తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలకు సంక్రాంతి సెలవులను మూడు నుంచి ఆరు రోజులకు పెంచారు.
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలకు సంక్రాంతి సెలవులను మూడు నుంచి ఆరు రోజులకు పెంచారు. మూడు రోజులే సెలవులు ఇవ్వడంతో పాఠశాలల జేఏసీ నేతలు గురుకుల సొసైటీ కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్‌తో చర్చలు జరిపారు.
ఈ నెల 13 నుంచి 18 వరకు సంక్రాంతి సెలవులు ప్రకటిస్తూ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. తాజాగా ప్రకటించిన సెలవులు 5-9తరగతుల విద్యార్థులకు వ ర్తిస్తాయి. దీనితో పాటు హిస్టరెక్టమీ ఆపరేషన్ చేయించుకునే ఈ పాఠశాలల మహిళా సిబ్బందికి జీవో 52 ప్రకారం 45 రోజుల సెలవు వర్తించేలా కార్యదర్శి ప్రవీణ్ ఉత్తర్వులు జారీచేశారు. జేఏసీ నాయకులు ఎ.వెంకటరెడ్డి, సీహెచ్ బాలరాజు, కె.అర్జున్, రవీంద్ర రెడ్డి, యాదయ్య, పరంధాములు కార్యదర్శిని కలిశారు.