ఆర్టీవో రూ.12 వేల జరిమానా.. | RTO charges 12 thousands fine to Auto driver | Sakshi
Sakshi News home page

ఆర్టీవో రూ.12 వేల జరిమానా..

Published Tue, Jul 15 2014 4:20 AM | Last Updated on Sat, Sep 2 2017 10:17 AM

RTO charges 12 thousands fine to Auto driver

ఆగిన ఆటోడ్రైవర్ తండ్రి గుండె
 లక్ష్మణచాంద: ఆర్టీవో విధించిన జరిమానా ఓ ఆటోడ్రైవర్ తండ్రిని బలిగొన్నది. వివరాలు.. ఆదిలాబాద్ జిల్లా లక్ష్మణచాంద మండలం మునిపల్లికి చెందిన హైమద్ ఈ నెల 11న నిర్మల్ నుంచి మునిపల్లికి ఆటోలో ప్రయాణికులను తరలి స్తుండగా నిర్మల్‌లో ఆర్టీవో తనిఖీ చేశారు. నిబంధనలు అతిక్రమించావంటూ రూ.12 వేల జరిమానా విధించారు.
 
 ఆటోను సీజ్ చేశారు. తాను అంత జరిమానా కట్టలేనని ఆర్టీవోను వేడు కున్నాడు. అయినా కనికరించకపోవడంతో విషయాన్ని హైమద్  ఫోన్‌లో తండ్రి హైదర్‌కు చెప్పాడు. ఈ మాట విన్న వెంటనే  హైదర్ గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే అతడిని నిర్మల్ ఆస్ప్రతికి తరలించారు. పరిస్థితి విషమించడంతో నిజామాబాద్ ఆస్పత్రికి తీసుకు వెళ్లారు. చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement