business confidence
-
పుంజుకున్న ‘వ్యాపార విశ్వాస సూచీ’
న్యూఢిల్లీ: సీఐఐ వ్యాపార విశ్వాస సూచీ జూలై–సెప్టెంబర్ కాలంలో రెండు త్రైమాసికాల గరిష్ట స్థాయి 68.2కు చేరింది. కేంద్ర ప్రభుత్వ విధానాల కొనసాగింపుతో పరిశ్రమల్లో ఉత్సాహం వ్యక్తమైంది. సాధారణ ఎన్నికల అనంతరం సీఐఐ నిర్వహించిన మొదటి సర్వే ఇది. లోక్‌సభ ఎన్నికల తర్వాత ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకున్నట్టు సీఐఐ తెలిపింది. అంతర్జాతీయంగా సవాళ్లు నెలకొన్నప్పటికీ భారత ఆర్థిక వృద్ధి బలంగా నిలదొక్కుకున్నట్టు పేర్కొంది. ప్రస్తుత పండుగల సీజన్ ఈ వృద్ధి అవకాశాలను మరింత బలోపేతం చేస్తుందని అభిప్రాయపడింది. సీఐఐ 128వ బిజినెస్ అవుట్‌లుక్ సర్వే 2024 సెపె్టంబర్లో జరిగింది. అన్ని రంగాలు, ప్రాంతాల నుంచి 200 సంస్థలు ఇందులో పాల్గొన్నాయి. సర్వేలో పాల్గొన్న కొన్ని కంపెనీలు సుదీర్ఘకాలం పాటు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతుండడం పట్ల ఆందోళన వ్యక్తం చేశాయి. అలాగే, అంతర్జాతీయంగా కమోడిటీల ధరలు పెరిగిపోవడం, వెలుపలి డిమాండ్ బలహీనంగా ఉండడాన్ని ప్రస్తావించాయి. మరోవైపు వినియోగం మెరుగుపడడం, వర్షాలు మెరుగ్గా పడడం, సంస్కరణల పట్ల సానుకూల ధోరణి వంటి సానుకూలతలనూ పేర్కొన్నాయి. ప్రైవేటు పెట్టుబడులు పుంజుకోవడం సానుకూలమన్నారు. 2024–25 మొదటి ఆరు నెలల్లో ప్రైవేటు పెట్టుబడులు, అంతకుముందు ఆరు నెలల కాలంతో పోలి్చతే పుంజుకున్నట్టు సర్వేలో 59 శాతం కంపెనీలు తెలిపాయి. రేట్ల కోతపై అంచనాలు ఆర్బీఐ వడ్డీ రేట్ల కోతను ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో (అక్టోబర్–డిసెంబర్) మొదలు పెట్టొచ్చని 34% కంపెనీలు అభిప్రాయపడుతున్నాయి. వడ్డీ రేట్ల తగ్గింపు నాలుగో త్రైమాసికంలో (2025 జనవరి–మార్చి) ఆరంభం కావొచ్చని 31% కంపెనీలు అంచనా వేస్తున్నాయి. -
ఎంఎస్ఎంఈల్లో ఆశాభావం
ముంబై: సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల్లో (ఎంఎస్ఎంఈ) ఈ ఏడాది పట్ల ఎంతో సానుకూలత కనిపిస్తోంది. లాభాలు పెరుగుతాయని 96 శాతం అభిప్రాయపడుతున్నాయి. ఎంఎస్ఎంఈలకు సంబంధించి నియో గ్రోత్ అనే సంస్థ వ్యాపార విశ్వాస అధ్యయనాన్ని నిర్వహించింది. దీనికి సంబంధించి వివరాలు విడుదల చేసింది. ఎంఎస్ఎంఈలకు నియోగ్రోత్ రుణాలు అందిస్తుంటుంది. దేశవ్యాప్తంగా 3,000 ఎంఎస్ఎంఈల యజమానుల నుంచి ఈ సర్వేలో భాగంగా అభిప్రాయాలను తెలుసుకుంది. 