
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పాఠశాలలకు ఈనెల 12వ తేదీ నుంచి సంక్రాంతి సెలవులు ప్రారంభం కానున్నాయి. ఈనెల 18 వరకు మొత్తం 7 రోజుల పాటు సెలవులుంటాయి. ముందు సంక్రాంతి సెలవులను 11 నుంచి 16 వరకు ఇచ్చేలా అకడమిక్ క్యాలెండర్‌ను ప్రకటించారు. 17న స్కూళ్లు తిరిగి ప్రారంభించేలా సెలవులు నిర్ణయించారు.
అయితే 16న కనుమ ఉండడం, అదే రోజు ఊర్ల నుంచి బయలుదేరి మరునాడే స్కూళ్లకు రావడం అంటే ఇబ్బంది అవుతుందని పలు సంఘాలు, ఉపాధ్యాయులు అభిప్రాయం వ్యక్తం చేశారు. సెలవులను 18వ తేదీవరకు పొడిగించాలని కోరారు. ఆ మేరకు పాఠశాలల పనిదినాలకు ఇబ్బంది కలుగకుండా కొత్తగా సెలవుల షెడ్యూల్‌ను విద్యా శాఖ ప్రకటించింది. ఈ 7 రోజుల సెలవు దినాల్లో ఒక రోజు కాంపన్సేటరీ సెలవు అని విద్యాశాఖ పేర్కొంది.