భారత్ లో పడిపోయిన వ్యాపార ఆశావాదం | India Slips To 3rd Place On Business Optimism Index: Report | Sakshi
Sakshi News home page

భారత్ లో పడిపోయిన వ్యాపార ఆశావాదం

Published Fri, Jul 15 2016 4:47 PM | Last Updated on Mon, Sep 4 2017 4:56 AM

భారత్ లో పడిపోయిన వ్యాపార ఆశావాదం

భారత్ లో పడిపోయిన వ్యాపార ఆశావాదం

న్యూఢిల్లీ : రెండు త్రైమాసికాలుగా టాప్ స్థానంలో ఉన్న భారత్, వ్యాపార ఆశావాద స్థాయిలో(బిజినెస్ అప్టిమిజమ్ ఇండెక్స్) గ్లోబల్ గా మూడో స్థానానికి పడిపోయింది. సంస్కరణలు అమలుచేయడంలో విఫలమవుతుండటంతో వ్యాపార ఆశావాద స్థాయిని ప్రపంచవ్యాప్తంగా భారత్ కోల్పోయింది. ఏకీకృత వస్తుసేవల పన్ను(జీఎస్టీ), ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మొండిబకాయిల బెడద వంటి కారణాలతో భారత్ తన స్థానాన్ని కోల్పోయిందని రిపోర్టు వెల్లడించింది. తాజా గ్రాంట్ తోర్న్టన్ ఇంటర్నేషనల్ బిజినెస్ రిపోర్ట్ లో ఈ విషయం వెల్లడైంది. 2016 ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో భారత మూడో స్థానంలో నిలిచిందని రిపోర్టు నివేదించింది.

జీఎస్టీ లాంటి ప్రధాన సంస్కరణల అమలులో విఫలం, పన్ను వివాదాలు ఎంతకీ తేలకపోవడం, నిరర్థక ఆస్తులు పెరగడంతో బ్యాంకింగ్ లో సమస్యలు పెరగడం, బ్యాంకింగ్ సెక్టార్ బ్యాంకుల్లో రీక్యాపిటలైజేషన్ అవసరం రావడం వంటివి కార్పొరేట్ ఇండియాలో వ్యాపార విశ్వాసాలపై ప్రభావం చూపుతున్నాయి. దీంతో మొత్తంగా భారత్ లో వ్యాపార ఆశావాద స్థాయిని తగ్గిస్తుందని రిపోర్టు పేర్కొంది. జనవరి-మార్చి త్రైమాసికంలో టాప్ లో నిలిచిన ఉపాధి అంచనాల వృద్ధి రెండో స్థానానికి క్షీణించింది.

వ్యాపార అవకాశాలు, మార్కెట్లో ఆశావాద స్థాయి ఎక్కువగానే ఉన్నప్పటికీ.. కీలక సంస్కరణల అమలు పెట్టుబడిదారులు, ర్యాకింగ్ పై ప్రభావం చూపుతుందని గ్రాంట్ తోర్న్టన్ ఇండియా ఎల్ఎల్పీ పార్టనర్ హరీష్ హెచ్వీ చెప్పారు. ఒకవేళ ఈ వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో జీఎస్టీ బిల్లు పాస్ అయితే, ఈ ట్రెండ్ రివర్స్ అవుతుందని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement