విశాఖ సిటీ: ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో కార్గో విభాగంలో 12 శాతం వృద్ధి సాధించామని ఎస్సార్ పోర్ట్స్ సీఎండీ రాజీవ్ అగర్వాల్ చెప్పారు. 2017–18 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఫలితాల్ని ఆయన శుక్రవారమిక్కడ విడుదల చేశారు. గతేడాదితో పోల్చి చూస్తే.. ఈసారి రికార్డు స్థాయిలో 19.62 మెట్రిక్ టన్నుల ఎగుమతులు సాధించామన్నారు.
థర్డ్ పార్టీ కార్గోలోనూ 60 శాతం పెరుగుదల కనిపించిందన్నారు. హజారియా పోర్ట్ యూనిట్‌లో 26 శాతం, పారాదీప్‌లో 131 శాతం, విశాఖలో 21 శాతం వృద్ధి సాధించామన్నారు. ఇదే ఫలితాలతో ఈ ఆర్థిక సంవత్సరం మొత్తం ముందుకెళతామన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.
కార్గోలో 12 శాతం వృద్ధి: ఎస్సార్ పోర్ట్స్
Published Sat, Jul 15 2017 2:10 AM | Last Updated on Tue, Sep 5 2017 4:02 PM
Advertisement