జేసీ ట్రావెల్స్‌ ఫోర్జరీ కేసు: కీలక వ్యక్తి అరెస్ట్‌ | RTO Broker Ravikumar Arrested In JC Travels Forgery Case | Sakshi
Sakshi News home page

పోలీసుల అదుపులో ఆర్టీవో బ్రోకర్‌ రవికుమార్‌

Published Sun, Jun 28 2020 9:10 AM | Last Updated on Sun, Jun 28 2020 3:37 PM

RTO Broker Ravikumar Arrested In JC Travels Forgery Case - Sakshi

సాక్షి, అనంతపురం: జేసీ ట్రావెల్స్‌ ఫోర్జరీ కేసులో ఆర్టీవో బ్రోకర్‌ రవికుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జేసీ బ్రదర్స్‌ అక్రమాల్లో రవికుమార్‌ కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. నిషేధిత వాహనాలను ఫోర్జరీ డాక్యుమెంట్స్ తో నాగాలాండ్ లో రిజిస్ట్రేషన్‌ చేయించి, ఆ వాహనాలను బ్రోకర్ రవికుమార్ ద్వారా జేసీ ట్రావెల్స్ విక్రయించింది. మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ లపై రెండు కేసుల్లో పీటీ వారెంట్లు జారీ కాగా, తండ్రీ కొడుకులు కడప సెంట్రల్‌ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. (జేసీ ట్రావెల్స్‌ కేసు.. కీలక విషయాలు)

నిషేధిత వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్లు, మోసపూరిత విక్రయాలపై పోలీసులు విచారణ కొనసాగుతుంది. నకిలీ ఇన్ వాయిస్, ఫేస్ ఇన్సూరెన్స్ సర్టిఫికేట్ల తయారీపై ఆరా తీస్తున్నారు. నకిలీ పోలీసు క్లియరెన్స్ సర్టిఫికేట్ల చెలామణి పై పోలీసులు విచారణ చేపట్టారు. స్క్రాప్ కింద కొనుగోలు చేసిన జేసీ ట్రావెల్స్ .. 154 వాహనాలను ఫోర్జరీ డాక్యుమెంట్లు సమర్పించి బీఎస్-4 గా మార్చింది. వాహనాలన్నీ జేసీ ఉమారెడ్డి, చవ్వాగోపాల్ రెడ్డి పేరిట రిజిస్ట్రేషన్ చేశారు. కాగా, జేసీ ట్రావెల్స్‌ ఫొర్జరీ కేసులో జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్‌రెడ్డికి  జూలై 1 దాకా రిమాండ్‌ పొడిగిస్తూ అనంతపురం కోర్టు ఆదేశించించిన సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement