Department of Sports
-
నిఖత్ విదేశీ శిక్షణకు క్రీడా శాఖ ఆమోదం
పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తెలంగాణ స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్‌తోపాటు ప్రీతి, పర్వీన్, లవ్లీనా విదేశీ గడ్డపై శిక్షణ తీసుకోనున్నారు. ఒలింపిక్స్ సన్నాహాల కోసం ఈ నలుగురు బాక్సర్లు టర్కీ వెళ్లనున్నారు. ఈ నలుగురు బాక్సర్ల శిక్షణకు అయ్యే మొత్తం ఖర్చును భరిస్తామని కేంద్ర క్రీడా శాఖ ప్రకటించింది. క్రొయేషి యా, చెక్ రిపబ్లిక్లో జరిగే అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొనేందుకు భారత టేబుల్ టెన్నిస్ స్టార్ మనిక బత్రాకు అయ్యే ఖర్చులు భరిస్తామని క్రీడా శాఖ తెలిపింది. -
ఆట మారుతుందా?
బరిలో ఆట కన్నా బాసు హోదాలో సీటు ముఖ్యమని పేరుబడ్డ మన క్రీడాసంస్థల్లో మార్పు వస్తోందంటే అంతకన్నా ఇంకేం కావాలి! ఒలింపిక్స్, కామన్వెల్త్ గేమ్స్, ఆసియా క్రీడోత్సవాల లాంటి అంతర్జాతీయ వేదికలపై మన దేశానికి ప్రాతినిధ్యం వహించే అథ్లెట్లను ఎంపిక చేసే ప్రతిష్ఠా త్మక క్రీడాసంఘానికి క్రీడా నిపుణులే సారథ్యం వహిస్తున్నారంటే సంతోషమేగా! ఎప్పుడో 95 ఏళ్ళ క్రితం ఏర్పాటైన పేరున్న క్రీడాసంఘం ‘ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్’ (ఐఓఏ)కు తొలి సారిగా ఓ మహిళా క్రీడాకారిణి పగ్గాలు చేపట్టనుండడం కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. గతంలో పలు వివాదాలకు గురైన ఐఓఏకు డిసెంబర్ 10న ఎన్నికలు. నామినేషన్ల తుది గడువు ఆదివారం ముగిసేసరికి, ప్రసిద్ధ మాజీ అథ్లెట్ పీటీ ఉష ఒక్కరే అధ్యక్ష పదవికి బరిలో ఉండడంతో ఆమె ఎన్నిక ఏకగ్రీవమైంది. ఈసారి ఐఓఏ కార్యవర్గంలో ఈ పరుగుల రాణితో పాటు ప్రసిద్ధ ఆటగాళ్ళ ఎన్నిక ఖాయంగా కనిపిస్తోంది. భారత క్రీడాంగణంలో ఇది నూతన ఉషోదయం అనిపిస్తోంది. అవినీతి, ఆశ్రితపక్షపాతం, రాజకీయ పార్టీలకు ఆలవాలంగా మన దేశంలోని క్రీడాసమాఖ్యలు అపకీర్తిని సంపాదించుకున్నాయి. ఆ కుళ్ళు కంపుతో, అందరూ ప్రక్షాళనకు ఎదురుచూస్తున్న వేళ ఐఓఏకు తొలిసారిగా ఒక మహిళ, ఒక ఒలింపిక్ ప్లేయర్, ఒక అంతర్జాతీయ పతక విజేత పగ్గాలు చేపట్టడం నిజంగానే చరిత్ర. వాస్తవానికి, పాలనాపరమైన అంశాలను తక్షణం పరిష్కరించుకోవా లనీ, లేదంటే సస్పెన్షన్ వేటు తప్పదనీ అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం (ఐఓసీ) సెప్టెంబర్‌లోనే ఐఓఏకు తుది హెచ్చరిక చేసింది. డిసెంబర్ లోగా ఎన్నికలు జరపాలని గడువు పెట్టింది. గతంలో పదేళ్ళ క్రితం ఐఓసీ ఇలాగే సస్పెన్షన్ వేటు వేయడం గమనార్హం. తాజా హెచ్చరికల పర్యవసానమే ఈ ఎన్నికలు. కొత్తగా కనిపిస్తున్న మార్పులు. ఆసియా క్రీడోత్సవాల్లో నాలుగుసార్లు ఛాంపియన్, ప్రస్తుత రాజ్యసభ సభ్యురాలైన 58 ఏళ్ళ ఉషకు ఇప్పుడు ఈ కిరీటం దక్కడం ముదావహం. ఈసారి ఐఓఏ కార్యవర్గ (ఈసీ) ఎన్నికల నామినేషన్లలో ఆసక్తికరమైన అంశాలేమిటంటే – గడచిన ఈసీలో ఉన్నవారెవరూ ఈసారి నామినేషన్ వేయలేదు. అలాగే, ఈసీలో సగం మందికి పైగా క్రీడాకారులున్నారు. మొత్తం 15 మంది సభ్యుల ప్యానెల్లో పీటీ ఉష కాక లండన్ ఒలింపిక్స్‌లో స్వర్ణపతక విజేత – షూటర్ గగన్ నారంగ్ (ఉపాధ్యక్షుడు) సహా మరో అరడజను మంది ఆటగాళ్ళకు చోటు దక్కింది. మల్లయోధుడు యోగేశ్వర్ దత్, విలువిద్యా నిపుణురాలు డోలా బెనర్జీ, అథ్లెట్ల నుంచి బాక్సింగ్ రాణి మేరీ కోమ్, అంతర్జాతీయ స్థాయి టేబుల్ టెన్నిస్ ఆటగాడు ఆచంట శరత్ కమల్ తాజా ప్యానెల్లో ఉండడం విశేషం. డిసెంబర్ 10న ఎన్నికలతో కార్యవర్గం తుదిరూపు తేలనుంది. స్వయంగా క్రీడాకారులూ, ఆటల్లో నిపుణులూ ఈసారి ఐఓఏ కార్యవర్గానికి అభ్యర్థులు కావడం ఆహ్వానించదగ్గ పరిణామమే. రేపు ఎన్నికైన తర్వాత వారి ఆటలో నైపుణ్యం, అనుభవం భారత క్రీడా రంగ భవిష్యత్తును తీర్చిదిద్దడానికి పనికొస్తాయి. అనేక దశాబ్దాలుగా ఏదో ఒక పదవిలో కూర్చొని సంస్థను ఆడిస్తున్న బడాబాబులకూ, 70 ఏళ్ళు దాటిన వృద్ధ జంబూకాలకూ ఐఓఏ రాజ్యాంగంలో సవరణల పుణ్యమా అని ఈసారి కార్యవర్గంలో చోటు లేకుండా పోయింది. చివరకు సెక్రటరీ జనరల్ రాజీవ్ మెహతా అండగా నిలిచిన వర్గానికి సైతం బరిలో నిలిచిన కొత్త ఈసీ ప్యానెల్లో స్థానం దక్కకపోవడం విశేషమే. నిజానికి, ఆటల విషయంలో నిర్ణయాత్మకమైన క్రీడా సంఘాల్లో అథ్లెట్లకు ప్రధానంగా స్థానం కల్పించాలని కోర్టులు చిరకాలంగా చెబుతున్నాయి. జాతీయ క్రీడా నియమావళి, ఐఓసీ నియమా వళి సైతం సంఘాల నిర్వహణలో ఆటగాళ్ళకే పెద్దపీట వేయాలని చెబుతున్నాయి. దేశంలోని క్రీడా సంఘాలకు పెద్ద తలకాయ లాంటి ఐఓసీలో ఇప్పటి దాకా అలాంటి ప్రయత్నాలు జరిగిన దాఖలాలు లేవు. సుప్రీమ్ కోర్ట్ మాజీ జడ్జి ఎల్. నాగేశ్వరరావు పర్యవేక్షణలో ఈసారి ఐఓసీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ప్రతిష్ఠాత్మక సంఘానికి ఆయన కొత్త రాజ్యాంగం సిద్ధం చేశారు. ఇక, ఈ సంఘంలోని మొత్తం 77 మంది సభ్యుల ఎలక్టోరల్ కాలేజ్‌లో దాదాపు 25 శాతం మాజీ అథ్లెట్లే. వారిలోనూ పురుషుల (38) సంఖ్య కన్నా స్త్రీల (39) సంఖ్య ఎక్కువ కావడం విశేషం. అందివచ్చిన అవకాశాన్ని పరుగుల రాణి ఉష, బృందం ఏ మేరకు సద్వినియోగం చేసుకుంటారో? రానున్న రోజుల్లో ఐఓఏ రోజువారీ నిర్వహణలో వీరందరి మాటా మరింతగా చెల్లుబాటు కానుంది. అయితే, అధికారంతో పాటు అపారమైన బాధ్యతా వీరి మీద ఉంది. అథ్లెట్లకు అండగా నిలుస్తూ, దేశంలో క్రీడాసంస్కృతిని పెంచి పోషించాల్సిందీ వారే. అనేక దశాబ్దాలుగా రాజకీయాల్లో తలమునకలైన దేశ అత్యున్నత క్రీడాసంఘంలో అది అనుకున్నంత సులభం కాదు. విభిన్న వర్గాలుగా చీలి, వివాదాల్లో చిక్కుకొన్న వారసత్వం ఐఓఏది. అలాగే దేశంలో ఇతర జాతీయ క్రీడా సమాఖ్యలు, పాత ఐఓఏ సభ్యులు, కొత్త రాజ్యాంగంలో ఓటింగ్ హక్కులు కోల్పోయిన రాష్ట్ర శాఖలతో తలనొప్పి సరేసరి. వీటన్నిటినీ దాటుకొని రావాలి. అనేక ఆటలతో కూడిన ప్రధాన క్రీడోత్సవాలకు ఎంట్రీలు పంపే పోస్టాఫీస్‌లా తయారైన సంఘాన్ని గాడినపెట్టాలి. మరో ఏణ్ణర్ధంలో జరగనున్న 2024 ప్యారిస్ ఒలింపిక్స్‌కు భారత ఆటగాళ్ళను సిద్ధం చేయాలి. ఉష అండ్ టీమ్ ముందున్న పెను సవాలు. కేంద్రం, క్రీడాశాఖ అండదండలతో ఈ మాజీ ఆటగాళ్ళు తమ క్రీడా జీవితంలో లాగానే ఇక్కడా అవరోధాలను అధిగమించి, అద్భుతాలు చేస్తారా? -
పర్యాటక రంగానికి ‘స్టార్’ హంగులు
సాక్షి, అమరావతి: విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రతి జిల్లాలో ఐదు నుంచి ఏడు నక్షత్రాల హోటళ్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజనశాఖ మంత్రి ముత్తంశెట్జి శ్రీనివాసరావు తెలిపారు. బుధవారం సచివాలయంలో 13 జిల్లాలకు చెందిన పర్యాటక, క్రీడా సంస్థ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. తొలిదశలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ)తో మూడుచోట్ల స్టార్ హోటళ్ల నిర్మాణాలకు పెట్టుబడిదారులతో సంప్రదింపులు జరిపినట్టు తెలి పారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి 50 శాతం హోటళ్లను అందుబాటులోకి తెచ్చేలా చర్యలు చేపడుతున్నామన్నారు. థాయిలాండ్, మలేషియా, స్విట్జర్లాండ్ వంటి 40 శాతం దేశాలు కేవలం పర్యాటకం ద్వారా వచ్చే ఆదాయంతోనే అభివృద్ధి పథంలో పయనిస్తున్నాయని చెప్పారు. వీటి తరహాలోనే రాష్ట్ర ఆదాయ వనరుగా పర్యాటక రంగాన్ని తీర్చిదిద్దుతామని చెప్పారు. పర్యాటక ప్రాంతాల్లో మౌలిక వసతులు, రవాణా, బోటింగ్ సౌకర్యాలను మెరుగుపర్చి.. ఆన్లైన్, సోషల్ మీడియా వేదికగా ప్రచారం కల్పిస్తామని, ఇందుకోసం దసరాలోగా ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడిం చారు. ఈ సమీక్షలో మంత్రి ఇంకా ఏమన్నారంటే.. పర్యాటకంపై ప్రత్యేక కార్యక్రమాలు ► పర్యాటక ప్రాంతాల ప్రాచుర్యం అందరికీ తెలిసేలా నెలకు ఒక జిల్లాలో ప్రత్యేక ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తాం. లోకల్ టూరిజం అభివృద్ధిలో భాగంగా ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలు, కోస్తా, రాయలసీమ పర్యాటక సర్క్యూట్లలో ఒక్కో మేనేజర్‌ను నియమించి.. ప్రత్యేక బస్సు నడుపుతూ ఒకటి, రెండు రోజుల ప్యాకేజీలను అందుబాటులోకి తెస్తాం. ► కోవిడ్‌కు ముందు రూ.120 కోట్లు పర్యాటక ఆదాయం వచ్చేది. ప్రస్తుతం అది రూ.60 కోట్లకు పడిపోయింది. అది కూడా కోవిడ్ ఆస్పత్రులు, కోవిడ్ కేర్ సెంటర్లలో భోజన సదుపాయం కల్పించడం వల్ల సమకూరింది. ► పర్యాటకశాఖలో కోవిడ్‌తో మృతిచెందిన 8 మంది ఉద్యోగుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సాయంతో పాటు అర్హతను బట్టి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం కల్పిస్తాం. కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ విభాగాల్లో ఒకే చోట ఐదేళ్లకు మించి పని చేస్తున్న వారికి స్థాన చలనం తప్పదు. త్వరలోనే ఖాళీలు భర్తీ చేస్తాం. సీ ప్లెయిన్లను నడిపేందుకు చర్చలు ► బోట్ల నిర్వహణ సజావుగా సాగేందుకు ఏర్పాటు చేసిన తొమ్మిది కమాండ్ కంట్రోల్ సెంటర్ల మార్గదర్శకాలకు అనుగుణంగా 24 ప్రభుత్వ, 164 ప్రైవేటు బోటు సేవలు ప్రారంభిస్తాం. విశాఖపట్నం, విజయవాడ, నాగార్జునసాగర్, సూ ర్యలంక తదితర ప్రాంతాల్లో సీ ప్లెయిన్లను నడిపేందుకు ఆయా సంస్థలతో చర్చిస్తున్నాం. ► కేంద్ర ప్రభుత్వ సహకారంతో ‘ప్రసాద్’ (పిలిగ్రిమేజ్ రెజువినేషన్ అండ్ స్పిరిచ్యువల్ అగ్మెంటేషన్ డ్రైవ్) పథకం కింద టెంపుల్ టూరిజంలో భాగంగా రూ.50 కోట్లతో శ్రీశైలం ఆలయ అభివృద్ధి చేపట్టాం. మరో రూ.50 కోట్లతో సింహాచల దేవస్థానం అభివృద్ధి పనులకు