Videocon industries
-
వీడియోకాన్‌పై ఆడిట్ సందేహాలు
న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న వీడియోకాన్ ఇండస్ట్రీస్ ఖాతా పుస్తకాల ఆడిట్ సమీక్షలో కొన్ని పద్దులు, లావాదేవీల నమోదుపై సందేహాలు వ్యక్తమయ్యాయి. ప్రమోటర్ ధూత్ కుటుంబం నిర్వహణలో ఉన్నప్పుడు వీటి నమోదు జరిగి ఉండవచ్చని ఆడిట్ సమీక్ష పేర్కొంది. కంపెనీపై దివాలా చట్ట చర్యలు ప్రారంభించకముందు ఈ సందేహాస్పద లావాదేవీలు నమోదైనట్లు ఆడిట్ అభిప్రాయపడింది. కాగా.. వీడియోకాన్ రుణపరిష్కార నిపుణులు ఇప్పటికే జాతీయ కంపెనీ చట్ట ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ)కు ఇలాంటి లావాదేవీలను రద్దు చేయడం, ప్రక్కన పెట్టడంపై దరఖాస్తు చేశారు. ఈ ఆడిట్ సమీక్ష వివరాలను గత నాలుగు త్రైమాసికాల ఆర్థిక ఫలితాలు ప్రకటిస్తున్న సందర్భంగా కంపెనీ స్టాక్ ఎక్సే్ఛంజీలకు తెలియజేసింది. దివాలా చట్ట నిబంధనల ప్రకారం ప్రిఫరెన్షియల్, విలువ తక్కువగా మదింపు, అక్రమ లావాదేవీల గుర్తింపునకు రుణ పరిష్కార నిపుణులు చేపట్టిన స్వతంత్ర లావాదేవీ ఆడిట్ సమీక్ష అనంతరం ఈ అంశాలు బయటపడినట్లు వివరించింది. రుణ పరిష్కార నిపుణులు 2021 జూన్(క్యూ1), సెప్టెంబర్(క్యూ2), డిసెంబర్(క్యూ3), 2022 మార్చి(క్యూ4)తో ముగిసిన త్రైమాసిక ఫలితాలను క్రోడీకరించి పూర్తిఏడాది(2021–22) పనితీరును ప్రకటించారు. వెరసి వీడియోకాన్ ఇండస్ట్రీస్ స్టాండెలోన్ ఆదాయం రూ. 756 కోట్లకు చేరగా.. రూ. 6,111 కోట్లకుపైగా నికర నష్టం నమోదైంది. -
అనిల్ అగర్వాల్ చేజారిన వీడియోకాన్!
న్యూఢిల్లీ: దివాలా తీసిన వీడియోకాన్ ఇండస్ట్రీస్‌ను ‘అతి తక్కువ ధరకు’ కొనుగోలు చేయాలన్న బిలియనీర్ అనిల్ అగర్వాల్ నేతృత్వంలోని ట్విన్ స్టార్ టెక్నాలజీస్ ప్రయత్నం నెరవేరలేదు. ట్విన్ స్టార్ టెక్నాలజీస్ దాఖలు చేసిన బిడ్స్‌ను ఆమోదిస్తూ ఎన్సీఎల్టీ, ముంబై బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను దివాలా వ్యవహారాల అప్పీల్స్ కోర్టు– ఎన్సీఎల్ఏటీ (నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్) బుధవారం కొట్టివేసింది. దీంతో తాజా బిడ్స్ ఆహ్వానానికి కమిటీ ఆఫ్ క్రెడిటార్స్‌కు (సీఓసీ) తగిన వెసులుబాటు లభించింది. మొదటి నుంచీ అనిశ్చితే..! నిజానికి ట్విన్ స్టార్ టెక్నాలజీస్ బిడ్‌కు తొలుత సరేనన్న క్రెడిటార్స్ కమిటీ (సీఓసీ) తరువాత యూ టర్న్ తీసుకుంది. 13 కంపెనీల వీడియోకాన్ గ్రూప్ కొనుగోలుకు తాజా బిడ్స్‌ను ఆహ్వానించడానికి అనుమతించాలని కోరుతూ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) నేతృత్వంలోని క్రెడిటార్స్ కమిటీ దివాలా అప్పిలేట్ ట్రిబ్యునల్ ఎన్సీఎల్ఏటీని ఆశ్రయించింది. ఇందుకు అనుగుణంగా తిరిగి ఈ అంశాన్ని పునఃబిడ్డింగ్‌కు వీలుగా క్రెడిటార్స్ కమిటీకి తిప్పి పంపాలని కోరింది. కన్జూమర్ డ్యూరబుల్ సంస్థ వీడియోకాన్ ఇండస్ట్రీస్ కొనుగోలుకు ట్విన్ స్టార్ టెక్నాలజీస్ దాఖలుచేసిన రిజల్యూషన్ బిడ్ ప్రకారం, మొత్తం రుణాల్లో కేవలం 5 శాతమే తమకు లభిస్తుండడమే తాజా బిడ్స్ కోరడానికి కారణమని అప్పిలేట్ ట్రిబ్యునల్‌కు తెలిపింది. వీడియోకాన్ చెల్లించాల్సింది దాదాపు రూ.64,839 కోట్లయితే ఆ కంపెనీ కొనుగోలుకు బిలియనీర్ అగర్వాల్‌కు చెందిన ట్విన్ స్టార్ టెక్నాలజీస్ కేవలం రూ.2,962 కోట్లు ఆఫర్ చేసింది. వీడియోకాన్‌కు రుణాలు ఇచ్చిన ఎస్బీఐ నేతృత్వంలోని సంస్థలకు 94.98 శాతం వోటింగ్‌కు ప్రాతినిధ్యం ఉంది. ఇందులో ఒక్క ఎస్బీఐ ప్రాతినిధ్య వోటు 18.05 శాతం. ట్విన్ స్టార్ టెక్నాలజీస్ రూ.2,962 కోట్ల బిడ్‌కు జూన్ 9న ఎన్సీఎల్టీ ముంబై బెంచ్ ఆమోదముద్ర వేసింది. అయితే ఈ ఆమోదం సందర్భంగా ఈ బిడ్ అతి తక్కువగా ఉందని, దీనివల్ల క్రెడిటార్‌కు ఒరిగిదేమీ ఉండదని, ట్విన్ స్టార్ టెక్నాలజీస్ చెల్లించేది నామమాత్రమని కూడా ఎన్సీఎల్టీ బెంచ్ వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ రిజల్యూషన్ ప్రణాళికపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ఇరువురు క్రెడిటార్లు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (1.97 వోటింగ్ షేర్), ఐఎఫ్సీఐ లిమిటెడ్ (1.03 శాతం వోటింగ్షేర్) గత ఏడాది జూన్ 19న అప్పిలేట్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. దీనితో ఎన్సీఎల్టీ ఉత్తర్వుపై అప్పిలేట్ ట్రిబ్యునల్ స్టే విధించింది. యథాతథ పరిస్థితి కొనసాగింపునకు ఆదేశాలు జారీ చేసింది. అయితే అప్పిలేట్ ట్రిబ్యునల్ స్టే ఎత్తివేయాలని కోరుతూ ట్విన్ స్టార్ టెక్నాలజీస్ సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ ఫలితం దక్కలేదు. ఆగస్టు 13న ట్విన్‌స్టార్ పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. తన రిజల్యూషన్ ప్రణాళికను తొలత ఆమోదించి తరువాత యూ టార్న్ తీసుకోవడం సమంజసం కాదన్నది ట్విన్‌స్టార్ టెక్నాలజీస్ వాదన. టెలికం శాఖ, ధూత్ నుంచి కూడా వ్యతిరేకత కాగా తమ గ్రూప్ కంపెనీలను కేవలం రూ.2,962 కోట్ల కొనుగోలుకు వీలులేదంటూ వీడియోకాన్ గ్రూప్ చైర్మన్, ఎండీ వేణగోపాల్ ధూత్ దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా అప్పిలేట్ ట్రిబ్యునల్ విచారించింది. వీడియోకాన్ టెలికమ్యూనికేషన్స్‌సహా ఆ గ్రూప్‌నకు సంబంధించి 13 కంపెనీలకు ‘ఏకీకృత’ పరిష్కార (రిజల్యూషన్) ప్రణాళికకు ఎన్సీఎల్టీ ఆమోదముద్ర వేయడాన్ని టెలికమ్యూనికేషన్ల శాఖ (డీఓటీ) వ్యతిరేకించింది. ఎన్సీఎల్టీ రూలింగ్ని అప్పీలేట్ ట్రిబ్యునల్‌లో సవాలు చేసింది. తనకు వీడియోకాన్ టెలికమ్యూనికేషన్స్ దాదాపు రూ.882 కోట్లు బకాయి పడినట్లు తెలిపింది. ఎన్సీఎల్టీలో కేసు విచారణలో ఉండడం వల్ల తానకు రావాల్సిన బకాయిలను రాబట్టుకోవడం సాధ్యంకాదని అప్పీలేట్ ట్రిబ్యునల్‌కు విన్నవించింది. కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్ ప్రాసెస్‌ని ప్రారంభించడం ద్వారా డిఫాల్ట్ టెలికం కంపెనీలు ‘తమకు సంబంధించి రుణ బాధ్యతల నుండి బయటపడలేవని’ తన వాదనల్లో పేర్కొంది. మోసపూరిత విధానాలు పాల్పడిన కంపెనీలు ఐబీసీ నిబంధనావళికింద తప్పించుకోలేవని, తద్వారా ప్రభుత్వానికి చెల్లింపులను ఎగ్గొట్టలేవని స్పష్టం చేసింది. అంతేకాకుండా, ఆమోదించిన రిజల్యూషన్ ప్లాన్ కింద కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్ ప్రాసెస్ ద్వారా ఆపరేషనల్ క్రెడిటార్స్‌కు వచ్చేది అత్యంత తక్కువ మొత్తమని పేర్కొంది. తనవరకూ చూస్తే, తాను చేసే క్లెయిమ్‌లో లభించేది కేవలం 0.12 శాతమేనని వివరించింది. సీఓసీ నిర్ణయాలపై విమర్శ రిజల్యూషన్ ప్రణాళిక అమల్లో సీఓసీది కీలకపాత్ర. అయితే రుణాల్లో కూరుకుపోయి దివాల పక్రియలో ఉన్న కంపెనీ అమ్మకాలకు సంబంధించి రిజల్యూషన్ ప్రక్రియలో క్రెడిటార్స్ కమిటీ 95 శాతం వరకూ రాయితీ (హెయిర్‌కట్స్) ఇస్తుండడంపై ఇటీవల తీవ్ర విమర్శలు తలెత్తుతున్నాయి. తమకు రావాల్సిన బకాయిలకు సంబంధించి క్రెడిటార్ల సంఘం భారీ మాఫీలు జరిపి, రిజల్యూషన్ ప్రణాళికలను ఆమోదించడం తగదన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐబీసీ (ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్ట్సీ కోడ్) దివాలా ప్రక్రియలో కీలకమైన కమిటీ ఆఫ్ క్రెడిటార్స్ (సీఓసీ)కి ఒక నియమావళిని జారీ చేసే పనిలో కేంద్రం ఉన్నట్లు కనబడుతోంది. ఈ విషయంలో ఆర్థికశాఖ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్లతో కార్పొరేట్ వ్యవహారాల శాఖ చర్చిస్తున్నట్లు కార్పొరేట్ వ్యవహారాల కార్యదర్శి రాజేష్ వర్మ ఇటీవల తెలిపారు. అయితే అధిక హెయిర్‌కట్స్ విమర్శలపై ఆయన ఈ సందర్భంగా ఆయన ఎటువంటి వ్యాఖ్యలు, ఆ ప్రస్తావన చేయకపోవడం గమనార్హం. ఐబీసీకి పలు సవరణల ద్వారా దీనిని ఎప్పటికప్పుడు మరింత పటిష్టంగా మార్చడం జరుగుతోంది. ఈ దిశలో ఇప్పటికి ఐబీసీకి ఆరు సవరణలు జరిగాయి. ఐబీసీని మరింత సమర్థవంతంగా పటిష్టంగా మార్చడానికి విద్యావేత్తలు, విధాన నిర్ణేతలు, పరిశోధకులు, సంబంధిత ఇతర వర్గాలతో కేంద్రం నిరంతరం చర్చలు జరుపుతుందని, ఆయా సిఫారసులకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకుంటుందని అత్యున్నత స్థాయి వర్గాలు పేర్కొంటున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థ ఐదు ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేరుకోవడంలో ఇది కీలకమని కూడా ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఐబీసీ సెక్షన్ 31 (4) నిబంధనలు పాటించకపోవడమే కారణం! దివాలా కోడ్ (ఐబీసీ) సెక్షన్ 31 (4) ప్రకారం, రిజల్యూషన్ ప్లాన్‌ను సమర్పించడానికి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) నుండి ముందస్తు అనుమతి అవసరమని, దీనిని అనిల్ అగర్వాల్ సంస్థ పొందలేదని జరత్ కుమార్ జైన్, అశోక్ కుమార్ మిశ్రాలతో కూడిన ఇరువురు సభ్యుల అప్పీలేట్ ట్రిబ్యునల్ పేర్కొంది. కోడ్ నిబంధనలకు అనుగుణంగా ప్రక్రియను పూర్తి చేయడం కోసం ఈ బిడ్స్ వ్యవహారాన్ని తిరిగి సీఓసీకి పంపుతున్నట్లు 213 పేజీల ఉత్తర్వు్యలో తెలిపింది. దీనిప్రకారం, ఎన్సీఎల్ఏటీ ఉత్తర్వును ఉన్నత న్యాయస్థానంలో సవాలు చేసి, అది రద్దయితే తప్ప, సీఓసీ ఇప్పుడు వీడియోకాన్ కోసం తాజా బిడ్లను కోరడానికి సౌలభ్యత ఏర్పడింది. పునర్విచారణ, సమీక్ష కోసం రుణదాతలకు రిజల్యూషన్ ప్లాన్‌ను తిరిగి పంపే అధికారాలు ఎన్సీఎల్టీ, ఎన్సీఎల్ఏటీలు రెండింటికి ఉన్నాయని అప్పీలేట్ ట్రిబ్యునల్ పేర్కొనడం గమనార్హం. సీఓసీకి ఆయా అంశాల్లో ఉన్న అధికారాలను తోసిపుచ్చలేమని స్పష్టం చేసింది. తగిన చర్యలు తీసుకుంటాం: ట్విన్‌స్టార్ తాము అప్పీలేట్ ట్రిబ్యునల్ ఉత్తర్వుల గురించి తెలుసుకున్నట్లు ట్విన్‌స్టార్ తరఫు న్యాయవాది గోపాల్ జైన్ పేర్కొన్నారు. తాజా ఆర్డర్ వల్ల వీడియోకాన్ దివాలా పరిష్కార పక్రియ (రిజల్యూషన్) మరింత ఆలస్యం అవుతుందని అన్నారు. వ్రాతపూర్వక ఉత్తర్వు కోసం ఎదురుచేస్తున్నామని, తీర్పును పూర్తి అధ్యయనం తరువాత తదుపరి చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. -
వీడియోకాన్ కొనుగోలుపై వేదాంతాకు బ్రేక్స్!
