
న్యూఢిల్లీ: దివాలా ప్రక్రియ నడుస్తున్న వీడియోకాన్ ఇండస్ట్రీస్ గత ఆర్థిక సంవత్సరంలో భారీ నష్టాలను ప్రకటించింది. మార్చి, 2019తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రూ.6,761 కోట్ల నికర నష్టాలు వచ్చాయని సంస్థ తెలిపింది. ఆదాయం భారీగా తగ్గడమే దీనికి కారణమని పేర్కొంది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరంలో నష్టాలు రూ.5,264 కోట్లని వెల్లడించింది. 2017–18 ఆర్థిక సంవత్సరంలో రూ.3,424 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం గత ఆర్థిక సంవత్సరంలో రూ.1,063 కోట్లకు తగ్గిందని కంపెనీ తెలిపింది. గత ఆర్థిక సంవత్సరానికి గాను మొత్తం రూ.1,413 కోట్ల రుణాలను రద్దు చేశామని వివరించింది. వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంక్‌లకు వీడియోకాన్ గ్రూప్ బకాయిలు రూ.90,000 కోట్ల మేర ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment