క్యూ4పై తగ్గిన వ్యాపార విశ్వాసం
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో (జనవరి–మార్చి) డిమాండ్ పరంగా వృద్ధి అవకాశాలపై వ్యాపారవర్గాల విశ్వాస అంచనాలు మరింత తగ్గాయి. ఇవి అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికం తరహాలోనే ఉన్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) విడుదల చేసిన పారిశ్రామిక అంచనాల సర్వేలో వెల్లడైంది. ముడి వస్తువుల ధరల పెరుగుదల ఒత్తిడితో లాభాల మార్జిన్లు తగ్గవచ్చని సర్వే పేర్కొంది. దాదాపు 1,221 తయారీ కంపెనీలు ఈ సర్వేలో పాల్గొన్నాయి. క్యూ3లో దేశీ తయారీ రంగ సంస్థల వ్యాపార పరిస్థితులను మదింపు చేయడానికి, క్యూ4లో వాటి అంచనాలపై అవగాహనకు ఈ సర్వే తోడ్పడుతుందని ఆర్‌బీఐ తెలిపింది.