Sankranti holidays
-
సంక్రాంతి సెలవులపై ఏపీ ప్రభుత్వం క్లారిటీ.. ఆ వార్తల్లో నిజం లేదు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పాఠశాలలకు జనవరి 10 నుంచి 19 వరకు సంక్రాంతి సెలవులు (Sankranti holidays) ఉంటాయని ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ కృష్ణారెడ్డి తెలిపారు. 2024–25 విద్యా క్యాలెండర్ ప్రకారమే సెలవులు ఉంటాయని పేర్కొన్నారు. వర్షాల కారణంగా పలు జిల్లాల్లో స్కూళ్లకు స్థానికంగా సెలవులు ఇచ్చినందున ఈసారి 11–15 లేదా 12–16 తేదీల్లో సంక్రాంతి సెలవులు ఉంటాయని వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. సోషల్ మీడియాలో (Social Media) జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్షకు నోటిఫికేషన్ జారీ 2025–26 విద్యా సంవత్సరానికిగాను ఆలిండియా సైనిక్ స్కూల్ (Sanik School) ప్రవేశ పరీక్షకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నోటిఫికేషన్ జారీచేసింది. ఆరు, తొమ్మిది తరగతుల్లో ప్రవేశానికి దేశవ్యాప్తంగా నిర్వహించే ఈ పరీక్షకు జనవరి 13 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆరో తరగతిలో ప్రవేశానికి మార్చి 31 నాటికి 10 నుంచి 12 ఏళ్ల మధ్య వయసు గల వారు దరఖాస్తు చేసుకోవచ్చు. 8వ తరగతి పాస్ అయి, 11 నుంచి 15 ఏళ్ల మధ్య వయసున్న వారు 9వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవచ్చు. వివరాలకు https://exams.nta.ac.in/AISSEE/చూడొచ్చు.స్టీల్‌ప్లాంట్‌లో అప్రెంటీస్‌కు దరఖాస్తుల ఆహ్వానంవిశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌లో (Vizag Steelplant) గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ ట్రైనీ (గాట్), టెక్నీషియన్ అప్రెంటీస్ ట్రైనీ (టాట్)కు దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేశారు. గాట్‌కు రూ.9 వేలు, టాట్కు రూ.8 వేలు స్టైఫండ్ చెల్లించనున్నారు. 2022 తర్వాత గ్రాడ్యుయేషన్, డిప్లమో పూర్తి చేసిన అభ్యర్థులు నాట్స్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంది. గూగుల్ ఫారం నింపేందుకు జనవరి 9 వరకు గడువు ఉన్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు.చదవండి: ఇంటర్ ఫీజు చెల్లింపునకు తత్కాల్ అవకాశంచైల్డ్ కేర్ లీవ్ షరతులతో ఇబ్బందులున్యాయం చేయాలని ఏపీటీఎఫ్ అమరావతి డిమాండ్సాక్షి, అమరావతి: మహిళా ఉద్యోగ, ఉపాధ్యాయులకు ప్రభుత్వం ఇచ్చిన చైల్డ్ కేర్ లీవ్‌లను 10 విడతల్లోనే వినియోగించుకోవాలన్న షరతుతో వారికి ఇబ్బందులు తలెత్తుతున్నాయని, ఈ షరతును రద్దు చేసి ఉద్యోగినులకు న్యాయం చేయాలని ఏపీటీఎఫ్ అమరావతి రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీవీ ప్రసాద్, రాధాకృష్ణ డిమాండ్ చేశారు. షరతులతో సెలవు లక్ష్యం దుర్వినియోగమవుతోందన్నారు. అవసరం మేరకు మాత్రమే సెలవు ఉపయోగించుకునేలా, అపరిమిత విడతలతో చైల్డ్ కేర్ లీవ్ పొందేలా 199,36 జీవోలను సవరించాలని వారు విజ్ఞప్తి చేశారు. -
ఏపీలో సంక్రాంతి సెలవులు మరో మూడు రోజులు పొడిగింపు
సాక్షి, అమరావతి: ఏపీలో సంక్రాంతి సెలవులను మరో మూడు రోజులు పొడిగించారు. ముందుగా గురువారం వరకు (జనవరి 18) సంకాంత్రి సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల కోరిక మేరకు మరో మూడు రోజులు సెలవులు పొడిగిస్తున్నట్లు నిర్ణయించినట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్ తెలిపారు. దీంతో జనవరి 22న(సోమవారం) తిరిగి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నట్లు వెల్లడించారు. చదవండి: అంబేద్కర్ విగ్రహం ఏపీకే కాదు.. దేశానికే తలమానికం: సీఎం జగన్ -
12 నుంచి 18 వరకు సంక్రాంతి సెలవులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పాఠశాలలకు ఈనెల 12వ తేదీ నుంచి సంక్రాంతి సెలవులు ప్రారంభం కానున్నాయి. ఈనెల 18 వరకు మొత్తం 7 రోజుల పాటు సెలవులుంటాయి. ముందు సంక్రాంతి సెలవులను 11 నుంచి 16 వరకు ఇచ్చేలా అకడమిక్ క్యాలెండర్‌ను ప్రకటించారు. 17న స్కూళ్లు తిరిగి ప్రారంభించేలా సెలవులు నిర్ణయించారు. అయితే 16న కనుమ ఉండడం, అదే రోజు ఊర్ల నుంచి బయలుదేరి మరునాడే స్కూళ్లకు రావడం అంటే ఇబ్బంది అవుతుందని పలు సంఘాలు, ఉపాధ్యాయులు అభిప్రాయం వ్యక్తం చేశారు. సెలవులను 18వ తేదీవరకు పొడిగించాలని కోరారు. ఆ మేరకు పాఠశాలల పనిదినాలకు ఇబ్బంది కలుగకుండా కొత్తగా సెలవుల షెడ్యూల్‌ను విద్యా శాఖ ప్రకటించింది. ఈ 7 రోజుల సెలవు దినాల్లో ఒక రోజు కాంపన్సేటరీ సెలవు అని విద్యాశాఖ పేర్కొంది. -
ఏపీ: సంక్రాంతి స్కూళ్ల సెలవుల సవరణ..ఉత్తర్వులు జారీ
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి 2023కి సెలవుల్ని సవరించింది విద్యాశాఖ. ఈ మేరకు సవరణ ప్రకటనతో తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 12వ తేదీ నుంచి 18వ తేదీ వరకు సంక్రాంతి సెలవులుగా ప్రకటించింది. జనవరి 19వ తేదీన పాఠశాలలు పున: ప్రారంభం అవుతాయి. ఈ మేరకు రీ నోటిఫై చేసిన ఉత్తర్వులను విడుదల చేసింది. అకడమిక్ క్యాలెండర ప్రకారం.. తొలుత 11 నుంచి 16వ తేదీ వరకే సెలవులు ఇవ్వాలని భావించినప్పటికీ.. ఉపాధ్యాయ సంఘాల విజ్ణప్తి మేరకు అదనంగా ఒకరోజు సెలవు పొడిగింపు ఇస్తున్నట్లు ప్రకటించింది. ముక్కనుము నేపథ్యంలోనే ఈ పరిశీలన చేసినట్లు తెలుస్తోంది. సంక్రాంతి సెలవుల్లో మార్పులు కోరుతూ ఉపాధ్యాయ సంఘాలు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు విజ్ఞప్తి చేశాయి.దీనిపై ఆయన సానుకూలంగా స్పందించారు. అయితే.. అకడమిక్ క్యాలెండర్ చెదరకుండా ఉండేందుకు.. ఏదో ఒక సెలవు రోజు పనిచేసేలా షరతుతో సెలవు పొడిగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది ఏపీ విద్యాశాఖ. -
AP: 10 నుంచి హైకోర్టుకు సంక్రాంతి సెలవులు
సాక్షి, అమరావతి: ఏపీ హైకోర్టుకు ఈ నెల 10వ తేదీ నుంచి 12వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించారు. హైకోర్టు క్యాలెండర్ ప్రకారం 13న భోగి, 14న సంక్రాంతి, 15న కనుమ. ఈ మూడు రోజుల్లో హైకోర్టులో ఎలాంటి కార్యకలాపాలు ఉండవు. 16న ఆదివారం. 17వ తేదీ నుంచి హైకోర్టు తన కార్యకలాపాలను యథావిధిగా కొనసాగిస్తుంది. ఈ సెలవుల్లో అత్యవసర కేసుల విచారణ నిమిత్తం వెకేషన్ కోర్టులు ఏర్పాటయ్యాయి. ఈ వెకేషన్ కోర్టుల్లో న్యాయమూర్తులు జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి, జస్టిస్ కుంభజడల మన్మధరావు, జస్టిస్ కంచిరెడ్డి సురేశ్‌రెడ్డి ఉంటారు. జస్టిస్ సత్యనారాయణమూర్తి, జస్టిస్ మన్మధరావు ద్విసభ్య ధర్మాసనంలో, జస్టిస్ సురేశ్‌రెడ్డి సింగిల్ జడ్జిగా కేసులను విచారిస్తారు. అత్యవసర కేసులను ఈ నెల 10న పిటిషన్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. ఆ పిటిషన్లపై న్యాయమూర్తులు 12న విచారణ జరుపుతారు. హెబియస్ కార్పస్, ముందస్తు బెయిల్ పిటిషన్లు, మెజిస్ట్రేట్లు, సెషన్స్ జడ్జిలు తిరస్కరించిన బెయిల్ పిటిషన్లతో పాటు సెలవులు ముగిసేంత వరకు వేచిచూడలేనంత అత్యవసరం ఉన్న వ్యాజ్యాలను మాత్రమే వెకేషన్ కోర్టులు విచారిస్తాయి. ఈ మేరకు రిజిస్ట్రార్ జనరల్ రవీంద్రబాబు నోటిఫికేషన్ జారీ చేశారు. -
ఊరెళ్దాం.. పల్లె బాట పట్టిన మహానగరం..
ఊరెళ్దాం.. పల్లెందాలను ఆస్వాదిద్దాం . మట్టి పరిమళాలను ఆఘ్రాణిద్దాం.. సంక్రాంతి భోగి భాగ్యాలను ఆహ్వానిద్దాం.. రంగవల్లులు, గొబ్బెమ్మలతో మైమరిచిపోదాం.. గరికపోచలు, పిండిమొగ్గలు, రేగిపండ్లు, నవధాన్యాల కోసం బాల్యంలోకి పరుగులు పెడదాం.. పసందైన అరిసెలు, సకినాలు, లడ్డూలు, గారెలు ఆరగిద్దాం,... పొలంగట్లు, పంటచేలలో స్వేచ్ఛా విహంగాలై విహరిద్దాం.. పిల్లల్లో పిల్లలమై కేరింతలతో పతంగులు ఎగరేద్దాం ఊరూవాడా చుట్టేద్దాం.. దోస్తులతో ముచ్చటిద్దాం పల్లెకు పోదాం చలో చలో.. పండగ చేద్దాం చలో అంటూ .. పట్నం మూటా ముల్లే సర్దుకొని పల్లెకు బైలెల్లింది.. సంక్రాంతి, కనుమ తర్వాత తిరిగొస్తామంటూ బస్కెక్కింది.. సాక్షి, హైదరాబాద్: మహానగరం పల్లె బాట పట్టింది. ఏడాది పాటు కోవిడ్‌తో తీవ్ర ఒత్తిడికి గురైన నగరవాసులు సొంత ఊళ్లలో సంక్రాంతి వేడుకలను సంతోషంగా జరుపుకొనేందుకు పెద్ద సంఖ్యలో తరలివెళ్తున్నారు. గత వారం రోజులుగా సంక్రాంతి ప్రయాణాలు జోరుగా కొనసాగుతున్నాయి. సోమవారం ప్రయాణికుల రద్దీ భారీగా పెరిగింది. పండగ మరో రెండు రోజులే ఉండడంతో తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు లక్షలాది మంది తరలి వెళ్లారు. కోవిడ్ నిబంధనల దృష్ట్యా సీట్లు, బెర్తుల సామర్ధ్యం మేరకే రైళ్లలో ప్రయాణం చేసేందుకు అనుమతినిస్తున్నారు. దీంతో నిర్ధారిత టికెట్లు లభించక లక్షలాది మంది వెయిటింగ్ లిస్టులోనే పడిగాపులు గాస్తున్నారు. చదవండి: సంక్రాంతికి ఊరెళ్తున్నారా.. జరభద్రం! ఆర్టీసీ ప్రత్యేక బస్సులు..4900 ► ఈసారి సంక్రాంతి రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆర్టీసీ 4900 కు పైగా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. తెలుగు రాష్ట్రాలకు హైదరాబాద్ నుంచి రెగ్యులర్‌గా రాకపోకలు సాగించే సుమారు 3500 బస్సులకు ఇవి అదనం. ► ఇప్పటి వరకు సుమారు 1500 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. మరో రెండు రోజుల పాటు రద్దీ కొనసాగనుంది. ► ప్రైవేట్ బస్సులు, సొంత వాహనాలు, ట్రావెల్స్ సంస్థలకు చెందిన మ్యాక్సీ క్యాబ్‌లలోనూ జనం పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. ఇప్పటి వరకు సుమారు 12 లక్షల మంది ఊళ్లకు వెళ్లినట్లు రవాణా వర్గాలు అంచనా వేస్తున్నాయి. చదవండి: సంక్రాంతికి సొంతూరు వెళ్లడం కష్టమే! రద్దీకి అనుగుణంగా అదనపు రైళ్లు.. ► నిర్ధారిత టికెట్ మేరకే అనుమతినివ్వడం వల్ల వెయిటింగ్ లిస్టు జాబితా భారీగా నమోదవుతోంది. దీంతో వివిధ మార్గాల్లో రద్దీకి అనుగుణంగా అదనపు రైళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ► ఇప్పటి వరకు సుమారు 50 ప్రత్యేక రైళ్లను నడిపారు. విజయవాడ, విశాఖ, కాకినాడ, తిరుపతి, మచిలీపట్నం,బెంగళూర్, చెన్నై, భువనేశ్వర్, తదితర ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. ► కోవిడ్ నిబంధనల దృష్ట్యా రైళ్ల సంఖ్య పరిమితంగా ఉండడంతో ప్రయాణికులు పడిగాపులు కాయాల్సి వస్తుంది. టికెట్లు ఉన్నవాళ్లనే రైల్వేస్టేషన్లకు అనుమతివ్వడం వల్ల సాధారణ ప్రయాణికులు జనరల్ బోగీల్లో వెళ్లలేకపోతున్నారు. గతేడాది కంటే రైళ్లలో వెళ్లే ప్రయాణికుల సంఖ్య తగ్గడంతో సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్లలో సాధారణ డిమాండ్‌తోనే రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. ► ‘జనరల్ బోగీల్లో 75 మంది కూర్చొంటే కనీసం మరో 75 మంది నించొని ప్రయాణం చేస్తారు. ప్రస్తుతం కోవిడ్ దృష్ట్యా అందుకు అనుమతి లేకపోవడం వల్ల సీట్ల సామర్ధ్యం మేరకే అన్ని రైళ్లు బయలుదేరుతున్నాయి.’ అని దక్షిణమధ్య రైల్వే ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఒక్క రోజే 500 ప్రత్యేక బస్సులు.. ► రైళ్లు పరిమితంగా ఉండడంతో బస్సులకు డిమాండ్ కనిపిస్తోంది. ఆర్టీసీ, ప్రైవేట్ బస్సుల్లో జనం పెద్ద సంఖ్యలో బయలుదేరారు. ► సోమవారం ఒక్క రోజే 500 బస్సులను అదనంగా ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ► ఉప్పల్, ఎల్బీనగర్, జేబీఎస్, ఎంజీబీఎస్, మెహదీపట్నం తదితర ప్రాంతాలు ప్రయాణికులతో పోటెత్తాయి. ► మరోవైపు సొంత కార్లు, బైక్‌లపైన సైతం తరలి వెళ్లారు.ఇమ్లీబన్ బస్టాండ్‌లో ప్రయాణికుల రద్దీ -
సంక్రాంతికి ఊరెళ్తున్నారా.. జరభద్రం!
