న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్ ముగిశాకే జాతీయ క్రీడా పురస్కారాల విజేతల వివరాలు వెల్లడయ్యే అవకాశాలున్నాయి. త్వరలోనే ఒలింపిక్స్ జరుగనున్న నేపథ్యంలో ఎంపిక కసరత్తు మాత్రం ఆలస్యం కానుందని క్రీడా శాఖ వర్గాలు తెలిపాయి. టోక్యోలో భారత అథ్లెట్ల ప్రదర్శన, పతక విజేతలను బట్టి పురష్కారాలను ఖాయం చేయాలని క్రీడా శాఖ భావి స్తోంది. ‘నామినేషన్లు వచ్చాయి. గడువు కూడా ముగిసింది. కానీ టోక్యో పతక విజేతలకూ ఇందులో చోటివ్వాలని గత సమావేశంలో నిర్ణయించాం. ఒలింపిక్స్ క్రీడలు ఆగస్టు 8న ముగుస్తాయి. ఆ తర్వాత మరోసారి సమావేశమై ఎంపిక ప్రక్రియపై తుది కసరత్తు పూర్తి చేస్తాం. ఒలింపిక్స్ ముగిసిన వారం పది రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తయితే ఎప్పట్లాగే ఆగస్టు 29న అవార్డుల ప్రదానం జరుగుతుంది’ అని కేంద్ర క్రీడాశాఖ అధికారి ఒకరు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment