
సాక్షి, విజయవాడ: ఉద్యోగుల ఉచిత వసతి సదుపాయం మరో 2 నెలలు పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆగస్ట్ 31 వరకు ఉద్యోగుల వసతిని పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ సచివాలయం, అసెంబ్లీ, విభాగాధిపతులు, హైకోర్టు, రాజ్‌భవన్ ఉద్యోగులకు వర్తిస్తుందని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి ఉత్తర్వులు ఇచ్చారు.