25 పట్టణాల పరిధిలో, 70కు పైగా వ్యాపార విభాగాల్లో ఈ సంస్థలు పనిచేస్తున్నాయి. తమ వృద్ధి పట్ల, లాభదాయకత పట్ల ఎంఎస్ఎంఈల్లో వ్యాపార విశ్వాసం వ్యక్తం కావడం సానుకూలమని నియోగ్రోత్ సీఈవో, ఎండీ అరుణ్ నయ్యర్ పేర్కొన్నారు. బలమైన డిజిటల్ ఎకోసిస్టమ్ ఉండడం ఈ ఏడాది ఎంఎస్ఎంఈ రుణ పంపిణీకి మంచి ప్రేరణగా పేర్కొన్నారు. ఎంఎస్ఎంఈలు రుణ సాయంతో తమ వ్యాపారాలను విస్తరింకోవడానికి సుముఖంగా ఉన్నాయని చెప్పారు. భారత్ 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యానికి చేరువ అవుతున్న క్రమంలో 2023 సంవత్సరం ఎంఎస్ఎంఈలకు ఎంతో కీలకమని, ఇవి ముఖ్య పాత్ర పోషించగలవని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత ఆనిశ్చిత పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటి ఎంఎస్ఎంఈ రంగం ఆశాభావంతో ఉండడం ప్రోత్సాహకర సంకేతంగా నియోగ్రోత్ పేర్కొంది. వృద్ధిపై ఆశావహం సర్వేలో పాల్గొన్న ప్రతి నలుగురు ఎంఎస్ఎంఈ ప్రతినిధుల్లో ముగ్గురు (75 శాతం) దేశ ఆర్థిక వృద్ధి పట్ల విశ్వాసం కలిగి ఉన్నారు. 20 శాతం మంది తటస్థ అభిప్రాయంతో ఉంటే, 5 శాతం మంది మాత్రమే ప్రతికూల అంచనాలతో ఉన్నారు. తయారీ, సేవల రంగాల్లో పనిచేస్తున్న 80 శాతం మహిళా ఎంస్ఎంఈలు (మహిళల ఆధ్వర్యంలో నడిచేవి) దేశ ఆర్థిక వృద్ధి పట్ల సానుకూలంగా ఉన్నాయి. వినియోగ డిమాండ్ 75 శాతం ఎంఎస్ఎంఈలు వినియోగ డిమాండ్ ఈ ఏడాది పెరుగుతుందన్న అంచనాతో ఉన్నాయి. 21 శాతం ఎంఎస్ఎంఈ ప్రతినిధులు ప్రస్తుతం మాదిరే డిమాండ్ కొనసాగుతుందని భావిస్తుంటే, డిమాండ్ తగ్గుతుందన్న అభిప్రాయం 4 శాతం ఎంఎస్ఎంఈ ప్రతినిధుల నుంచి వ్యక్తమైంది. అత్యధికంగా చెన్నైకు చెందిన 86 శాతం ఎంఎస్ఎంఈలు, హైదరాబాద్‌కు చెందిన 83 శాతం, ముంబై నుంచి 81 శాతం ఎంఎస్ఎంఈలు వినియోగంపై ఆశాభావంతో ఉన్నాయి. రిటైల్ వాణిజ్యంలోని ఎంఎస్ఎంఈలు ఈ ఏడాది బలమైన డిమాండ్ పట్ల సానుకూలంగా ఉన్నాయి. అలాగే, మహిళల ఆధ్వర్యంలో టోకు వాణిజ్యంలో పనిచేసే ఎంఎస్ఎంఈల్లోనూ ఇదే మాదిరి అభిప్రాయం వ్యక్తమైంది. వ్యాపార లాభదాయకత 96 శాతం ఎంఎస్ఎంఈలు ఈ ఏడాది తమ వ్యాపా ర లాభాలు వృద్ధి చెందుతాయని భావిస్తున్నాయి. ఇలా భావించే వాటిల్లో 66 శాతం తమ లాభాలు 30 శాతం మేర పెరుగుతాయని అంచనాతో ఉన్నా యి. 30 శాతం ఎంఎస్ఎంఈలు తమ లాభాల్లో వృద్ధి 30 శాతం లోపు ఉండొచ్చని, 4 శాతం ఎంఎస్ఎంఈలు లాభాలు తగ్గుతాయని భావిస్తున్నాయి. చెన్నై నుంచి అత్యధికంగా 80 శాతం ఎంఎస్ఎంఈలు లాభాలు 30 శాతానికి పైనే పెరుగుతాయనే అంచనాను వ్యక్తం చేశాయి. ముంబై, పుణె నగరాల్లో పనిచేసే ఎంఎస్ఎంఈలు కొంత రక్షణాత్మక అంచనాతో ఉన్నాయి. రుణ డిమాండ్ మెట్రోయేతర పట్టణాల్లోని 84 శాతం ఎంఎస్ఎంఈలు వ్యాపార రుణాలను తీసుకోవాలని అనుకుంటున్నట్టు చెప్పాయి. ఎంఎస్ఎంఈల వ్యాపారం కోలుకుంటుండడంతో, మూలధన అవసరాలు, వృద్ధి, విస్తరణకు రుణాలు అవసరం పడనున్నాయి. తయారీ, సేవల రంగాల్లోని 80 శాతం మహిళా ఎంఎస్ఎంఈలు వ్యాపార రుణాలను తీసుకోవచ్చని చె ప్పాయి. 60 శాతం ఎంఎస్ఎంఈలు డిజిటల్ టెక్నాలజీపై పెట్టుబడులు పెట్టనున్నట్టు, డిజిటల్ టెక్నా లజీని అందిపుచ్చుకునేందుకు సముఖంగా ఉన్నట్టు చెప్పాయి. 61 శాతం ఎంఎస్ఎంఈ అధినేతలు త మ సిబ్బంది సంఖ్యను పెంచుకోనున్నట్టు తెలిపారు. -
వ్యాపార విశ్వాస సూచీ రయ్!
న్యూఢిల్లీ: ఎకానమీ వేగవంతమైన రికవరీకి సంకేతంగా తన వ్యాపార విశ్వాస సూచీ (బీసీఐ) జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్ క్వార్టర్‌తో పోల్చి) 90 శాతం పెరిగినట్లు ఆర్థిక విశ్లేషణా సంస్థ ఎన్సీఏఈఆర్ పేర్కొంది. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్ పూనమ్ గుప్తా ఈ మేరకు చేసిన ప్రకటనలో ముఖ్యాంశాలు చూస్తే... - కోవిడ్–19 సెకండ్ వేవ్ తర్వాత రెండవ త్రైమాసికంలో (జూలై–సెప్టెంబర్ వ్యాపార సెంటిమెంట్ మెరుగుపడింది. అంతకుముందు మూడు నెలలతో పోల్చితే పలు విభాగాలు పురోగతి బాట పట్టాయి. బీసీఐ త్రైమాసికంగా చూస్తే, 90 శాతం పెరిగితే, వార్షికంగా 80 శాతం పురోగతి సాధించింది. - సెప్టెంబర్ 2021లో చేపట్టిన వ్యాపార అంచనా సర్వే (బీఈఎస్) 118వ రౌండ్ అంశాల ఆధారంగా తాజా గణాంకాలు వెలువడ్డాయి. దేశ వ్యాప్తంగా నాలుగు ప్రాంతాల్లోని 500 సంస్థలను పరిగణనలోకి తీసుకుంటే, 1991 నుంచి త్రైమాసికం ప్రాతిపదికన ఎన్సీఏఈఆర్ ఈ సర్వే నిర్వహిస్తోంది. - వెస్ట్ జోన్ మినహా, అన్ని ప్రాంతాల్లో వ్యాపార సెంటిమెంట్ మెరుగుపడింది. 2021–22 రెండవ త్రైమాసికంలో పశ్చిమ ప్రాంతంలో బీసీఐ దాదాపు 10 శాతం తగ్గింది. అయితే తూర్పు (కోల్‌కతా), ఉత్తర (ఢిల్లీ జాతీయ రాజధాని ప్రాంతం), దక్షిణ (చెన్నై, బెంగళూరు) ప్రాంతాల్లో వృద్ధి తీరు బాగుంది. - ప్రధానంగా నాలుగు భాగాలకు సంబంధించిన సెంటిమెంట్లు మెరుగుపడ్డాయి. ఈ నాలుగు అంశాలనూ పరిశీలిస్తే, ‘మొత్తం ఆర్థిక పరిస్థితులు రాబోయే ఆరు నెలల్లో మెరుగుపడతాయి... రాబోయే ఆరు నెలల్లో సంస్థల ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది... ఆరు నెలల క్రితంతో పోలిస్తే ప్రస్తుత పెట్టుబడి వాతావరణం సానుకూలంగా ఉంది... ప్రస్తుత సామర్థ్య వినియోగం సరైన స్థాయికి దగ్గరగా లేదా అంతకంటే ఎక్కువగా ఉంది’. - 2019–20 రెండవ త్రైమాసికం– 