వీడియోకాన్‌కు షాకిచ్చిన బ్యాంకులు
వీడియోకాన్‌కు షాకిచ్చిన బ్యాంకులు
Published Fri, Aug 4 2017 8:42 AM | Last Updated on Thu, Oct 4 2018 5:51 PM
ముంబై : వేలకోట్లు ఎగనామం పెట్టిన సంస్థలపై ఉక్కుపాదం మోపేందుకు బ్యాంకులు రంగంలోకి దిగాయి. ఈ మేరకు వీడియోకాన్ ఇండస్ట్రీస్‌కు బ్యాంకులు షాకిచ్చాయి. ఈ ఇండస్ట్రీస్ అకౌంట్లపై ఫోరెన్సిక్ ఆడిట్ చేపట్టాలని బ్యాంకుల కన్సోర్టియం ఎస్‌బీఐ ఆదేశాలు జారీచేసింది. కంపెనీ వ్యాపార పరిస్థితులు బాగా లేక రుణాలు కట్టడం లేదా? లేదా తప్పుడు ఆర్థిక నిర్వహణతో ఈ విధంగా పాల్పడుతుందో తెలుసుకోవడం కోసం ఎస్‌బీఐ ఫోరెన్సిక్ ఆడిట్‌కు ఆదేశించినట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. వీడియోకాన్ మొత్తం రూ.43వేల కోట్ల రుణాలు బ్యాంకులకు ఎగనామం పెట్టింది.
దేశంలో అతిపెద్ద నాలుగు ఆడిట్ సంస్థల్లో ఒకటైన కేపీఎంజీ ఈ ఆడిట్‌ను చేపట్టబోతుందని తెలిసింది. ఆఫ్రికాలో ఉన్న టెలివిజన్ తయారీ నుంచి ఆయిల్ అన్వేషణ వరకు అన్ని వ్యాపారాల గ్రూప్ అకౌంట్లను ఈ ఆడిట్ సంస్థ తనిఖీ చేయనుంది. కేపీఎంజీ తన రిపోర్టును సమర్పించిన అనంతరం వెనువెంటనే ఇన్‌సాల్వెన్సీ అండ్ బ్యాంక్ట్రప్సీ కోడ్ కింద రుణాలను రీకాస్ట్ చేసే ప్రక్రియ ప్రారంభమవుతోంది.
ప్రస్తుతం ఈ గ్రూప్‌కు రుణాలిచ్చిన బ్యాంకులు, ప్రమోటర్లు రుణాల పునర్నిర్మాణం కోసం చూస్తున్నారు. ఈ ప్రక్రియలో ముందుకు వెళ్లేందుకు ఫోరెన్సిక్ ఆడిట్ చేయాలని నిర్ణయించినట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ రుణాల ఎగవేత కేసులో చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌తో సహా ఐదుగురు ఐడీబీఐ బ్యాంకు అధికారులు అరెస్టు అయిన క్రమంలో దేశీయ బ్యాంకులు నిర్వహణ అభీష్టానుసారం నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభించాయి. కంపెనీ అన్ని బాధ్యతలను సక్రమంగా చేపడుతోందని కానీ రుణాలను చెల్లించడానికి తమకు మరింత సమయం కావాలని వీడియోకాన్ ఇంటస్ట్రీస్ చైర్మన్ వేణుగోపాల్ దూత్ చెప్పారు.
ప్రస్తుతం వీడియోకాన్‌కు రూ.43వేల కోట్లుంటే, మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.793 కోట్లే ఉంది. ఈ గ్రూప్‌లో 62 శాతం వాటా దూత్ కుటుంబసభ్యులే కలిగి ఉన్నారు. రుణాలను రీకాస్ట్ చేయాలని కంపెనీ బ్యాంకులను కోరుతోంది. రుణాలను చెల్లించడానికి మరింత సమయం కావాలని అభ్యర్థిస్తోంది. ఈ క్రమంలోనే బ్యాంకుల కన్సార్టియం ఎస్‌బీఐ ఫోర్సెన్సిల్ ఆడిట్‌కు ఆదేశించింది.
Advertisement
Advertisement