
పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తెలంగాణ స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్‌తోపాటు ప్రీతి, పర్వీన్, లవ్లీనా విదేశీ గడ్డపై శిక్షణ తీసుకోనున్నారు. ఒలింపిక్స్ సన్నాహాల కోసం ఈ నలుగురు బాక్సర్లు టర్కీ వెళ్లనున్నారు.
ఈ నలుగురు బాక్సర్ల శిక్షణకు అయ్యే మొత్తం ఖర్చును భరిస్తామని కేంద్ర క్రీడా శాఖ ప్రకటించింది. క్రొయేషి యా, చెక్ రిపబ్లిక్‌లో జరిగే అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొనేందుకు భారత టేబుల్ టెన్నిస్ స్టార్ మనిక బత్రాకు అయ్యే ఖర్చులు భరిస్తామని క్రీడా శాఖ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment