న్యూఢిల్లీ: వీడియోకాన్ ఇండస్ట్రీస్ చేతులు మారనుంది. రూ.20,000 కోట్ల రుణాలు చెల్లించడంలో విఫలం కావడంతో వీడియోకాన్ ఇండస్ట్రీస్‌పై ఇన్‌సాల్వెన్సీ అండ్ బ్యాంక్‌రప్టసీ కోడ్(ఐబీసీ) కింద దివాలా ప్రక్రియ కొనసాగుతోంది. ఈ దివాలా ప్రక్రియలో భాగంగా వీడియోకాన్‌ను టేకోవర్ చేయాలనుకుంటున్న సంస్థలు బిడ్‌లు సమర్పించాలని రిజల్యూషన్ ప్రొఫెషనల్ అనుజ్ జైన్ తాజాగా ఒక ప్రకటన చేశారు.
వచ్చే నెల 5లోపు బిడ్‌లు సమర్పించాలని జైన్ పేర్కొన్నారు. కన్సూమర్ డ్యూరబుల్స్ వ్యాపారంలో వీడియోకాన్ కంపెనీకి మంచి పేరు ఉంది. 2012లో ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి రూ.3,250 కోట్ల రుణం పొందడానికి అక్రమ పద్ధతులు పాటించిందంటూ వీడియోకాన్ కంపెనీపై ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment