నియోజకవర్గ అభివృద్ధి నిధులు 5 కోట్లకు పెంపు | Each Mla And Mlc Would Be Provided Cdf Fund Rs 5 Crore In The Next Financial Year In Telangana | Sakshi
Sakshi News home page

నియోజకవర్గ అభివృద్ధి నిధులు 5 కోట్లకు పెంపు

Published Sat, Jul 3 2021 4:34 AM | Last Updated on Sat, Jul 3 2021 5:19 AM

Each Mla And Mlc Would Be Provided Cdf Fund Rs 5 Crore In The Next Financial Year In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నియోజకవర్గ అభివృద్ధి నిధుల (సీడీఎఫ్‌)ను రూ. 5 కోట్లకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు నియోజకవర్గ అభివృద్ధి నిధులను 2021–22 ఆర్థిక సంవత్సరంలో రూ.3 కోట్ల నుంచి రూ. 5 కోట్లకు పెంచుతూ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు జీవో ఎంఎస్‌ నెం: 13 జారీ చేశారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ తమ నియోజకవర్గాల వారీగా ఈ నిధులను వెచ్చించేందుకు గాను త్వరలోనే మార్గదర్శకత్వాలు విడుదల చేయనున్నట్టు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఉమ్మడి, ప్రస్తుత జిల్లాల వారీగా రాష్ట్ర మంత్రి వర్గంలోని 16 మంది పరిధిలోనికి వచ్చే అసెంబ్లీ నియోజకవర్గాలు, ఆయా జిల్లాల పరిధిలోనికి వచ్చే ఎమ్మెల్సీల వివరాలను ప్రత్యేకంగా ఆ జీవోలో పేర్కొన్నారు.   

చదవండి: షర్మిల పార్టీ వ్యూహకర్తగా ప్రియ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement