
రైలు ఆలస్యంగా రావడం సర్వసాధారణమే. ఆలస్యం అంటే ఒక గంట, రెండు గంటలు.. మహా అయితే ఒక రోజు అనుకుందాం. కానీ 42 గంటల్లో గమ్యాన్ని చేరాల్సిన రైలు.. తన గమ్యాన్ని చేరుకోవడానికి 3 సంవత్సరాల కంటే ఎక్కువ సమయం పట్టింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం నుంచి ఉత్తరప్రదేశ్‌లోని బస్తీకి వెళుతున్న గూడ్స్ రైలు 42 గంటల్లో గమ్యాన్ని చేరాల్సి ఉంది. 2014లో బస్తీలోని వ్యాపారవేత్త 'రామచంద్ర గుప్తా' తన వ్యాపారం కోసం విశాఖపట్నంలోని ఇండియన్ పొటాష్ లిమిటెడ్ నుంచి సుమారు రూ.14 లక్షల విలువైన డైమోనియం ఫాస్ఫేట్ (డీఏపీ) కోసం ఆర్డర్ ఇచ్చాడు.
నవంబర్ 10, 2014న, షెడ్యూల్ ప్రకారం బయలుదేరిన గూడ్స్ రైలులో 1,316 బస్తాల డీఏపీ లోడ్ చేశారు. కానీ చేరుకోవాల్సిన సమయానికి ట్రైన్ చేరలేదు. రామచంద్ర గుప్తా అనేక ఫిర్యాదుల తరువాత, రైలు మార్గమధ్యంలో అదృశ్యమైనట్లు అధికారులు కనుగొన్నారు.
ఇదీ చదవండి: రైల్వే ‘ఎం1’ కోచ్ గురించి తెలుసా..?
2014 నవంబర్ 10న బయలుదేరిన గూడ్స్ ట్రైన్.. జూలై 25, 2018న బస్తీ స్టేషన్‌కు చేరింది. కానీ రామచంద్ర గుప్తా ఆర్డర్ చేసిన డీఏపీ మొత్తం పాడైపోయింది. అయితే ఇండియన్ రైల్వే చరిత్రలోనే ఇంత ఆలస్యంగా గమ్యాన్ని చేరుకున్న ట్రైన్ ఇదే కావడం గమనార్హం. ఇప్పటి వరకు కూడా ఏ ట్రైన్ ఇంత ఆలస్యంగా ప్రయాణించలేదు.