కోవిడ్ -19 మహమ్మారిని నుంచి కోలుకునేందుకు ప్రపంచ దేశాలు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా శాశ్వత వలసదారుల వీసాల సంఖ్యను మరింత పెంచింది. గతంలో ఉన్న వీసా నిబంధనల్ని సడలిస్తూ వీలైనంత ఎక్కువ మందిని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తుంది.
ఇందులో భాగంగా ఏడాదికి 35 వేల వీసాలు మంజూరు చేసే ఆస్ట్రేలియా ప్రభుత్వం.. ఇప్పుడు వాటి సంఖ్యను ఏకంగా 1.95 లక్షలకు పెంచింది. తద్వారా ప్రభుత్వానికి మేలు జరిగే అవకాశం ఉందని భావిస్తోంది.
అసలు విషయం ఏంటంటే
ఆస్ట్రేలియాలో నిరుద్యోగిత 50 ఏళ్ల కనిష్ఠానికి చేరుకుని 3.4 శాతంగా ఉంది. అయినప్పటికీ ద్రవ్యోల్బణం కారణంగా వేతనాలు తగ్గాయి. దీంతో ప్రస్తుతం ఉన్న వీసాల్ని సవరించాలని అక్కడి వ్యాపార సంస్థలు ప్రభుత్వాన్ని కోరాయి. వ్యాపారస్థుల విజ్ఞప్తితో పాటు ఇతర అంశాల్ని ఆస్ట్రేలియా ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది. వీసాల పెంపుతో విదేశీయులతో పాటు సంస్థల్ని ఆకర్షించడం వల్ల ఆర్ధిక ఇబ్బందుల నుంచి గట్టెక్కవచ్చని భావించింది. అందుకే ప్రతిఏడు వేలల్లో వీసాలు జారీ చేసే ప్రభుత్వం ఈ ఏడాది ఆ వీసాల సంఖ్యను లక్షకు పైగా పెంచింది.
Comments
Please login to add a commentAdd a comment