సాక్షి, సైబరాబాద్: సంక్రాంతి పండుగ పిల్లలకు సెలవులుండటంతో చాలా మంది ప్రయాణాలు చేస్తారు. ఇదే అదనుగా దొంగలు చేతివాటం ప్రదర్శిస్తారు. ఊళ్లకు వెళ్ళే వారు అప్రమత్తంగా ఉండాలని, ముందస్తుగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీ రోహిణీ ప్రియదర్శిని, ఐపీఎస్ అన్నారు. ‘సంక్రాంతి పండుగ దృష్ట్యా చోరీల నియంత్రణకు అన్ని చర్యలు చేపట్టామని, ప్రజలను అప్రమత్తం చేస్తున్నాం. రాత్రి వేళల్లో వీధుల్లో గస్తీ ఏర్పాటు చేస్తున్నాం. ఈ విషయంలో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ప్రజలు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీ రోహిణీ ప్రియదర్శిని, ఐపీఎస్ ప్రజలకు పలు సూచనలు చేశారు. చదవండి: ఆ జంటకు కాలనీవాసులే కళ్లయ్యారు సంక్రాంతికి ఊరెళ్లే వారికి పోలీసుల సూచనలు.. ► సైబరాబాద్ కమిషనరేట్‌లో పోలీసులు నిఘానేత్రం కింద ప్రజలు, కార్పొరేట్ కంపెనీల సీఎస్ఆర్ సహకారంతో ఇప్పటికే సీసీటీవీ లను ఇన్ స్టాల్ చేశారు. తద్వారా ఎన్నో సంచలనాత్మక నేరాలను ఛేదించారు. ప్రజలు తమ కాలనీలు, ఇళ్లు, పరిసరాలు, షాపింగ్ మాళ్లలో సీసీ కెమెరాలు అమర్చుకోవాలి. ►ఊరు వెళ్తున్నప్పుడు పక్కింటివారికి ఇంటి పరిసరాలను గమనించాలని చెప్పాలి. ►విలువైన వస్తువులను స్కూటర్ డిక్కీల్లో, కారులలో పెట్టడం చేయరాదు. ►ద్విచక్రవాహనాలు, కారులను ఇంటి ఆవరణలోనే పార్కింగ్ చేయాలి, రోడ్లపై నిలుపరాదు. ► బీరువా తాళాలను ఇంట్లో ఉంచరాదు, తమతోపాటే తీసుకెళ్లాలి. ►ఇంటికి తాళం వేసిన తర్వాత తాళం కనబడకుండా డోర్ కర్టెన్ వేయాలి. ► గ్రామాలకు వెళ్లే వారు ఇంట్లో ఏదో ఒక గదిలో లైటు వేసి ఉంచాలి. ►ఎక్కువ రోజులు విహారయాత్రల్లో ఉంటే పేపర్, పాల వారిని రావద్దని చెప్పాలి. ►పని మనుషులు ఉంటే రోజూ వాకిలి ఊడ్చమని చెప్పాలి. ►విలువైన వస్తువుల సమాచారాన్ని, వ్యక్తిగత ఆర్థిక విషయాలను ఇతరులకు చెప్పకూడదు. ► విలువైన వస్తువుల సమాచారాన్ని ఇతరులకు చెప్పకూడదు. (చదవండి: సంక్రాంతి సెలవుల తర్వాత స్కూల్స్ రీఓపెన్) ►ఆరుబయట వాహనాలకు హాండిల్ లాక్‌తో పాటు వీల్ లాక్ వేయాలి. వాచ్ మెన్, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. ► ఇంట్లో బంగారు నగలు, నగదు ఉంటే వాటిని బ్యాంకు లాకర్లలో భద్రపరుచుకోవడం క్షేమం. లేదా ఎక్కువ రోజులు ఊళ్లకు వెళ్లేవారు విలువైన వస్తువులను వెంట తీసుకెళ్లాలి. ► టైమర్‌తో కూడిన లైట్లను ఇంట్లో అమర్చుకోవాలి. ►బ్యాగుల్లో బంగారు నగలు డబ్బు పెట్టుకొని ప్రయాణం చేస్తున్నప్పుడు బ్యాగులు దగ్గరలో పెట్టుకోవాలి. బ్యాగు బస్సులో పెట్టి కిందికి దిగితే దొంగలు అపహరిస్తారు. ►ఇంటి డోర్‌కు సెంట్రల్ లాకింగ్ సిస్టంను ఏర్పాటు చేసుకోవడం సురక్షితం. ►హోమ్ సెక్యూరిటీ సిస్టం ద్వారా ఇంటర్నెట్ అనుసంధానం ఉన్న మీ మొబైల్ నుంచే మీ ఇంటిని ఎక్కడి నుంచి అయినా లైవ్/ప్రత్యక్షంగా చూసుకునే వీలుంది. ఇంటికి సంబంధించిన నాణ్యమైన సిసిటివి లు (షాయోమీ వంటి కంపెనీలు తక్కువ ధరకే) ఆన్లైన్/ మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. హోమ్ సెక్యూరిటీ సర్వెలెన్స్ కు ఇవి ఎంతో ఉపయుక్తం. ►ఇంటి భద్రతాపరంగా ఇంటికి దృఢమైన, నాణ్యమైన తలుపులతో పాటు హై ఎండ్ గోద్రెజ్ హై సెక్యూరిటీ లాక్ సిస్టం ని వాడడం మంచిది. ►తాళం వేయడం కంటే గోద్రెజ్ డోర్ లాక్ చేయడం వల్ల ఇంట్లో మనుషులు ఉన్నారా? లేరా? అనేది తెలియదు. ►సొంత ఇల్లు అయినట్లయితే ఇంటి ప్రధాన ద్వారానికి గ్రిల్స్ అమర్చుకోవడం ద్వారా రెండంచెల భద్రతనిస్తుంది. ►ఇంట్లో, ఇంటి బయట మోషన్ సెన్సర్ లను ఉపయోగించడం మంచిది. ఇంటి బయట మోషన్ సెన్సర్ లైట్లను ఉపయోగించండి. ఇవి చీకటి ఉన్నప్పుడు మాత్రమే పని చేస్తాయి. సెన్సార్లు పరిసరాల్లో ఏదైనా కదలిక గుర్తించగానే లైట్ వెలుగుతుంది. ► సాధారణంగా సరైన భద్రతా ప్రమాణాలు పాటించని ఇండ్లు, చీకటి ప్రదేశం, పాత గ్రిల్స్, బలహీనమైన తాళాలు ఉన్న ఇండ్లలో దొంగలు పడే అవకశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి, కొత్త వ్యక్తుల కదలికలపై ప్రత్యేక దృష్టి సారించాలి. ►ప్రజలు తమ ప్రాంతంలో గస్తీ ఏర్పాటుకు సహకరించాలి. పోలీసు స్టేషన్ నెంబర్, వీధుల్లో వచ్చే బీట్ కానిస్టేబుల్ నెంబర్ దగ్గర పెట్టుకోవాలి. ప్రజలు నిరంతరం పోలీసులతో సమన్వయంగా సహకరిస్తే చోరీలను నియంత్రించడం చాలా సులభం. ►అనుమానిత వ్యక్తుల కదలికలను గమనించి, పోలీసులకు సమాచారం ఇవ్వాలి. ► ఇళ్లకు తాళాలు వేసి ఊర్లకు వెళ్లేటప్పుడు చుట్టు పక్కల వారికి లేదా స్థానిక పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించాలి. ► నమ్మకమైన సెక్యూరిటీ గార్డులను, వాచ్ మెన్ ను నియమించుకోవాలి. ►కాలనీవాళ్లు కమిటీలు వేసుకొని వాచ్మెన్లను, సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకకోవాలి. ► రాత్రి సమయంలో కొత్తవారు ఎవరైనా వచ్చినా వారి వివరాలు తెలుసుకుని రిజిస్టర్లో నమోదు చేసుకోవడం మంచిదని అపార్టుమెంట్ వాచ్మెన్లకు తెలపాలి. ►ఎప్పుడు కూడా స్థానిక పోలీసు స్టేషన్ నెంబర్ దగ్గరుంచుకోవడం మంచిది. ►దూర ప్రాంతాలకు వెళ్లేవారు తమ ఇంటి చిరునామా, ఫోన్ నెంబర్‌ను సంబంధిత పోలీసు స్టేషన్ అధికారులకు తెలపాలి. దీంతో వారి వివరాలను రిజిస్టర్లో నమోదు చేసుకుని ఊర్లెళ్లిన వారి ఇళ్లపై నిఘాను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ►కాలనీల్లో దొంగతనాల నివారణకు స్వచ్ఛందంగా కమిటీలను నిర్వహించుకోవాలి. ఈ కమిటీ సభ్యులు ఎప్పటికప్పుడు పోలీసులకు అందుబాటులో ఉంటూ అనుమానాస్పద, కొత్త వ్యక్తుల కదలికలపై 100 డయల్ లేదా సైబరాబాద్ పోలీసు వాట్సాప్ నెంబర్ 9490617444 కు సమాచారం ఇవ్వాలి. -
ఆర్టీసీకి సంక్రాంతి పండుగ
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి రద్దీ ఆర్టీసీకి కాసులు కురిపించింది. సొంతూళ్లలో పండుగ జరుపుకునేందుకు హైదరాబాద్ నుంచి వెళ్లే దాదాపు 30 లక్షల మంది ప్రయాణికుల్లో సింహభాగం ఆర్టీసీపైనే ఆధారపడటం కలిసొచ్చింది. పెద్ద పండుగగా గుర్తింపు పొందిన సంక్రాంతి ప్రతీసారీ ఆర్టీసీ ఖజానాను కళకళలాడిస్తుంది. ఈసారీ రికార్డుస్థాయి ఆదాయం సమకూరటంతో ఆర్టీసీలో ఆనందం వ్యక్తమవుతోంది. ఈ నెల 9 నుంచి 16 వరకు ఆర్టీసీ రూ.94 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. దాదాపు 4 వేల ప్రత్యేక బస్సులు తిప్పటం ద్వారా ఇంతపెద్ద మొత్తం సంపాదించింది. ఇది గతేడాది సంక్రాంతి సమయంలో వచ్చిన ఆదాయం కంటే రూ.11 కోట్లు అధికం కావటం విశేషం. గతేడాది అదే తేదీల్లో రూ.83 కోట్లు ఆర్జించింది. కిలోమీటరుకు 20 పైసలు చొప్పున చార్జీలు పెంచటంతో ఈ భారీ తేడాకు ప్రధాన కారణం. తీవ్ర సంక్షోభం నుంచి బయటపడేందుకు ఆర్టీసీ సరికొత్త చర్యలతో జనానికి మరింత చేరువయ్యే ప్రయత్నం చేయటం కూడా మరో కారణంగా నిలిచింది. గతేడాదితో పోలిస్తే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించిన వారి సంఖ్య పెరగటం దీనికి నిదర్శనం. -
మంత్రి గంటా ఊర్లోనే అందరికీ సంక్రాంతి!