2020–21 మూడవ త్రైమాసికం మధ్య విస్తరించిన పెద్ద సంస్థలు, చిన్న సంస్థల వ్యాపార సెంటిమెంట్ల మధ్య వ్యత్యాసం తాజాగా తగ్గింది. ముఖ్యంగా 2021–22 జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో ఈ వ్యత్యాసం భారీగా తగ్గడం గమనార్హం. ప్రస్తుతం ఒడిదుడుకులుగా ఉన్న రికవరీ, రానున్న త్రైమాసికాల్లో కుదుటపడుతుందన్న ఆశావాదాన్ని ఇది కల్పిస్తోంది. - ఉత్పత్తి, దేశీయ విక్రయాలు, ఎగుమతులు, కొత్త ఆర్డర్లు, ముడిసరుకు దిగుమతులు, పన్నుకు ముందు లాభాలపై సెంటిమెంట్లు వంటి పలు అంశాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో మెరుగయ్యాయి. - ఇక 2021–22 మొదటి త్రైమాసికంలో ఉత్పత్తి యూనిట్‌కు ముడి పదార్థాల ఖర్చులు 54 శాతం పెరిగాయి. రానున్న త్రైమాసికాల్లో ఈ వ్యయాలు మరింత పెరిగే అవకాశం ఉంది. మూడింట సర్వేలో పాల్గొన్న రెండు వంతుల సంస్థలు ఇదే విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. వ్యయాలకు సంబంధించి సెంటిమెంట్లు, ముఖ్యంగా ముడి పదార్థాలకు సంబంధించి ప్రతికూలంగా ఉన్నాయి. పొలిటికల్ ఇండెక్స్ కూడా... కాగా, ఎన్సీఏఈఆర్ పొలిటికల్ కాన్ఫిడెన్స్ ఇండెక్స్ (పీసీఐ) కూడా 2021–22 ఏప్రిల్–జూన్ త్రైమాసికంతో పోల్చితే 2021–22 జూలై–సెప్టెంబర్ కాలంలో దాదాపు 110 శాతం పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంతో పోలిస్తే కూడా ఇండెక్స్ పురోగమనం 60 శాతం కంటే ఎక్కువగా ఉంది. -
వ్యాపార విశ్వాస సూచీ 9 శాతం అప్
న్యూఢిల్లీ: వ్యాపార విశ్వాస సూచీ త్రైమాసికం పరంగా చూస్తే 2017 డిసెంబర్ క్వార్టర్లో 9.1 శాతం పెరిగింది. మొత్తంగా చూస్తే సెంటిమెంట్ జోరుగానే ఉంది. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనమిక్ రీసెర్చ్ (ఎన్సీఏఈఆర్) తాజా సర్వేలో ఈ విషయం వెల్లడయ్యింది. జీఎస్టీ అమలు నేపథ్యంలో ఎన్సీఏఈఆర్ బిజినెస్ కాన్ఫిడెన్స్ ఇండెక్స్ (ఎన్–బీసీఐ) సెప్టెంబర్ క్వార్టర్లో 12.9 శాతం క్షీణించిన విషయం తెలిసిందే. ఉత్పత్తి, దేశీ విక్రయాలు, ఎగుమతులు, ముడిపదార్ధాల దిగుమతులు, స్థూల లాభాలు వంటి వాటికి సంబంధించిన సెంటిమెంట్ 2017 జూలై–సెప్టెంబర్‌తో పోలిస్తే 2017 అక్టోబర్–డిసెంబర్లో జోరుగా ఉందని సర్వే పేర్కొంది. సెంటిమెంట్ మెరుగుదల వల్ల అన్ని రంగాల్లో వృద్ధి ధోరణులు కనిపిస్తున్నాయని తెలిపింది. కార్మిక ఉపాధి, వేతనాల్లో చెప్పుకోదగ్గ వృద్ధి నమోదయ్యిందని పేర్కొంది. ఇక భవిష్యత్ ఉపాధి, వేతనాలకు సంబంధించిన అంచనాలు సానుకూలంగానే ఉన్నాయని తెలిపింది. -
