ఇకపై ఈ-టెండర్ విధానంలోనే.. | e-tenders policy on fancy numbers | Sakshi
Sakshi News home page

ఇకపై ఈ-టెండర్ విధానంలోనే..

Published Mon, Jan 18 2016 4:52 AM | Last Updated on Thu, May 24 2018 1:57 PM

ఇకపై ఈ-టెండర్ విధానంలోనే.. - Sakshi

ఇకపై ఈ-టెండర్ విధానంలోనే..

వాహనాల ఫ్యాన్సీ నంబర్ల కేటాయింపు
సాక్షి, హైదరాబాద్: కొత్తగా వాహనాల్ని కొనుక్కుని ఫ్యాన్సీ నంబర్లు పొందాలంటే ఇకపై ఈ-టెండర్లలో పోటీ పడాల్సిందే. ఇందుకు సంబంధించి ఫిబ్రవరి నుంచి రవాణా శాఖ కొత్త విధానానికి శ్రీకారం చుట్టనుంది. ఫ్యాన్సీ నంబర్లకున్న గిరాకీ దృష్ట్యా అధిక ఆదాయం ఆర్జించేందుకు కొత్త రిజిస్ట్రేషన్ చట్టాన్ని అమలు చేయనుంది. దీనిద్వారా బ్రోకర్లకు చెక్ పెట్టవచ్చని భావిస్తోంది. ఆ మేరకు ఫ్యాన్సీ నంబరు కావాలంటే వాహన యజమానులు రిజిస్ట్రేషన్‌కు ముందు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవాలి.

రవాణాశాఖ నిర్దేశించిన ఫ్యాన్సీ నంబర్లు దక్కించుకోవాలంటే కచ్చితంగా ఈ-టెం డర్ విధానంలో పాల్గొనాలి. ఇప్పటివరకు ఆయా నంబర్లకున్న డిమాండ్‌ను బట్టి ధరను నిర్ణయించి ఆయా జిల్లాల్లో రవాణాశాఖ అధికారులు సీల్డ్ టెండర్లు కోరేవారు.
 
వాహన డీలర్ వద్దే రిజిస్ట్రేషన్ ప్రక్రియ..: ఇదిలా ఉండగా వాహనాలు విక్రయించే డీలర్ వద్దే ఇకనుంచీ రిజిస్ట్రేషన్ ప్రక్రియను నిర్వహించాలని రవాణాశాఖ యోచిస్తోంది. ఏదైనా వాహనం కొనుగోలు చేసిన సమయంలో డీలర్ వద్ద ఇప్పటివరకు తాత్కాలిక రిజిస్ట్రేషన్ నంబరును కేటాయిస్తున్నారు. ఇకపై షోరూమ్‌లోనే శాశ్వత రిజిస్ట్రేషన్లకు వీలు కల్పిస్తూ రవాణాశాఖ నిర్ణయం తీసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement