిధులతో టైర్-1 క్యాపిటల్‌ను పటిష్టపరచుకోనుంది. తద్వారా భవిష్యత్ అవసరాలకు వినియోగించుకోనున్నట్లు ప్రాస్పెక్టస్‌లో కంపెనీ పేర్కొంది. కంపెనీ తొలుత పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ. 1,000 కోట్లు సమీకరించాలని ఆశించింది. కనీస పెట్టుబడుల నిష్పత్తి మెరుగుపడటంతోపాటు, క్యాపిటల్ మార్కెట్ పరిస్థితుల ఆధారంగా ప్రణాళికలను సవరించుకున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. ప్రమోటర్ వాటా పబ్లిక్ ఇష్యూలో భాగంగా ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 7.2 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచనుంది. వీటికి అదనంగా రూ. 280 కోట్ల విలువైన షేర్లను సైతం జారీ చేయనుంది. ఐపీవో తదుపరి బ్యాంక్‌లో ప్రమోటర్ల వాటా 82 శాతానికి పరిమితంకానుంది. 2021 సెప్టెంబర్‌కల్లా ఈ వాటాను 40 శాతానికి తగ్గించుకోవలసి ఉన్నట్లు నిపుణులు పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం ఆపై 2028 సెప్టెంబర్‌కల్లా 26 శాతానికి పరిమితం చేసుకోవలసి ఉన్నట్లు వివరించారు. మూడో కంపెనీ పబ్లిక్ ఇష్యూ పూర్తయ్యాక ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్.. దేశీ స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టయిన మూడో కంపెనీగా నిలవనుంది. ఎన్బీఎఫ్సీ ఈక్విటాస్ హోల్డింగ్స్‌కు పూర్తి అనుబంధ సంస్థ ఇది. ఇప్పటికే ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎక్స్ఛేంజీలలో లిస్టింగ్ పొందాయి. క్రిసిల్ నివేదిక ప్రకారం బ్యాంకింగ్ ఔట్లెట్స్ ద్వారా 2019లో ఈక్విటాస్ స్మాల్ బ్యాంక్ తొలి ర్యాంకులో నిలిచింది. ఈ విభాగంలో నిర్వహణలోని ఆస్తులు, డిపాజిట్ల రీత్యా రెండో పెద్ద సంస్థగా ఆవిర్భవించింది. దేశీయంగా ఏయూఎంలో 16 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. -
ఈక్విటాస్ స్మాల్ బ్యాంక్ ఐపీవో రేపు
ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ పబ్లిక్ ఇష్యూ మంగళవారం(20) ప్రారంభంకానుంది. ఇష్యూకి ధరల శ్రేణి రూ. 32-33కాగా.. 450 షేర్లను ఒక లాట్‌గా కేటాయించారు. దీంతో రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 450 షేర్లకు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 518 కోట్లవరకూ సమకూర్చుకోవాలని భావిస్తోంది. నేడు యాంకర్ ఇన్వెస్టర్లకు షేర్లను విక్రయించడం ద్వారా కొంతమేర నిధులను సమీకరించనుంది. ఇష్యూ నిధులతో టైర్-1 క్యాపిటల్‌ను పటిష్టపరచుకోనుంది. తద్వారా భవిష్యత్ అవసరాలకు వినియోగించుకోనున్నట్లు ప్రాస్పెక్టస్‌లో కంపెనీ పేర్కొంది. కంపెనీ తొలుత పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ. 1,000 కోట్లు సమీకరించాలని ఆశించింది. కనీస పెట్టుబడుల నిష్పత్తి మెరుగుపడటంతోపాటు, క్యాపిటల్ మార్కెట్ పరిస్థితుల ఆధారంగా ప్రణాళికలను సవరించుకున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. ప్రమోటర్ వాటా పబ్లిక్ ఇష్యూలో భాగంగా ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 7.2 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచనుంది. వీటికి అదనంగా రూ. 280 కోట్ల విలువైన షేర్లను సైతం జారీ చేయనుంది. ఐపీవో తదుపరి బ్యాంక్‌లో ప్రమోటర్ల వాటా 82 శాతానికి పరిమితంకానుంది. 2021 సెప్టెంబర్‌కల్లా ఈ వాటాను 40 శాతానికి తగ్గించుకోవలసి ఉన్నట్లు నిపుణులు పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం ఆపై 2028 సెప్టెంబర్‌కల్లా 26 శాతానికి పరిమితం చేసుకోవలసి ఉన్నట్లు వివరించారు. మూడో కంపెనీ పబ్లిక్ ఇష్యూ పూర్తయ్యాక ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్.. దేశీ స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టయిన మూడో కంపెనీగా నిలవనుంది. ఎన్బీఎఫ్సీ ఈక్విటాస్ హోల్డింగ్స్‌కు పూర్తి అనుబంధ సంస్థ ఇది. ఇప్పటికే ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎక్స్ఛేంజీలలో లిస్టింగ్ పొందాయి. క్రిసిల్ నివేదిక ప్రకారం బ్యాంకింగ్ ఔట్లెట్స్ ద్వారా 2019లో ఈక్విటాస్ స్మాల్ బ్యాంక్ తొలి ర్యాంకులో నిలిచింది. ఈ విభాగంలో నిర్వహణలోని ఆస్తులు, డిపాజిట్ల రీత్యా రెండో పెద్ద సంస్థగా ఆవిర్భవించింది. దేశీయంగా ఏయూఎంలో 16 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. -
ఈక్విటాస్ ఐపీఓకు 17 రెట్లు సబ్స్క్రిప్షన్
ముంబై: చిన్న ఫైనాన్స్ బ్యాంక్ ఏర్పాటు చేయడానికి లెసైన్సు కలిగిన ఈక్విటాస్ హోల్డింగ్స్ ఐపీఓకు భారీ స్పందన లభిం చింది. ఐపీఓ చివరిరోజైన గురువారంనాటికి 17.21 రెట్లు ఓవర్ సబ్స్క్రయిబ్ అయ్యింది. రూ. 109-110 ప్రైస్‌బ్యాండ్‌తో 13.91 కోట్ల షేర్లను జారీచేస్తుండగా, 239 కోట్ల షేర్లకు రూ. 37,000 కోట్ల విలువైన బిడ్స్ రావడం విశేషం. రిటైల్ ఇన్వెస్టర్ల విభాగం 1.31 రెట్లు ఓవర్‌సబ్‌స్క్రయిబ్ అయ్యింది.