
సాక్షి,హైదరాబాద్:బీఆర్ఎస్ పార్టీ భస్మాసుర హస్తమే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ఆద్మీపార్టీ (ఆప్) పరాజయానికి కారణమని మంతత్రి కొండా సురేఖ అన్నారు. శనివారం(ఫిబ్రవరి8) వెలువడ్డ ఢిల్లీ ఫలితాలపై కొండా సురేఖ స్పందించారు. ‘ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత,కేజ్రివాల్‌ల లిక్కర్ స్కాం ఆమ్ ఆద్మీ పార్టీని ఢిల్లీ ప్రజలకు దూరం చేసింది.
ఢిల్లీ అసెంబ్లీ ఫలితాలనుద్దేశించి రాహుల్‌గాంధీపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు అహంకారపూరితమైనవి. ఈ అహంకారాన్ని అణచివేసేందుకే అసెంబ్లీ,పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు బీఆర్‌ఎస్‌కు బుద్ధి చెప్పారు. అధికార పక్షమైన,ప్రతిపక్షమైనా కాంగ్రెస్ పార్టీది ఎప్పుడూ పోరాట పంథానే.కాంగ్రెస్ పార్టీ పరమోన్నత లక్ష్యం ప్రజా సంక్షేమమే’అని కొండా సురేఖ అన్నారు.
‘ఎక్స్’లో కేటీఆర్ వ్యాఖ్యలకు మంత్రి కోమటిరెడ్డి కౌంటర్..
- తెలంగాణలో ఎలా పుంజుకున్నామో అలాగే దేశవ్యాప్తంగా గెలుస్తాం.
- పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ కోసం మీరు సున్నా సీట్లు తెచ్చుకున్నారు.
- తెలంగాణలో బీజేపీ ఎదుగుదలకు బీఆర్ఎస్సే కారణం
Comments
Please login to add a commentAdd a comment