వెలుగు చూసిన అవినీతి బాగోతం
వెలుగు చూసిన అవినీతి బాగోతం
Published Fri, May 5 2017 12:18 AM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM
ఏసీబీకి చిక్కిన రవాణా శాఖ అధికారి
రూ. 6 కోట్లకు పైగా ఆస్తులు
తల్లి, భార్య, కుమార్తెల పేరున ఆస్తులు గుర్తించిన ఏసీబీ అధికారులు
రాజమహేంద్రవరం క్రైం : రవాణా శాఖలో డిప్యూటీ కమిషనర్‌గా పని చేస్తున్న చిట్టిబొమ్మల నాగ వెంకట హైమారావు ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. గురువారం రాజమహేంద్రవరంలోని వెంకటేశ్వర నగర్ లో ఉన్న ఆయన ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. గురువారం ఉదయం శ్రీకాకుళం నుంచి వచ్చిన ఏసీబీ డీఎస్పీ కరణం రాజేంద్ర ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. అధికారులు హైమారావు అపార్ట్‌మెంట్‌లో పూర్తిస్థాయిలో సోదాలు నిర్వహించారు. ఈ దాడులలో హైమారావు అవినీతి చిట్టా బయటపడింది. రవాణా శాఖలో అనేక ప్రాంతాలలో పని చేసిన హైమారావు అనేక ప్రాంతాలలో ఆస్తులు కూడగట్టారు.
హైమారావు కూడగట్టిన ఆస్తుల వివరాలు
10 ఫ్లాట్స్, 12 ఎకరాల భూములు, వైజాగ్, విజయవాడ, రాజమహేంద్రవరంలలోను, ఏలూరు, కడప, తదితర ప్రాంతాలలో ఇళ్లు భూములు ఉన్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. రాజమహేంద్రవరంలో రూ 5.53 లక్షల విలువైన ఒక ఇంటి స్థలం, పశ్చిమ గోదావరి జిల్లా కొప్పాకలో 2.5 ఎకరాల భూమి, పశ్చిమ గోదావరి జిల్లా తంగెళ్లమూడిలో రూ.15 లక్షల విలువైన ఇంటి స్థం, అదే గ్రామంలో 5.82 ఎకరాల భూమి, ఉన్నట్టు గుర్తించారు.
భార్య రజనీకుమారి పేరిట ఉన్న ఆస్తులు
రాజమహేంద్రవరంలోని గాంధీ నగర్‌లో రూ .10 లక్షల విలువైన ఇల్లు, పిడింగొయ్యి గ్రామంలో 1002.36 ఎకరాల భూమి, (రూ.29,18,000 లక్షల విలువైన భూమి), తూర్పు గోదావరి జిల్లా కోలమూరు గ్రామంలో రూ.3,93 లక్షల విలువ గల ఇంటి స్థలం, తంగెళ్లమూడి గ్రామంలో 495 స్వేర్ యార్డ్స్ ఇంటి స్థలం (రూ.14,85 లక్షల విలువైన స్థలం), తూర్పుగోదావరి జిల్లా రాజానగరం గ్రామంలో రూ 4.27 లక్షల విలువైన ఇంటి స్థలం, పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలం, కొప్పాక గ్రామంలో 2.02 సెంట్ల భూమి ఉన్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు.
కుమార్తె పేరున ఉన్న ఆస్తులు
విజయవాడలో హౌస్ ప్లాట్, పిడింగొయ్యిలో 450 స్కేర్ యార్డ్స్ స్థలం, తంగెళ్లమూడి గ్రామంలో రూ 12,90 లక్షల విలువైన 430 స్కేర్ యార్డ్స్ స్థలం, అలాగే రూ.4.42 లక్షల విలువైన 491 స్క్వేర్ యార్డ్స్ ఇంటి స్థలం ఇంటి స్థలం ఉన్నట్లు గుర్తించారు.
మరో కుమార్తె పేరిట..
మరోకుమార్తె ఆలైఖ్య పేరున విశాఖపట్నం లో రూ 2.55 లక్షలు విలువైన ఒక ఇంటి స్థలం, పిడింగోయ్యి గ్రామంలో 811.15 స్వెర్‌యార్డ్స్ ఇంటి స్థలం, రూ 23. 63లక్షలు విలువైన ఇంటి స్థలం ఉన్నట్లు గుర్తించారు. అలాగే నల్గొండ జిల్లా బీబీ నగర్ లో రూ 3.20 లక్షలు విలువైన, 267 స్వెర్ యార్డ్స్ ఇంటి స్థలం, తంగెళ్ళమూడి గ్రామంలో 430 స్వేర్‌యార్డ్స్ ఇంటి స్థలం ఉన్నట్లు గుర్తించారు.
తల్లి లక్ష్మి రాజేశ్వరి పేరున ఉన్న ఆస్తులు
హైమరావు తల్లి లక్ష్మి రాజేశ్వరి పేరున రూ 13.లక్షల విలువైన కారు ఉన్నట్టు ఎసీబీ అధికారులు గుర్తించారు. ఈ సోదాలలో హైమారావు ఇంట్లో రూ 2.80 లక్షల నగదు, అరకేజీ బంగారు వస్తువులు, ఐదు కేజీల వెండి వస్తువులు, ఒక లాకర్‌లో రూ 20లక్షల విలువైన బంగారు నగలు, మరో లాకర్‌లో బ్యాంక్ బ్యాలన్స్ ఉన్నట్టు గుర్తించారు. జానీవాకర్ రెడ్ వైన్ 12 బాటిల్స్ స్వాధీనం చేసుకున్నారు.
హైమారావు స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు లోని తంగెళ్లమూడి అద్దెవారి పేట. 1984లో అసిస్టెంట్ మోటార్ వెహిల్ ఆఫీసర్‌గా ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. 1997 మోటారు వెహికిల్ ఇనస్పెక్టర్‌గా పదోన్నతి పై రాజోలులో బాధ్యతలు స్వీకరించారు. 2010లో రీజనల్ ట్రాన్స్‌పోర్టు ఆర్టీఓగా కృష్ణ జిల్లా నందిగామాలో పదోన్నతి పొందారు. రాజమహేంద్రవరం, శ్రీకాకుళం జిల్లాలోను విధులు నిర్వహించారు. రాజమహేంద్రవరంలో ఆర్టీఓ కార్యాలయంలో పని చేసి ప్రస్తుతం శ్రీకాకుళం ఆర్టీఓగా పనిచేసి సిక్‌లీవ్‌పై ఉన్న చిట్టిబొమ్మల నాగవెంకట హైమారావు అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 2003లో విజయవాడలో పని చేస్తున్న సమయంలో ఓసారి ఏసీబీ అధికారులకు చిక్కిన ఆయన తన విధానం మార్చుకోలేదు.
Advertisement
Advertisement