క్యూ4పై తగ్గిన వ్యాపార విశ్వాసం
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో (జనవరి–మార్చి) డిమాండ్ పరంగా వృద్ధి అవకాశాలపై వ్యాపారవర్గాల విశ్వాస అంచనాలు మరింత తగ్గాయి. ఇవి అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికం తరహాలోనే ఉన్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసిన పారిశ్రామిక అంచనాల సర్వేలో వెల్లడైంది. ముడి వస్తువుల ధరల పెరుగుదల ఒత్తిడితో లాభాల మార్జిన్లు తగ్గవచ్చని సర్వే పేర్కొంది. దాదాపు 1,221 తయారీ కంపెనీలు ఈ సర్వేలో పాల్గొన్నాయి. క్యూ3లో దేశీ తయారీ రంగ సంస్థల వ్యాపార పరిస్థితులను మదింపు చేయడానికి, క్యూ4లో వాటి అంచనాలపై అవగాహనకు ఈ సర్వే తోడ్పడుతుందని ఆర్బీఐ తెలిపింది. -
భారత్ లో పడిపోయిన వ్యాపార ఆశావాదం
న్యూఢిల్లీ : రెండు త్రైమాసికాలుగా టాప్ స్థానంలో ఉన్న భారత్, వ్యాపార ఆశావాద స్థాయిలో(బిజినెస్ అప్టిమిజమ్ ఇండెక్స్) గ్లోబల్ గా మూడో స్థానానికి పడిపోయింది. సంస్కరణలు అమలుచేయడంలో విఫలమవుతుండటంతో వ్యాపార ఆశావాద స్థాయిని ప్రపంచవ్యాప్తంగా భారత్ కోల్పోయింది. ఏకీకృత వస్తుసేవల పన్ను(జీఎస్టీ), ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మొండిబకాయిల బెడద వంటి కారణాలతో భారత్ తన స్థానాన్ని కోల్పోయిందని రిపోర్టు వెల్లడించింది. తాజా గ్రాంట్ తోర్న్టన్ ఇంటర్నేషనల్ బిజినెస్ రిపోర్ట్ లో ఈ విషయం వెల్లడైంది. 2016 ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో భారత మూడో స్థానంలో నిలిచిందని రిపోర్టు నివేదించింది. జీఎస్టీ లాంటి ప్రధాన సంస్కరణల అమలులో విఫలం, పన్ను వివాదాలు ఎంతకీ తేలకపోవడం, నిరర్థక ఆస్తులు పెరగడంతో బ్యాంకింగ్ లో సమస్యలు పెరగడం, బ్యాంకింగ్ సెక్టార్ బ్యాంకుల్లో రీక్యాపిటలైజేషన్ అవసరం రావడం వంటివి కార్పొరేట్ ఇండియాలో వ్యాపార విశ్వాసాలపై ప్రభావం చూపుతున్నాయి. దీంతో మొత్తంగా భారత్ లో వ్యాపార ఆశావాద స్థాయిని తగ్గిస్తుందని రిపోర్టు పేర్కొంది. జనవరి-మార్చి త్రైమాసికంలో టాప్ లో నిలిచిన ఉపాధి అంచనాల వృద్ధి రెండో స్థానానికి క్షీణించింది. వ్యాపార అవకాశాలు, మార్కెట్లో ఆశావాద స్థాయి ఎక్కువగానే ఉన్నప్పటికీ.. కీలక సంస్కరణల అమలు పెట్టుబడిదారులు, ర్యాకింగ్ పై ప్రభావం చూపుతుందని గ్రాంట్ తోర్న్టన్ ఇండియా ఎల్ఎల్పీ పార్టనర్ హరీష్ హెచ్వీ చెప్పారు. ఒకవేళ ఈ వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో జీఎస్టీ బిల్లు పాస్ అయితే, ఈ ట్రెండ్ రివర్స్ అవుతుందని తెలిపారు.