త్వరలో శంకుస్థాపన చేసి పనులు ప్రారంభిస్తాం. నూతన క్రీడా పాలసీకి సన్నాహాలు గ్రామీణ స్థాయి నుంచి క్రీడలను ప్రోత్సహించేందుకు నూతన క్రీడా పాలసీని తీసుకొస్తున్నట్టు మంత్రి ముత్తంశెట్జి శ్రీనివాసరావు తెలిపారు. ఇప్పటికే ముసాయిదా సిద్ధమైందని, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ఆమోద ముద్ర వేయిస్తామన్నారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ కింద క్రీడా ప్రాంగణాల అభివృద్ధి, క్రీడాకారులను దత్తత తీసుకునే కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తున్నట్టు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా మూడు ప్రాంతాల్లో అంతర్జాతీయ స్థాయి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను నిర్మిస్తామన్నారు. విశాఖ జిల్లా కొమ్మాదిలో క్రీడా ప్రాంగణాన్ని ఖేలో ఇండియాలో భాగంగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో అభివృద్ధి చేస్తామన్నారు. ఈ సమీక్షలో ఏపీటీడీసీ చైర్మన్ వరప్రసాద్ రెడ్డి, రాష్ట్ర క్రీడా ప్రాధికారిక సంస్థ (శాప్) చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ, ఆంధ్రప్రదేశ్ పర్యాటక సంస్థ సీఈఓ ఎస్.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
ఒలింపిక్స్ ముగిశాకే జాతీయ క్రీడా పురస్కారాలు
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్ ముగిశాకే జాతీయ క్రీడా పురస్కారాల విజేతల వివరాలు వెల్లడయ్యే అవకాశాలున్నాయి. త్వరలోనే ఒలింపిక్స్ జరుగనున్న నేపథ్యంలో ఎంపిక కసరత్తు మాత్రం ఆలస్యం కానుందని క్రీడా శాఖ వర్గాలు తెలిపాయి. టోక్యోలో భారత అథ్లెట్ల ప్రదర్శన, పతక విజేతలను బట్టి పురష్కారాలను ఖాయం చేయాలని క్రీడా శాఖ భావి స్తోంది. ‘నామినేషన్లు వచ్చాయి. గడువు కూడా ముగిసింది. కానీ టోక్యో పతక విజేతలకూ ఇందులో చోటివ్వాలని గత సమావేశంలో నిర్ణయించాం. ఒలింపిక్స్ క్రీడలు ఆగస్టు 8న ముగుస్తాయి. ఆ తర్వాత మరోసారి సమావేశమై ఎంపిక ప్రక్రియపై తుది కసరత్తు పూర్తి చేస్తాం. ఒలింపిక్స్ ముగిసిన వారం పది రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తయితే ఎప్పట్లాగే ఆగస్టు 29న అవార్డుల ప్రదానం జరుగుతుంది’ అని కేంద్ర క్రీడాశాఖ అధికారి ఒకరు వెల్లడించారు. -
‘సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్’ కేంద్రంగా స్పోర్ట్స్ స్కూల్
ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఖేలో ఇండియా’ కార్యక్రమాన్ని మరింత ఫలవంతం చేసేందుకు క్రీడా శాఖ పటిష్ట కార్యాచరణతో ముందుకొచ్చింది. దేశవ్యాప్తంగా ‘సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్’ కేంద్రాలను ఏర్పాటు చేసి వాటి ద్వారా విద్యార్థులను అంతర్జాతీయ క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రచించింది. ఈ మేరకు తెలంగాణలో హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్‌ను ‘ఖేలో ఇండియా స్టేట్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ (కేఐఎస్‌సీఈ)’ కేంద్రంగా ప్రకటించింది. దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల నుంచి ప్రతిపాదనలు రాగా మెరుగైన క్రీడా వసతులున్న ఎనిమిది రాష్ట్రాలకు కేంద్ర క్రీడా శాఖ ఆమోదముద్ర దక్కింది. అందులో తెలంగాణలోని హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్ ఒకటి. దీనితో పాటు కర్ణాటక, ఒడిశా, కేరళ, అరుణాచల్‌ప్రదేశ్, మణిపూర్, మిజోరామ్, నాగాలాండ్ రాష్ట్రాలు కూడా కేఐఎస్‌సీఈలను ఏర్పాటు చేయనున్నాయి. ఆయా రాష్ట్రాల్లో అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలు, శిక్షణ, వసతుల ఆధారంగానే వీటిని ఆమోదించినట్లు క్రీడాశాఖ వెల్లడించింది. వీటి అభివృద్ధికి కేంద్రం నుంచి గ్రాంట్ లభించనుంది. కేఐఎస్‌సీఈ హోదాకు తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్‌ను ఎంపిక చేయడం పట్ల రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాట్స్) చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ కేంద్రాల ద్వారా రాష్ట్రంలోని క్రీడాకారులకు లబ్ధి చేకూరుతుందని అన్నారు. -
ఆకట్టుకున్న అరకు ఉత్సవ్
-
అరకు ఉత్సవ్ అదుర్స్
అరకులోయ: పర్యాటక ప్రాంతం అరకులోయలో ప్రభుత్వం గిరిజన ఆచారాలను గౌరవిస్తూ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన, అరకు ఉత్సవ్– 2020 సంబరాలు అంబరాన్ని తాకాయి. ఉత్సవ్ చివరిరోజైన ఆదివారం ఉత్సవాన్ని తిలకించేందుకు పర్యాటకులతో పాటు ఏజెన్సీ వ్యాప్తంగా తరలిరావడంతో సాయంత్రం ఐదు గంటలకే ఎన్టీఆర్ మైదానం కిటకిటలాడింది. రికార్డు స్థాయిలో ప్రజలు తరలిరావడంతో ఉత్సవ్ ప్రాంగణం హోరెత్తింది. స్థానికంగా ఉన్న గిరిజన విద్యాలయాల్లోని గిరిజన విద్యార్థినులంతా పోటాపోటీగా గిరిజన సంప్రదాయలను ప్రతిబింబించే నృత్యాలు చేసి ఆహూతులను ఆకట్టుకున్నారు. ఇక గిరిజన సంప్రదాయ కొమ్ము, సవార, థింసా నృత్యాలు ప్రజలను మైమరిపించాయి. తెలుగు రాష్ట్రాల్లో తన పాటలతో ప్రసిద్ధిచెందిన గాయకురాలు మంగ్లీ ముగింపు ఉత్సవానికి రావడంతో అరకు ఉత్సవ్ వేదిక మరింత సందడిగా మారింది. ఆమె తనదైన శైలిలో పాటలు పాడి ప్రజలను హుషారెత్తించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన గిరిజన వంటకాలను కూడా పర్యాటకులు, స్థానికులు రుచిచూసి అద్భుతమని కితాబునిచ్చారు. ప్రభుత్వం అభివృద్ధి పథకాలకు సంబంధించి ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను కూడా పర్యాటకులు ఆసక్తిగా తిలకించడం కనిపించింది. అలాగే ఉత్సవ్‌ను పురష్కరించుకుని అధికార యంత్రాంగం జిల్లా క్రీడలశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వాలీబాల్, కబడ్డీ, విలువిద్య, పోటీలు ఆదివారం సాయంత్రం ఘనంగా ముగిశాయి. విజేతైన క్రీడాకారులకు అరకు ఎంపీ గోడ్డెటి మాధవి, అరకు, పాడేరు ఎమ్మెల్యేలు చెట్టి పాల్గుణ, కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి నగదు బహుమతులు, మెమొంటోలు పంపిణీ చేశారు. -
క్రీడలకు రూ. 54.94 కోట్లు
హైదరాబాద్: రాష్ట్ర యువజన సర్వీసులు, క్రీడా శాఖలకు తెలంగాణ ప్రభుత్వం పెద్దగా ప్రాధాన్యత చూపించినట్టు బడ్జెట్లో కనిపించలేదు. నామమాత్రంగా నిధులు కేటాయించినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రగతి పద్దు కింద ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.54.94 కోట్లు కేటాయించారు. ఈ నిధుల్లో యూత్ అడ్వాన్స్, టూరిజం విభాగానికి రూ.2.41 కోట్లు, యువశక్తి పథకానికి రూ.19.40 కోట్లు, ఎన్సీసీ విభాగానికి రూ.21.91, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ (శాట్స్)కు రూ.11.20 కోట్లు కేటాయించారు. నిర్వహణ పద్దు కింద ఈ శాఖలకు రూ.49.36 కోట్లు కేటాయించారు. గత ఆర్థిక సంవత్సరంలో యువజన సర్వీసులు, క్రీడ శాఖకు ప్రణాళిక బడ్జెట్ కింద రూ.62 కోట్లు కేటాయించగా, కేవలం రూ.15 కోట్లు మాత్రమే వినియోగించారు. మిగిలిన రూ.47 కోట్లను ప్రభుత్వం ఈ ఆర్థిక ఏడాదికి సవరించింది. ప్రణాళికేతర వ్యయం కింద గతేడాది రూ.56.82 కోట్లను కేటాయించింది. -
త్వరలో ఖేలో ఇండియా
కేంద్ర యువజన సర్వీసుల క్రీడాశాఖ ఆధ్వర్యంలో నిర్వహణ ► విజేతలకు భారీ నజరానాలు ►పోటీల నిర్వహణకు రంగం సిద్ధం ►విజేతలకు స్కాలర్షిప్లు కూడా.. ► పాత, కొత్త జిల్లాలపై తేలని సందిగ్ధం ► త్వరలో ఖరారుకానున్న షెడ్యుల్ కరీంనగర్ స్పోర్ట్స : ప్రపంచ జనాభాలో రెండో స్థానంలో ఉన్న మన దేశం క్రీడల్లో మాత్రం వెనకబడి ఉంది. ఒలింపిక్స్ వంటి మెగా ఈవెంట్లో సైతం కేవలం రెండు, మూడు పతకాలకే ఇండియా పరిమితమవుతోంది. మనకన్నా చిన్నదేశాలు సైతం అత్యధిక పతకాలు సాధిస్తూ అగ్రస్థానాల్లో నిలుస్తున్నారుు. 2016 ఒలింపిక్స్‌లో మన క్రీడాకారుల వైఫల్యాన్ని గమనించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ క్రీడారంగాన్ని కూడా ప్రపంచదేశాల సరసన నిలబెట్టే క్రమంలో ’ఖేలో ఇండియా’ కు శ్రీకారం చుట్టారు. 2024 ఒలింపిక్స్‌లో వివిధ క్రీడల్లో 50 పతకాలు లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న క్రీడారత్నాలను వెలికితీసే దిశగా కేంద్ర యువజన సర్వీసుల క్రీడాశాఖ ఆధ్వర్యంలో మండలస్థారుు నుంచి జాతీయస్థారుు వరకు వివిధ క్రీడల్లో పోటీలను నిర్వహించనుంది. భారీ నజరానాలు క్రీడాకారులు వారు సాధించిన స్థానం ప్రకారం కేంద్రం ‘ఖేలో ఇండియా’ కింద భారీ నజరానాలు ఇస్తుంది. గతేడాదితో పోలిస్తే ఇప్పుడది మూడింతలకు పెరిగింది. అరుుతే మండలస్థారుులో నజరానాలకు మాత్రం ఫుల్స్టాప్ పెట్టింది. గతంలో జిల్లాస్థారుు లో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన వారికి రూ.350, రూ.250, రూ.150 ఇచ్చారు. ఇప్పుడది రూ.2000, రూ.1500, రూ.1000 పెరిగింది. అలాగే రాష్ట్రస్థారుులో విజేతలకు రూ.50 వేలు, రూ.30వేలు, రూ.20 వేలు అందించనున్నారు. కనీస ప్రోత్సాహం సైతం లేని ఆర్థిక ఇబ్బందులు పడుతున్న క్రీడాకారులకు కేంద్రం అందించిన నగదు అవార్డు గొప్ప వరం కానుంది. పదా...ముప్పై ఒకటా? కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఖేలో ఇండియా పోటీలు నిర్వహించనున్న నేపథ్యంలో 10 జిల్లాలుగా ఉన్న తెలంగాణ రాష్ట్రం 31 జిల్లాలుగా మారింది. దీంతో పోటీల నిర్వహణ పాత పది జిల్లాలను పరిగణలోకి తీసుకుంటారా లేక పెరిగిన జిల్లాల ప్రకారం నిర్వహిస్తారన్న సందేహంలో ఉన్నారు క్రీడాకారులు, క్రీడా విశ్లేషకులు. వాస్తవానికి పోటీలకు సంబంధించిన బడ్జెట్ ను మొత్తం కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. మరి ఎప్పుడో షెడ్యుల్ ను ఖరారు చేసిన కేంద్రం ఏ జిల్లాల ప్రాతిపదికన పోటీలు నిర్వహించాలని సంకేతాలు జారీ చేస్తుందో చూడాల్సిందే. తగ్గిన క్రీడలు... ఖేలో ఇండియా పోటీలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో జిల్లా, రాష్ట్రస్థారుులో పోటీల నిర్వహణకు సంబంధించిన క్రీడలను కుదించారు. గతంలో కేంద్రం నిర్ణరుుంచిన 10 క్రీడల్లో జిల్లా, రాష్ట్ర, జాతీయస్థారుు పోటీ లు జరిగారుు. అరుుతే ఈ ఏడాది నుంచి జిల్లాస్థారుులో ఐదు క్రీడలు (ఇందులో 3 వ్యక్తిగత క్రీడలు , 2 టీం క్రీడలు), రాష్ట్ర స్థారుులో 8 క్రీడలకు అనుమతినిచ్చారు. అందులో స్పోర్ట్స అథారిటీ నిర్ణరుుంచిన 21 క్రీడాంశాల్లో ఏయే క్రీడలకు చోటును కల్పించారో తెలియాల్సి ఉంది. ఆ 21 క్రీడలు.... అథ్లెటిక్స్, జిమ్నాస్టిక్స్, స్విమ్మింగ్, బ్యాడ్మింటన్, టీటీ, అర్చ రీ, వుషూ, తైకై ్వండో, రెజ్లింగ్, సైక్లింగ్, బాక్సింగ్, జూడో, వెరుుట్ లిఫ్టింగ్, కబడ్డీ, ఖోఖో, హాకీ, ఫుట్‌బాల్, వాలీబాల్, బాస్కెట్‌బాల్, హ్యండ్‌బాల్, టెన్నీస్ క్రీడల్లో జిల్లాస్థారుు, రాష్ట్రస్థారుు పోటీల నిర్వహణకు సంబంధించి ఇంత వరకు క్రీడలను ఖరారు చేయలేదు.స్పోర్ట్స అథారిటీ ఆఫ్ ఇండియా ఎంపిక చేసిన పై 21 క్రీడల్లోనే పోటీలు జరుగనున్నారుు. క్రీడాకారులకు స్కాలర్షిప్లు.. పోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు నజరానాతో పాటు ఏడాది పాటు స్కాలర్షిప్ ఇవ్వనున్నారు. జిల్లా స్థారుులో నెలకు రూ.వెరుు్య చొప్పున పోటీల సెలక్షన్ కమిటీ ఎంపిక చేసిన క్రీడాకారులకు సంవత్సరాంతం ఇవ్వనున్నారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలోకూడా ఎంపికై న క్రీడాకారులకు స్కాలర్షిప్ ఇవ్వనున్నారు. రెండు విభాగాల్లో... గతంలో కేంద్రం నిర్వహించిన గ్రామీణ క్రీడలు, పైకా, ఆర్జీకేవీ క్రీడలకు కేవలం ఒక కేటగిరీలో పోటీలను నిర్వహించ గా ‘ఖేలో ఇండియా’లో మాత్రం రెండు విభాగాల్లో పోటీల ను నిర్వహించనున్నారు. అండర్- 14, 17 విభాగాల్లో బాలబాలికలకు వేరు వేరుగా పోటీలను నిర్వహించనున్నారు. మండలస్థారుులో ఎంపిక పోటీలే... మండల, బ్లాక్, జిల్లా, రాష్ట్ర, జాతీయస్థారుుల్లో దశల వారీగా అట్టహాసంగా నిర్వహించిన ఈ పోటీలకు కేంద్ర ప్రభుత్వం గతంలో పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసింది. ప్రస్తుతం మండల స్థారుులో ఎంపిక పోటీలుగానే నిర్వహించనున్నారు. త్వరలో షెడ్యూల్... ఇప్పటికే జిల్లాస్థాయిలో పోటీలను ముగించాల్సిన ఖేలో ఇండియా షెడ్యూల్ ఇంకా రాష్ట్రంలో ఖరారు కాలేదు. తెలంగాణ 31 జిల్లాలుగా మారడంతో పోటీల నిర్వాహణ వ్యయంకు సంబంధించి శాట్ అధికారులు కేంద్రానికి నివేదిక పంపించడంలో ఆలస్యమైందని కేంద్రం నుంచి ఆమోదం రాగానే షెడ్యుల్ ఖరారు చేయనున్నట్లు క్రీడాధికారి నుంచి అందిన సమాచారం. -
‘టాప్’లో సుమీత్, మనూ
జ్వాల, అశ్వినిలకు కూడా కేంద్ర క్రీడా శాఖ ప్రకటన న్యూఢిల్లీ : రియో ఒలింపిక్స్‌లో పతకాలు సాధించే అవకాశం ఉన్న ఆటగాళ్లకు మరింత అత్యుత్తమ శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన టార్గెట్ ఒలింపిక్ పోడియం (టాప్) పథకంలో బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ జంట సుమీత్ రెడ్డి, మను అత్రిలకు చోటు దక్కింది. హైదరాబాద్‌కు చెందిన సుమీత్ రెడ్డి, ఉత్తరప్రదేశ్‌కు చెందిన మనూ అత్రి జతగా ఇటీవల కాలంలో అంతర్జాతీయస్థాయిలో నిలకడగా రాణిస్తున్నారు. ఈ ఏడాది నాలుగు టోర్నీల్లో ఈ జంట ఫైనల్‌కు చేరగా... రెండింట్లో విజేతగా నిలిచి, మరో రెండింట్లో రన్నరప్‌తో సరిపెట్టుకుంది. వీరితో పాటు ఇన్నాళ్లుగా ‘టాప్’లో చోటు కోసం నిరసన గళం వినిపిస్తున్న మహిళల డబుల్స్ జంట గుత్తా జ్వాల, అశ్వినిలకు కూడా చోటు కల్పించారు. ఈ నలుగురి పేర్లతో క్రీడా శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. తమకు ఎలాంటి వసతులు, శిక్షణ కావాలో డబుల్స్ చీఫ్ కోచ్ కిమ్ టాన్ హర్‌తో సంప్రదింపులు జరపాలని వీరికి క్రీడా శాఖ సూచించింది. 2016 రియో ఒలింపిక్స్ కోసం ‘టాప్’లో ఉన్న ఆటగాళ్లకు ఎన్ఎస్డీఎఫ్ నుంచి భారీగా నిధులు అందుతాయి. గత ఏప్రిల్‌లో సైనా, సింధు, కశ్యప్, శ్రీకాంత్, గురుసాయిదత్, ప్రణయ్‌లతో కూడిన తొలి జాబితా విడుదలయ్యింది. దీంతో తమకు కూడా చోటు కల్పించాలని జ్వాల జోడి విజ్ఞప్తి చేస్తూ వచ్చింది. -
యోగాను ప్రమోట్ చేస్తాం: క్రీడాశాఖ
న్యూఢిల్లీ: పురాతన కాలం నుంచి ఎంతో మందిని ఆకర్షిస్తున్న యోగాకు క్రీడగా గుర్తింపునివ్వడాన్ని కేంద్ర ప్రభుత్వం సమర్థించుకుంది. ఇక నుంచి అన్ని క్రీడల మాదిరిగానే దీన్నీ ప్రమోట్ చేస్తామని పేర్కొంది. యోగాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు చర్యలు తీసుకుంటామని కేంద్ర క్రీడాశాఖ తెలిపింది. -
ఎస్‌సీఎఫ్‌కు కేంద్ర అవార్డు
ఐదుగురికి ద్రోణాచార్య పురస్కారం న్యూఢిల్లీ : క్షేత్ర స్థాయిలో క్రీడాకారులను గుర్తించి వారికి అత్యున్నత స్థాయిలో శిక్షణ ఇస్తున్న స్పోర్ట్స్ కోచింగ్ ఫౌండేషన్ (ఎస్సీఎఫ్)కు కేంద్ర పురస్కారం దక్కింది. హైదరాబాద్‌లో సేవలందిస్తున్న ఈ సంస్థకు ‘స్పోర్ట్స్ ఫర్ డెవలప్మెంట్’ విభాగంలో క్రీడా శాఖ అవార్డును ప్రకటించింది. క్రికెట్, టెన్నిస్, బాస్కెట్‌బాల్, ఫుట్‌బాల్, బాక్సింగ్, మార్షల్ ఆర్ట్స్‌లో ఎస్సీఎఫ్ శిక్షణ ఇస్తూ అర్హులైన వారికి స్కాలర్‌షిప్‌లతో ప్రోత్సహిస్తోంది. మరోవైపు ఈ ఏడాది ప్రతిష్టాత్మక ద్రోణాచార్య అవార్డు కోసం ఎంపిక చేసిన ఐదుగురి పేర్లను క్రీడాశాఖ ఆమోదించింది. రెజ్లింగ్ కోచ్ అనూప్ సింగ్, పారాలింపిక్స్ కోచ్ నావల్ సింగ్‌ల పేర్లను ప్రస్తుత ప్రదర్శన (2011-2014) ఆధారంగా ఈ అవార్డుకు ఎంపిక చేయగా జీవిత సాఫల్య పురస్కారం విభాగంలో నిహర్ అమీన్ (స్విమ్మింగ్), ఎస్ఆర్ సింగ్ (బాక్సింగ్), హర్బన్స్ సింగ్ (అథ్లెటిక్స్)లకు దక్కనుంది. వీరికి తలా రూ.5 లక్షల నగదు, ప్రతిమను అందిస్తారు. సుశీల్ కుమార్, యోగేశ్వర్ దత్, సత్యవర్త్ కడియన్, బజరంగ్, అమిత దహియాలను రెజ్లర్లుగా తీర్చిదిద్దడంలో కోచ్ అనూప్ కుమార్ పాత్ర ఉంది. ధ్యాన్‌చంద్ అవార్డు కోసం రోమియో జేమ్స్ (హాకీ), ఎస్పీ మిశ్రా (టెన్నిస్), టీపీపీ నాయర్ (వాలీబాల్) పేర్లను ఖరారు చేశారు.