![RS praveen kumar Counter To Konda Surekha On Food Poison Allegations](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2024/11/29/praveenkumar.jpg.webp?itok=Lmaa-iHt)
సాక్షి, హైదరాబాద్: గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనల వెనుక బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హస్తం ఉందంటూ మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కొండా సురేఖ వ్యాఖ్యలపై తాజాగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఘాటుగా స్పందించారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్టు చేశారు.
సభ్యత, సంస్కారం, మానవత్వం అంటే ఎంటో కాంగ్రెస్‌కు తెలియదని ధ్వజమెత్తారు. బీర్లు, బిర్యానీలు, రేవ్ పార్టీలు మాత్రమే వారికి తెలుసని మండిపడ్డారు. ఓరుగల్లు నగరంలో ఎంతో మంది విద్యార్థుల జీవితాలను నాశనం చేశారని సురేఖపై విమర్శలు గుప్పించారు. తన గురించి కానీ, పేద గురుకుల విద్యార్థుల గురించి కానీ మాట్లాడే అర్హత మంత్రికి ఏ మాత్రం లేదని హెచ్చరించారు.
కేటీఆర్ గురుకుల బాట అనగానే వెన్నులో చలి పుడుతోందా..? రేవంత్ రెడ్డి అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. దమ్ముంటే మీరు గురుకులాల మీద బహిరంగ చర్చకు రండి. అంతే కానీ మత్తులో ఉన్న ఈ మతి స్థిమితం లేని మంత్రులను, భజంత్రీలను పంపించి నవ్వులపాలు కాకండి అని సీఎం రేవంత్ రెడ్డికి ప్రవీణ్ కుమార్ సూచించారు.
సభ్యత-సంస్కారం- మానవత్వం అంటే ఎంటో తెలియని మీకు,
బీర్లు, బిర్యానీలు, రేవ్ పార్టీలు మాత్రమే తెలిసిన మీకు,
ఓరుగల్లు నగరంలో ఎంతో మంది విద్యార్థుల జీవితాలను నాశనం చేసిన మీకు,
నా గురించి కానీ, పేద గురుకుల విద్యార్థుల గురించి కానీ మాట్లాడే అర్హత ఏ మాత్రం లేదు, మంత్రి గారు.
రేవంత్… pic.twitter.com/fZd4wh9G5s— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) November 29, 2024
Comments
Please login to add a commentAdd a comment