
( ఫైల్ ఫోటో )
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి 2023కి సెలవుల్ని సవరించింది విద్యాశాఖ. ఈ మేరకు సవరణ ప్రకటనతో తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 12వ తేదీ నుంచి 18వ తేదీ వరకు సంక్రాంతి సెలవులుగా ప్రకటించింది.
జనవరి 19వ తేదీన పాఠశాలలు పున: ప్రారంభం అవుతాయి. ఈ మేరకు రీ నోటిఫై చేసిన ఉత్తర్వులను విడుదల చేసింది. అకడమిక్ క్యాలెండర ప్రకారం.. తొలుత 11 నుంచి 16వ తేదీ వరకే సెలవులు ఇవ్వాలని భావించినప్పటికీ.. ఉపాధ్యాయ సంఘాల విజ్ణప్తి మేరకు అదనంగా ఒకరోజు సెలవు పొడిగింపు ఇస్తున్నట్లు ప్రకటించింది. ముక్కనుము నేపథ్యంలోనే ఈ పరిశీలన చేసినట్లు తెలుస్తోంది.
సంక్రాంతి సెలవుల్లో మార్పులు కోరుతూ ఉపాధ్యాయ సంఘాలు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు విజ్ఞప్తి చేశాయి.దీనిపై ఆయన సానుకూలంగా స్పందించారు. అయితే.. అకడమిక్ క్యాలెండర్ చెదరకుండా ఉండేందుకు.. ఏదో ఒక సెలవు రోజు పనిచేసేలా షరతుతో సెలవు పొడిగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది ఏపీ విద్యాశాఖ.
Comments
Please login to add a commentAdd a comment