న్యూఢిల్లీ: రుణ సంక్షోభంలో కూరుకుపోయిన వీడియోకాన్ ఇండస్ట్రీస్‌ను అతి తక్కువకు సొంతం చేసుకోవాలన్న వేదాంతా గ్రూప్ అనుబంధ కంపెనీ ట్విన్ స్టార్ టెక్నాలజీస్ ప్రణాళికలు ఫలించేట్లు కనబడ్డం లేదు. ట్విన్ స్టార్ టెక్నాలజీస్ బిడ్‌కు తొలుత సరేనన్న క్రెడిటార్స్ కమిటీ (సీఓసీ) తాజాగా యూ టర్న్ తీసుకుంది. 13 కంపెనీల వీడియోకాన్ గ్రూప్ కొనుగోలుకు తాజా బిడ్స్‌ను ఆహ్వానించడానికి అనుమతించాలని కోరుతూ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) నేతృత్వంలోని క్రెడిటార్స్ కమిటీ దివాలా అప్పిలేట్ ట్రిబ్యునల్ ఎన్సీఎల్ఏటీని ఆశ్రయించింది. ఇందుకు అనుగుణంగా తిరిగి ఈ అంశాన్ని పునఃబిడ్డింగ్‌కు వీలుగా క్రెడిటార్స్ కమిటీకి తిప్పి పంపాలని కోరింది. కన్జూమర్ డ్యూరబుల్ సంస్థ వీడియోకాన్ ఇండస్ట్రీస్ కొనుగోలుకు ట్విన్ స్టార్ టెక్నాలజీస్ దాఖలుచేసిన రిజల్యూషన్ బిడ్ ప్రకారం, మొత్తం రుణాల్లో కేవలం 5 శాతమే తమకు లభిస్తుండడమే తాజా బిడ్స్ కోరడానికి కారణమని అప్పిలేట్ ట్రిబ్యునల్‌కు తెలిపింది. ఈ నెల 27న జస్టిస్ జరాత్ కుమార్ జైన్, జస్టిస్ కాంతి నరహరి నేతృత్వంలోని బెంచ్ ఈ పిటిషన్‌ను విచారణకు చేపట్టి, తగిన ఉత్తర్వులు ఇవ్వనుంది. అప్పటికల్లా తన సమాధానం తెలియజేయడానికి బెంచ్ ట్విన్ స్టార్ టెక్నాలజీస్ అనుమతి ఇచ్చింది. వీడియోకాన్ చెల్లించాల్సింది దాదాపు రూ.64,839 కోట్లయితే ఆ కంపెనీ కొనుగోలుకు బిలియనీర్ అగర్వాల్‌కు చెందిన ట్విన్ స్టార్ టెక్నాలజీస్ కేవలం రూ.2,962 కోట్లు ఆఫర్ చేసింది. వీడియోకాన్‌కు రుణాలు ఇచ్చిన ఎస్బీఐ నేతృత్వంలోని సంస్థలకు 94.98 శాతం వోటింగ్‌కు ప్రాతినిధ్యం ఉంది. ఇందులో ఒక్క ఎస్బీఐ ప్రాతినిధ్య వోటు 18.05 శాతం. జరిగింది ఇదీ... ట్విన్ స్టార్ టెక్నాలజీస్ రూ.2,962 కోట్ల బిడ్‌కు జూన్ 9న ఎన్సీఎల్టీ ముంబై బెంచ్ ఆమోదముద్ర వేసింది. అయితే ఈ ఆమోదం సందర్భంగా ఈ బిడ్ అతి తక్కువగా ఉందని, దీనివల్ల క్రెడిటార్‌కు ఒరిగిదేమీ ఉండదని, ట్విన్ స్టార్ టెక్నాలజీస్ చెల్లించేది నామమాత్రమని కూడా ఎన్సీఎల్టీ బెంచ్ వ్యాఖ్యానించడం గమనార్హం. బిడ్డింగ్ విషయంలో తమ పునరాలోచనకు ఆయా పరిణామాలు, వ్యాఖ్యలు, ఈ విషయంలో వ్యక్తమైన అభిప్రాయాలు కూడా కారణమని తాజాగా ఎస్బీఐ నేతృత్వంలోని క్రెడిటార్స్ కమిటీ అప్పిలేట్ ట్రిబ్యునల్‌కు తెలిపింది. ఈ రిజల్యూషన్ ప్రణాళికపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ఇరువురు క్రెడిటార్లు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఐఎఫ్సీఐ లిమిటెడ్‌లు కూడా జూన్ 19నే అప్పిలేట్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. దీనితో ఎన్సీఎల్టీ ఉత్తర్వుపై ఇప్పటికే అప్పిలేట్ ట్రిబ్యునల్ స్టే విధించింది. యథాతథ పరిస్థితి కొనసాగింపునకు ఆదేశాలు జారీ చేసింది. అయితే అప్పిలేట్ ట్రిబ్యునల్ స్టే ఎత్తివేయాలని కోరుతూ ట్విన్ స్టార్ టెక్నాలజీస్ సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ ఫలితం దక్కలేదు. ఆగస్టు 13న ట్విన్‌స్టార్ పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. తన రిజల్యూషన్ ప్రణాళికను తొలత ఆమోదించి తరువాత యూ టార్న్ తీసుకోవడం సమంజసం కాదన్నది ట్విన్‌స్టార్ టెక్నాలజీస్ వాదన. కాగా తమ గ్రూప్ కంపెనీలను కేవలం రూ.2,962 కోట్ల కొనుగోలుకు వీలులేదంటూ వీడియోకాన్ గ్రూప్ చైర్మన్, ఎండీ వేణగోపాల్ ధూత్ దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా అప్పిలేట్ ట్రిబ్యునల్ విచారణకు స్వీకరించింది. దివాలా కోడ్‌పై విమర్శల తీరిది రిజల్యూషన్ ప్రణాళిక అమల్లో సీఓసీది కీలకపాత్ర. అయితే రుణాల్లో కూరుకుపోయి దివాల పక్రియలో ఉన్న కంపెనీ అమ్మకాలకు సంబంధించి రిజల్యూషన్ ప్రక్రియలో క్రెడిటార్స్ కమిటీ 95 శాతం వరకూ రాయితీ (హెయిర్‌కట్స్) ఇస్తుండడంపై ఇటీవల తీవ్ర విమర్శలు తలెత్తుతున్నాయి. తమకు రావాల్సిన బకాయిలకు సంబంధించి క్రెడిటార్ల సంఘం భారీ మాఫీలు జరిపి, రిజల్యూషన్ ప్రణాళికలను ఆమోదించడం తగదన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐబీసీ (ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్ట్సీ కోడ్) దివాలా ప్రక్రియలో కీలకమైన కమిటీ ఆఫ్ క్రెడిటార్స్ (సీఓసీ)కి ఒక నియమావళిని జారీ చేసే పనిలో కేంద్రం ఉన్నట్లు కనబడుతోంది. ఈ విషయంలో ఆర్థికశాఖ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్లతో కార్పొరేట్ వ్యవహారాల శాఖ చర్చిస్తున్నట్లు కార్పొరేట్ వ్యవహారాల కార్యదర్శి రాజేష్ వర్మ ఇటీవల తెలిపారు. అయితే అధిక హెయిర్‌కట్స్ విమర్శలపై ఆయన ఈ సందర్భంగా ఆయన ఎటువంటి వ్యాఖ్యలు, ఆ ప్రస్తావన చేయకపోవడం గమనార్హం. ఐబీసీకి పలు సవరణల ద్వారా దీనిని ఎప్పటికప్పుడు మరింత పటిష్టంగా మార్చడం జరుగుతోంది. ఈ దిశలో ఇప్పటికి ఐబీసీకి ఆరు సవరణలు జరిగాయి. ఐబీసీని మరింత సమర్థవంతంగా పటిష్టంగా మార్చడానికి విద్యావేత్తలు, విధాన నిర్ణేతలు, పరిశోధకులు, సంబంధిత ఇతర వర్గాలతో కేంద్రం నిరంతరం చర్చలు జరుపుతుందని, ఆయా సిఫారసులకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకుంటుందని అత్యున్నత స్థాయి వర్గాలు పేర్కొంటున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థ ఐదు ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేరుకోవడంలో ఇది కీలకమని కూడా ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. -
వీడియోకాన్ నష్టాలు రూ.6,761 కోట్లు
న్యూఢిల్లీ: దివాలా ప్రక్రియ నడుస్తున్న వీడియోకాన్ ఇండస్ట్రీస్ గత ఆర్థిక సంవత్సరంలో భారీ నష్టాలను ప్రకటించింది. మార్చి, 2019తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రూ.6,761 కోట్ల నికర నష్టాలు వచ్చాయని సంస్థ తెలిపింది. ఆదాయం భారీగా తగ్గడమే దీనికి కారణమని పేర్కొంది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరంలో నష్టాలు రూ.5,264 కోట్లని వెల్లడించింది. 2017–18 ఆర్థిక సంవత్సరంలో రూ.3,424 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం గత ఆర్థిక సంవత్సరంలో రూ.1,063 కోట్లకు తగ్గిందని కంపెనీ తెలిపింది. గత ఆర్థిక సంవత్సరానికి గాను మొత్తం రూ.1,413 కోట్ల రుణాలను రద్దు చేశామని వివరించింది. వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంక్‌లకు వీడియోకాన్ గ్రూప్ బకాయిలు రూ.90,000 కోట్ల మేర ఉంటాయి. -
టేకోవర్‌కు సిద్ధంగా వీడియోకాన్
న్యూఢిల్లీ: వీడియోకాన్ ఇండస్ట్రీస్ చేతులు మారనుంది. రూ.20,000 కోట్ల రుణాలు చెల్లించడంలో విఫలం కావడంతో వీడియోకాన్ ఇండస్ట్రీస్‌పై ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్(ఐబీసీ) కింద దివాలా ప్రక్రియ కొనసాగుతోంది. ఈ దివాలా ప్రక్రియలో భాగంగా వీడియోకాన్‌ను టేకోవర్ చేయాలనుకుంటున్న సంస్థలు బిడ్లు సమర్పించాలని రిజల్యూషన్ ప్రొఫెషనల్ అనుజ్ జైన్ తాజాగా ఒక ప్రకటన చేశారు. వచ్చే నెల 5లోపు బిడ్లు సమర్పించాలని జైన్ పేర్కొన్నారు. కన్సూమర్ డ్యూరబుల్స్ వ్యాపారంలో వీడియోకాన్ కంపెనీకి మంచి పేరు ఉంది. 2012లో ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి రూ.3,250 కోట్ల రుణం పొందడానికి అక్రమ పద్ధతులు పాటించిందంటూ వీడియోకాన్ కంపెనీపై ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది. -
రుణాలు చెల్లించలేకపోవడానికి నోట్ల రద్దే కారణం
న్యూఢిల్లీ: బ్యాంకులకు సుమారు రూ.20,000 కోట్ల వరకు రుణ బకాయి పడి, చెల్లింపుల్లో విఫలమైన వీడియోకాన్ ఇండస్ట్రీస్ ఎన్సీఎల్టీ ముందు కొత్త వాదనలు వినిపించింది. తమ కంపెనీ వ్యాపారం దెబ్బతిని రుణాలు చెల్లించలేకపోవడానికి మోదీ సర్కారు నోట్ల రద్దు, 2జీ స్కామ్‌లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు, బ్రెజిల్ ప్రభుత్వాల పాత్రను వీడియోకాన్ తరఫు న్యాయవాది వినిపించారు. కంపెనీకి వ్యతిరేకంగా దివాలా చర్యలను కోరుతూ ఎస్బీఐ దాఖలు చేసిన పిటిషన్‌ను ఎన్సీఎల్టీ ముంబై బెంచ్ గత వారం ఆమోదించిన విషయం తెలిసిందే. గతంలో సమయానికి రుణ చెల్లింపులు చేసిన చరిత్ర కంపెనీకి ఉందని, ప్రస్తుతం చెల్లింపుల్లో విఫలం అవడానికి ఊహించని పరిస్థితులే కారణమని వీడియోకాన్ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. ‘‘మోడీ ప్రభుత్వం తీసుకున్న డీమోనిటైజేషన్ నిర్ణయం మా సీఆర్టీ టెలివిజన్ల వ్యాపారాన్ని ముంచేసింది. సరఫరాదారులు ముడి సరుకులను సరఫరా చేయలేకపోయారు. దీంతో ఆ వ్యాపారం గణనీయంగా తగ్గిపోవడంతో మూసేయాల్సి వచ్చింది’’ అని కోర్టుకు తెలిపారు. ఇక, 2012లో సుప్రీంకోర్టు 100కుపైగా 2జీ లైసెన్స్‌లను రద్దు చేసిందని, అందులో వీడియోకాన్ లైసెన్స్‌లు 21 వరకు ఉండటంతో భారీగా నష్టపోవాల్సి వచ్చిందని, బ్యాంకులకు చెల్లింపులు చేయలేకపోయినట్టు వివరించారు. బ్రెజిల్ పెట్రోలియంతో కలసి జాయింట్ వెంచర్ కింద ఆయిల్, గ్యాస్ వ్యాపార నిర్వహణకు అక్కడి ప్రభుత్వ అనుమతిలో జాప్యం చేయడంతో నష్టాలు వచ్చినట్టు తెలిపారు. -
వీడియోకాన్‌కు షాకిచ్చిన బ్యాంకులు
ముంబై : వేలకోట్లు ఎగనామం పెట్టిన సంస్థలపై ఉక్కుపాదం మోపేందుకు బ్యాంకులు రంగంలోకి దిగాయి. ఈ మేరకు వీడియోకాన్ ఇండస్ట్రీస్‌కు బ్యాంకులు షాకిచ్చాయి. ఈ ఇండస్ట్రీస్ అకౌంట్లపై ఫోరెన్సిక్ ఆడిట్ చేపట్టాలని బ్యాంకుల కన్సోర్టియం ఎస్బీఐ ఆదేశాలు జారీచేసింది. కంపెనీ వ్యాపార పరిస్థితులు బాగా లేక రుణాలు కట్టడం లేదా? లేదా తప్పుడు ఆర్థిక నిర్వహణతో ఈ విధంగా పాల్పడుతుందో తెలుసుకోవడం కోసం ఎస్బీఐ ఫోరెన్సిక్ ఆడిట్‌కు ఆదేశించినట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. వీడియోకాన్ మొత్తం రూ.43వేల కోట్ల రుణాలు బ్యాంకులకు ఎగనామం పెట్టింది. దేశంలో అతిపెద్ద నాలుగు ఆడిట్ సంస్థల్లో ఒకటైన కేపీఎంజీ ఈ ఆడిట్‌ను చేపట్టబోతుందని తెలిసింది. ఆఫ్రికాలో ఉన్న టెలివిజన్ తయారీ నుంచి ఆయిల్ అన్వేషణ వరకు అన్ని వ్యాపారాల గ్రూప్ అకౌంట్లను ఈ ఆడిట్ సంస్థ తనిఖీ చేయనుంది. కేపీఎంజీ తన రిపోర్టును సమర్పించిన అనంతరం వెనువెంటనే ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్ట్రప్సీ కోడ్ కింద రుణాలను రీకాస్ట్ చేసే ప్రక్రియ ప్రారంభమవుతోంది. ప్రస్తుతం ఈ గ్రూప్‌కు రుణాలిచ్చిన బ్యాంకులు, ప్రమోటర్లు రుణాల పునర్నిర్మాణం కోసం చూస్తున్నారు. ఈ ప్రక్రియలో ముందుకు వెళ్లేందుకు ఫోరెన్సిక్ ఆడిట్ చేయాలని నిర్ణయించినట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ రుణాల ఎగవేత కేసులో చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌తో సహా ఐదుగురు ఐడీబీఐ బ్యాంకు అధికారులు అరెస్టు అయిన క్రమంలో దేశీయ బ్యాంకులు నిర్వహణ అభీష్టానుసారం నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభించాయి. కంపెనీ అన్ని బాధ్యతలను సక్రమంగా చేపడుతోందని కానీ రుణాలను చెల్లించడానికి తమకు మరింత సమయం కావాలని వీడియోకాన్ ఇంటస్ట్రీస్ చైర్మన్ వేణుగోపాల్ దూత్ చెప్పారు. ప్రస్తుతం వీడియోకాన్‌కు రూ.43వేల కోట్లుంటే, మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.793 కోట్లే ఉంది. ఈ గ్రూప్‌లో 62 శాతం వాటా దూత్ కుటుంబసభ్యులే కలిగి ఉన్నారు. రుణాలను రీకాస్ట్ చేయాలని కంపెనీ బ్యాంకులను కోరుతోంది. రుణాలను చెల్లించడానికి మరింత సమయం కావాలని అభ్యర్థిస్తోంది. ఈ క్రమంలోనే బ్యాంకుల కన్సార్టియం ఎస్బీఐ ఫోర్సెన్సిల్ ఆడిట్‌కు ఆదేశించింది.