ఫైల్ ఫోటో
సాక్షి, న్యూఢిల్లీ: కరోనాతో అతలాకుతలం అవుతున్న నేపథ్యంలో ప్రస్తుత 2019–20 ఆర్థిక సంవత్సరం జూన్ వరకూ కొనసాగనుందనే వార్తలకు కేంద్రం చెక్ పెట్టింది. ఇలాంటి వదంతులను నమ్మవద్దంటూ కేంద్రం స్పష్టం చేసింది. యథావిధిగా ఈ ఆర్థిక సంవత్సరం 31.3.2020 తో ముగుస్తుందని తెలిపింది. ప్రస్తుత 2019-20 ఆర్థిక సంవత్సరాన్ని పొడిగించలేదని, మార్చి 31 తో ముగియనున్నట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. భారత స్టాంప్ చట్టంలో చేసిన మరికొన్ని సవరణలకు సంబంధించి 2020 మార్చి 30న భారత ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ తప్పుగా పేర్కొనబడిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. "ఆర్థిక సంవత్సరం పొడిగింపు లేదు" అని ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. సాంప్రదాయకంగా ప్రతి ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1తో ప్రారంభమై ఆ తదుపరి ఏడాది మార్చి 31తో పూర్తవుతుంది.
కరోనా కల్లోలం కారణంగా కేంద్రం భారత్ ఆర్థిక సంవత్సరాన్ని3 నెలలు పొడిగించిందంటూ వార్తలు వెలువడ్డాయి. 2020 ఏప్రిల్ నుంచీ కాకుండా 2020 జూలై 1వ తేదీ నుంచీ ప్రారంభమవుతుందని సూచించాయి. అయితే ఈ అంచనాలపై ఆర్థికమంత్రిత్వ శాఖ వివరణ ఇచ్చింది. మరోవైపు ఈ ఆర్థిక సంవత్సరం మార్చి 31 ముగియనున్న నేపథ్యంలోనే వ్యక్తిగత ఆదాయ పన్ను వివరాల ఫైలింగ్ ను, ప్యాన్-ఆధార్ లింకింగ్ గడువున, జీఎస్టీ ఫైలింగ్ లాంటి కొన్ని అంశాలను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ జూన్ 30 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే.
(చదవండి : తీవ్ర ఆర్థికమాంద్యం, బంగారం కొనొచ్చా?)
Comments
Please login to add a commentAdd a comment