సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవులను పొడిగిస్తున్నట్లు ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే కరోనా సెకండ్ వేవ్ దృష్ట్యా విద్యార్ధులకు పరీక్షలు నిర్వహించకుండానే జూన్ 30 వరకు మరోమారు సెలవులను పొడిగించింది. ఇక జూన్ 30 తర్వాత అప్పటి పరిస్థితిని బట్టి తదుపరి నిర్ణయం తీసుకోన్నుట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో కేసుల కట్టడి కోసం లాక్‌డౌన్ విధించి ఆంక్షలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.
చదవండి: రుతు పవనాలు వచ్చేస్తున్నాయ్
Comments
Please login to add a commentAdd a comment