సాక్షి, హైదరాబాద్: గురుకుల పాఠశాల్లో కుట్రల వెనుక బీఆర్‌ఎస్ నేత ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ హస్తం ఉందని ఆరోపించారు మంత్రి కొండా సురేఖ. ఫుడ్ పాయిజన్ ఘటనలు ఆయన ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయని అన్నారు. గతంలో ఆయన గురుకులాల కార్యదర్శిగా పనిచేశారని, తన అనుచరులనే సిబ్బందిగా నియమించుకున్నారని ఆరోపించారు. అన్ని హాస్టల్స్‌లో ప్రవీణ్ కుమార్ అనుచరులు ఉన్నారని, త్వరలోనే అన్ని విషషయాలు బయటకు వస్తాయని చెప్పారు.
బాలిక మృతి బాధాకరం..
ఈ మేరకు సచివాలయం మీడియా పాయింట్ వద్ద మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. సంక్షేమ హాస్టళ్లను గత ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శలు గుప్పించారు. హాస్టళ్లలోని విద్యార్థులను ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దే బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం వచ్చాక ఒక విద్యార్థిని చనిపోయిందని, అది కూడా బాధకరమని అన్నారు. బాధిత విద్యార్థినికి ప్రత్యేక వైద్య సదుపాయం కల్పించినప్పటికీ దురదృష్టవశాత్తు చనిపోయిందని తెలిపారు. బాలిక మృతి విషయాన్ని బీఆర్‌ఎస్ తమ రాజకీయ లబ్ది కోసం వాడుకోవాలని ప్రయత్నిస్తోందని.. ఆమె మృతిపై రాజకీయాలు చేయడం తగదని సూచించారు.
‘ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ తన కమ్యూనిటీని అడ్డం పెట్టుకొని ఒకప్పుడు మాఫియా నడిపారు. సైకో రావు అండ్ బీఆర్‌ఎస్ గ్రూప్ ప్రభుత్వంపై బట్టకాల్చి వేయాలని చూస్తున్నారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. హాస్టల్స్‌లో ఉండే విద్యార్థులను సొంత పిల్లల లెక్క ప్రభుత్వం చూడాలి. కానీ గత పదేళ్ళలో ఏనాడు అలా జరగలేదు.
అమ్మాయి చనిపోతే బీఆర్‌ఎస్ పార్టీ ఏమైనా ఆదుకున్నారా? గత ప్రభుత్వం హయంలో కస్తూర్బా ఘటన, గురుకులల్లో ఘటనలు, రెండెకెల సంఖ్యలో ఉన్నాయి. గత ప్రభుత్వంలో ఇలాంటి ఘటనలు జరిగితే ఎవ్వరూ పట్టించుకోలేదు. ఫుడ్ పాయిజన్, మూసీ, లగచర్ల ఘటనలో బీఆర్‌ఎస్ ప్రమేయం ఉన్నట్లు అనుమానంగా ఉంది. మల్లన్న సాగర్ ముంపు ప్రజలకు గత ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేదు. బాధితులు ఇప్పటికీ ఇబ్బంది పడుతున్నారు.
అందుకే కేటీఆర్ జైలుకు వెళ్తా అంటున్నారు
మహబూబాబాద్‌లో పసిపిల్లలు ఉన్న వాళ్లను సైతం గత ప్రభుత్వంలో జైల్లో పెట్టారు. పక్కా ప్రణాళికతో ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చేలాగ చేస్తున్నారు. ప్రభుత్వం ఇంటలిజెన్స్ వర్గాల ద్వారా నిఘా పెడుతుంది. అన్ని బయటకు వస్తాయి. కేటీఆర్ తప్పులు చేశారు అని ఆయనకు తెలుసు అందుకే జైలుకు వెళ్తా అని ముందే చెప్తున్నారు. కేటీఆర్ ఏనాడు ప్రజలను కలువలేదు..ఇప్పుడేమో స్వాతంత్ర సమర యోధుడు లెక్క మాట్లాడుతున్నారు.’ అని కొండా సురేఖ మండిపడ్డారు.
కవితకు ప్రాధాన్యత ఇస్తున్న కేసీఆర్..
కవిత జైల్లో ఉన్నప్పుడు బాగానే ఉన్నాడు. ఆమె బయటకు రాగానే మానసికంగా ఇబ్బంది పడుతున్నాడు. కేసీఆర్ కవితకు ప్రాధాన్యత ఇస్తున్నారట. కేటీఆర్‌ను పట్టించుకోవడం లేదట. కేసీఆర్ కుటుంబంలో కవిత - హరీష్ రావు ఒక్కటి అయ్యారని చర్చ జరుగుతుంది. బాల్క సుమన్, గాధరి కిషర్ అప్పట్లో ఆర్ ప్రవీణ్ కుమార్‌పై ఆరోపణలు చేశారు. ఆయన అవినీతి పాల్పడినట్లు అప్పటి బీఆర్‌ఎస్ నాయకులు ఆరోపించారు.
కేటీఆరే కాదు కేసీఆర్ కూడా జైలుకే..
జైలుకు పోవాలని కేటీఆర్‌కు ఉబలాటంగా ఉన్నట్లు ఉంది. సరైన ఆధారాలు దొరికినప్పుడు జైలుకు పంపుతాం. సమయం వచ్చినప్పుడు జైలుకు కచ్చితంగా పోతావు కేటీఆర్. ఆధారాలు రాగానే కవిత జైలుకు వెళ్ళింది. కేటీఆర్ కూడా వెళ్తాడు. కేటీఆర్ మాత్రమే కాదు కవిత - కేసీఆర్ కూడా జైలుకు వెళ్తారు.
Comments
Please login to add a commentAdd a comment