
సాక్షి, అమరావతి: ఏపీలో సంక్రాంతి సెలవులను మరో మూడు రోజులు పొడిగించారు. ముందుగా గురువారం వరకు (జనవరి 18) సంకాంత్రి సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల కోరిక మేరకు మరో మూడు రోజులు సెలవులు పొడిగిస్తున్నట్లు నిర్ణయించినట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్ తెలిపారు. దీంతో జనవరి 22న(సోమవారం) తిరిగి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నట్లు వెల్లడించారు.
చదవండి: అంబేద్కర్ విగ్రహం ఏపీకే కాదు.. దేశానికే తలమానికం: సీఎం జగన్