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: సంక్రాంతి పండుగకు కుటుంబ సభ్యులతో కలిసి సొంత గ్రామాలకు వెళ్లి సరదాగా గడుపుదామని సంబరపడ్డ అధికారులు, ఉపాధ్యాయులను ప్రకాశం జిల్లా విద్యాశాఖ ఆదేశాలు నివ్వెరపోయేలా చేశాయి. సంక్రాంతి పండుగనాడు సొంత ఊళ్లలో కాకుండా మంత్రి గంటా శ్రీనివాసరావు సొంత గ్రామం ప్రకాశం జిల్లాలోని కామేపల్లికి తరలివచ్చి సంక్రాంతి సంబరాల్లో పాల్గొనాలని జిల్లా విద్యాశాఖాధికారి హుకుం జారీ చేశారు. మండల విద్యాశాఖాధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు విద్యార్థులను తీసుకుని కామేపల్లికి రావాలని ఆయన శనివారం ఉదయం 7 గంటలకే ఈ మెసేజ్ పెట్టారు. ఈ మెసేజ్ జిల్లాలోని ఉపాధ్యాయులందరికీ చేరింది. అందులో పండుగ సందర్భంగా కామేపల్లిలో రంగోలి, పాటలు, డ్యాన్స్, ముగ్గుల పోటీలు నిర్వహించి పిల్లలకు, ఉపాధ్యాయులకు బహుమతులు ఇస్తారని పేర్కొన్నారు. దీనికోసం మంత్రి గంటా సోదరుడు, విద్యా శాఖను అన్నీ తానై నడిపిస్తున్న గంటా చిరంజీవి ఏకంగా ఆహ్వాన పత్రికలను ముద్రించి పంచిపెట్టడం గమనార్హం. మంత్రి తీరుపై ఉపాధ్యాయుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. బహిరంగంగా విమర్శలు చేయలేక మీడియా కార్యాలయాలకు ఫోన్లు చేసి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. -
సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆరు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఉమాశంకర్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సికింద్రాబాద్–కాకినాడ: సికింద్రాబాద్–కాకినాడ సువిధ (నం. 82709) ప్రత్యేక రైళ్లు జనవరి 11, 12, 13 తేదీల్లో సికింద్రాబాద్ నుంచి రాత్రి 8 గంటలకు బయల్దేరి మరునాడు ఉదయం ఉదయం 6.25కు కాకినాడకు చేరుతుంది. కాజీపేట, ఖమ్మం, రాయపాడు, ఏలూరు, తాడేపల్లి గూడెం, నిడదవోలు, రాజమండ్రి, ద్వారపూడి, సామర్లకోటలో హాల్టి్టంగ్ కల్పించారు. ∙కాచిగూడ–కాకినాడ: కాచిగూడ–కాకినాడ సువిధ (నం. 82724) ప్రత్యేక రైళ్లు జనవరి 11, 12, 13 తేదీల్లో రాత్రి 9.15 గంటలకు బయల్దేరి మరునాడు ఉ.7.45 గంటలకు కాకినాడకు చేరతాయి. మల్కాజిగిరి, కాజీపేట ఖమ్మం, రాయపాడు, ఏలూరు, తాడేపల్లి గూడెం, నిడదవోలు, రాజమండ్రి, ద్వారకాపూడి, సామర్లకోటలో హాల్టింగ్ కల్పించారు.మచిలీపట్నం–సికింద్రాబాద్ రైలు రద్దు: జనవరి 10న మచిలీపట్నం నుంచి బయల్దేరాల్సిన మచిలీపట్నం–సికింద్రాబాద్ (నం.07251) ప్రత్యేక రైలును రద్దు చేశారు. -
11 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు జనవరి 11 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు ఇవ్వనున్నట్లు విద్యా శాఖ పేర్కొంది. ఈ మేరకు తమ అకడమిక్ క్యాలెండర్లో సెలవులను పొందు పరిచింది. మిషనరీ స్కూళ్లకు ఈ నెల 23 నుంచి 29 వరకు క్రిస్మస్ సెలవులు ప్రకటించింది. -
గురుకులాలకు సంక్రాంతి సెలవుల పెంపు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలకు సంక్రాంతి సెలవులను మూడు నుంచి ఆరు రోజులకు పెంచారు. మూడు రోజులే సెలవులు ఇవ్వడంతో పాఠశాలల జేఏసీ నేతలు గురుకుల సొసైటీ కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌తో చర్చలు జరిపారు. ఈ నెల 13 నుంచి 18 వరకు సంక్రాంతి సెలవులు ప్రకటిస్తూ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. తాజాగా ప్రకటించిన సెలవులు 5-9తరగతుల విద్యార్థులకు వ ర్తిస్తాయి. దీనితో పాటు హిస్టరెక్టమీ ఆపరేషన్ చేయించుకునే ఈ పాఠశాలల మహిళా సిబ్బందికి జీవో 52 ప్రకారం 45 రోజుల సెలవు వర్తించేలా కార్యదర్శి ప్రవీణ్ ఉత్తర్వులు జారీచేశారు. జేఏసీ నాయకులు ఎ.వెంకటరెడ్డి, సీహెచ్ బాలరాజు, కె.అర్జున్, రవీంద్ర రెడ్డి, యాదయ్య, పరంధాములు కార్యదర్శిని కలిశారు. -
నిజాయితీని ఎవరూ గుర్తించడం లేదు
జస్టిస్ చంద్రకుమార్ ఆవేదన ఆయనకు హైకోర్టు ఘన వీడ్కోలు సాక్షి, హైదరాబాద్: జనవరి 7న పదవీ విరమణ చేయనున్న ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బెజ్జారం చంద్రకుమార్‌కు హైకోర్టు బుధవారం ఘనంగా వీడ్కోలు పలికింది. గురువారం నుంచి హైకోర్టుకు సంక్రాంతి సెలవులు కావడంతో ఆయనకు బుధవారమే హైకోర్టు వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా నేతృత్వంలో న్యాయమూర్తులందరూ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ కార్యక్రమం లో జస్టిస్ చంద్రకుమార్ కుటుంబ సభ్యులు, ఇరు రాష్ట్రాల అడ్వొకేట్స్ జనరల్ కె.రామకృష్ణారెడ్డి, పి.వేణుగోపాల్, రిజిస్టార్లు, న్యాయవాదులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ చంద్రకుమార్ న్యాయవ్యవస్థకు అందించిన సేవలను ఇరువురు ఏజీలు కొనియాడారు. తరువాత జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ... ఇన్నేళ్ల తన న్యాయ ప్రస్థానంలో తనకు సహకరించిన వారందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలియచేశారు. సమాజంలో రోజు రోజుకు డబ్బుకు ప్రాధాన్యత పెరిగిపోతూ, విలువలు నశించిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నిజాయితీని, కష్టపడే తత్వాన్ని సమాజంలో గుర్తించడం లేదన్నారు. రోజు రోజుకు నిజాయితీ అన్నది అరుదుగా వినిపించే పదంగా మారిపోతుందని చెప్పారు. మానవ హక్కుల పరిరక్షణలో న్యాయవాదులు కీలక పోత్ర పోషించాలని కోరారు. సీనియర్ న్యాయవాదులు కేసులు చేస్తున్న తీరును చూసి జూనియర్ న్యాయవాదులు ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చునని, ఆ దిశగా జూనియర్ న్యాయవాదులు దృష్టి సారించాలని హితవు పలికారు. పదవీ విరమణ తరువాత కూడా తాను ప్రజల్లో న్యాయ అవగాహన కోసం పనిచేయనున్నట్లు ఆయన ప్రకటించారు. తరువాత జస్టిస్ చంద్రకుమార్‌ను హైకోర్టు న్యాయవాదుల సంఘం ఘనంగా సన్మానించింది. -
కార్లన్నీ ఊళ్లకే.... హైదరాబాద్ నుంచి వెళ్లిన వాహనాలు
రెండో శనివారం, ఆదివారం సెలవులతో సంక్రాంతి సెలవులు మొదలైయ్యాయి. ప్రత్యేక రైళ్లు, బస్సులు ఏర్పాటు చేసినా ఏమాత్రం చాలక నగరవాసులు కార్లలో ప్రయాణం సాగిస్తున్నారు. జాతీయ రహదారులు వాహనాలతో కిటకిటలాడాయి. శుక్ర, శనివారాల్లో హైదరాబాద్ నుంచి రహదారుల మీదుగా వెళ్లిన వాహనాల ను సాక్షి పరిశీలించింది. ఆ వివరాలు.. హోటళ్లకు... ముందే పండగ హైదరాబాద్ - విజయవాడ హైవే పక్కన హోటళ్లు, దాబా హోటళ్లకూ గిరాకీ పెరిగింది. సూర్యాపేట సమీపంలోని 7 స్టార్ హోటల్లో వారం రోజుల నుంచి రోజుకి రూ. లక్ష పైనే వ్యాపారం నడిచినట్లు సమాచారం. ఒక్క శనివారం నాడే రూ.4 లక్షల మేర బిజినెస్ నడిచినట్లు హోటల్ యాజమాన్యం తెలిపింది. జీ హోటల్లో కూడా గత వారం రోజుల నుంచి వ్యాపారం బాగా నడుస్తోందని హోటల్ యజమానులు తెలిపారు. మొత్తానికి హైవే పక్క హోటళ్లకు ముందే పండగ వచ్చిన ట్లయింది. -
తిరుమలలో నరకం చూసిన భక్తులు
సాక్షి, తిరుమల: వేంకటేశుని దర్శనం కోసం వచ్చిన భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో టీటీడీ మరోసారి ఘోరంగా విఫలమైంది. అసలే సంక్రాంతి సెలవులు. ఆపై శని, ఆదివారాల్లో ఏకాదశి, ద్వాదశి పర్వదినాలు. ఈ సందర్భంగా భక్తులు పోటెత్తుతారని తెలిసి కూడా టికెట్లు మొదలుకుని బస దాకా ఏ ఏర్పాట్లూ సజావుగా చేయలేక పూర్తిగా చేతులెత్తేసింది. షరామామూలుగా వీఐపీల సేవలో తరించి సామాన్యులను గాలికొదిలింది. దాంతో భక్తులు శుక్రవారం అక్షరాలా నరకం చవిచూశారు. గోవింద నామస్మరణతో మారు మోగాల్సిన తిరుమల కొండలు రోజంతా వారి ఆర్తనాదాలు, నినాదాలు, ధర్నాలతో హోరెత్తిపోయాయి. సీఆర్వో కార్యాలయం వద్ద వందలాది మంది గదుల కోసం ఆందోళన చేశారు. గదులన్నిటినీ వీఐపీలకే కేటాయిస్తున్నారంటూ టీటీడీపై దుమ్మెత్తి పోశారు. వీఐపీ పాసుల పేరుతో దర్శనాల వ్యాపారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. మంత్రి పార్థసారథిని అడ్డుకుని నిరసన తెలిపారు. టీటీడీతో పాటు విజిలెన్స్, పోలీసు తదితర విభాగాలన్నీ విధి నిర్వహణలో విఫలమయ్యాయి. సర్వం అస్తవ్యస్తం: వైకుంఠ ద్వార దర్శనం కోసం వచ్చిన సామాన్య భక్తులకు టీటీడీ నరకం చూపించింది. కాలిబాట భక్తులు టికెట్ల కోసం పడరాని పాట్లు పడ్డారు. ఏకాదశి, ద్వాదశి దర్శనం కోసం అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాల్లో 40 వేల మందికే దివ్యదర్శనం టికెట్లు కేటాయించారు. ఇందులో ఏకాదశికి 20 వేలు, ద్వాదశికి 20 వేలు కేటాయించారు. ఉదయం 10 గంటలకే అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాల్లో టికెట్ల మంజూరు ఆరంభించారు. అంతకుముందు నుంచే రెండుచోట్లా తీవ్రస్థాయిలో తోపులాట జరిగింది. కాలిబాట దారులన్నీ కిక్కిరిసిపోయాయి. ఎలాగైనా టికెట్లు పొందేందుకు భక్తులు ప్రధాన రహదారులను వదిలి అడవుల్లోని ముళ్ల పొదల గుండా క్యూలైన్ల వద్దకు చేరుకున్నారు. కొందరు కాలిబాట పైకప్పుల మీదుగా నడిచివచ్చి, మరికొందరు చెట్లెక్కి లైన్లలోకి చొరబడటంతో తీవ్ర తొక్కిసలాట జరిగింది. భద్రతా సిబ్బంది చేతులెత్తేశారు. పైగా ఏకాదశి టికెట్లు మధ్యాహ్నం 2, ద్వాదశి టికెట్లు 4 గంటల్లోపే అయిపోవడంతో సిబ్బందితో భక్తులు వాగ్వాదానికి దిగారు. క్యూ లైన్లను, గేట్లను విరిచేశారు. ఆ తర్వాత వచ్చిన భక్తులు తిరుమలకు చేరుకుని అడుగడుగునా ఆందోళనలు, బైఠాయింపులతో నిరసన వ్యక్తం చేశారు. 100 ఎంపీలు,ఎమ్మెల్యేలు.. జడ్జిలు వైకుంఠ ఏకాదశి పర్వదినాన ఉత్తర ద్వార దర్శనం కోసం వీఐపీలు వందలాదిగా తిరుమలకు క్యూ కట్టారు. వారికి టీటీడీ ఎర్రతివాచీ పరచింది. బస, దర్శనాల్లో ఎక్కడా లోటు లేకుండా ముందస్తు ఏర్పాట్లు చేసింది. శుక్రవారం రాత్రి 9 గంటల సమయానికే పార్థసారథి, పొన్నాల లక్ష్మయ్య, ఏరాసు ప్రతాపరెడ్డి, డీకే అరుణ సహా పది మంది మంత్రులు, 100 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సుప్రీంకోర్టు, దేశవ్యాప్తంగా పలు హైకోర్టుల న్యాయమూర్తులు, 200 మంది దాకా కేంద్ర, రాష్ట్ర ఉన్నతాధికారులు, సినీ నటులు దర్శనం చేసుకున్నారు. వీఐపీల కోసం టీటీడీ ఏకంగా 10 వేలకు పైగా పాసులను, 6,000 పైచిలుకు గదులను ముందుగానే బ్లాక్ చేసి పెట్టింది.