క్రీడలకు రూ. 54.94 కోట్లు | Games to Rs. 54.94 crore | Sakshi
Sakshi News home page

క్రీడలకు రూ. 54.94 కోట్లు

Published Tue, Mar 14 2017 12:38 AM | Last Updated on Tue, Sep 5 2017 5:59 AM

Games to Rs. 54.94 crore

హైదరాబాద్‌: రాష్ట్ర యువజన సర్వీసులు, క్రీడా శాఖలకు తెలంగాణ ప్రభుత్వం పెద్దగా ప్రాధాన్యత చూపించినట్టు బడ్జెట్‌లో కనిపించలేదు. నామమాత్రంగా నిధులు కేటాయించినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రగతి పద్దు కింద ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.54.94 కోట్లు కేటాయించారు. ఈ నిధుల్లో యూత్‌ అడ్వాన్స్, టూరిజం విభాగానికి రూ.2.41 కోట్లు, యువశక్తి పథకానికి రూ.19.40 కోట్లు, ఎన్‌సీసీ విభాగానికి రూ.21.91, రాష్ట్ర స్పోర్ట్స్‌ అథారిటీ (శాట్స్‌)కు రూ.11.20 కోట్లు కేటాయించారు.

నిర్వహణ పద్దు కింద ఈ శాఖలకు రూ.49.36 కోట్లు కేటాయించారు. గత ఆర్థిక సంవత్సరంలో యువజన సర్వీసులు, క్రీడ శాఖకు ప్రణాళిక బడ్జెట్‌ కింద రూ.62 కోట్లు కేటాయించగా, కేవలం రూ.15 కోట్లు మాత్రమే వినియోగించారు. మిగిలిన రూ.47 కోట్లను ప్రభుత్వం ఈ ఆర్థిక ఏడాదికి సవరించింది. ప్రణాళికేతర వ్యయం కింద గతేడాది రూ.56.82 కోట్లను కేటాయించింది. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement