e-tenders
-
ఈ–టెండర్ స్థానంలో ఈ–ఆక్షన్
సాక్షి, అమరావతి: రాబడికి సంబంధించిన కాంట్రాక్టుల కేటాయింపుల కోసం దక్షిణ మధ్య రైల్వే కొత్తగా ఈ–ఆక్షన్ విధానాన్ని ప్రవేశ పెట్టింది. ఎన్నో ఏళ్లుగా అనుసరిస్తున్న ఈ–టెండర్ల విధానం స్థానంలో ప్రవేశపెట్టిన ఈ–ఆక్షన్ విధానానికి నెల రోజుల్లోనే సానుకూల స్పందన లభిస్తోంది. పూర్తి పారదర్శకతతో సత్వరం కాంట్రాక్టులు కేటాయించేందుకు వీలుగా ఈ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ–టెండర్ల విధానంలో ఎవరు ఎంతకు బిడ్ చేస్తున్నారనే విషయం అందరికీ తెలిసే అవకాశం లేదు. దాంతో కొన్ని అవకతవకలకు ఆస్కారం ఉండేది. ఇక బిడ్లు తెరవడం, ఖరారు మొదలైన వాటికి ఎక్కువ సమయం పట్టేది. దీనికి పరిష్కారంగా ఈ–టెండర్ల స్థానంలో ఈ–ఆక్షన్ విధానానికి రైల్వే బోర్డు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వేలో తొలుత సికింద్రాబాద్ డివిజన్ ఈ–ఆక్షన్ విధానాన్ని ప్రవేశ పెట్టింది. ఇటీవల విజయవాడ డివిజన్‌లోనూ ఈ విధానాన్ని అమలులోకి తెచ్చింది. ఇందుకోసం ప్రత్యేక పోర్టల్‌ను అందుబాటులో ఉంచింది. ఎవరైనా పాల్గొనవచ్చు.. అన్ని రకాల రాబడికి సంబంధించిన కాంట్రాక్టులన్నీ ఈ–ఆక్షన్ ద్వారానే కేటాయిస్తారు. వాహనాల పార్కింగ్, పార్సిల్ సర్వీసులు, ఏటీఎంలు, ఏసీ వెయిటింగ్ రూమ్ సర్వీసు, క్లాక్ రూమ్ సర్వీసులు, రుసుము చెల్లింపు విధానంలో టాయిలెట్ల నిర్వహణ మొదలైన కాంట్రాక్టుల కేటాయింపునకు ఈ–ఆక్షన్ నిర్వహిస్తారు. దేశంలో ఏ ప్రాంతంలో ఉన్న వారైనా ఈ–ఆక్షన్‌లో పాల్గొనవచ్చు. అన్ని రకాల చెల్లింపులు ఆన్లైన్ విధానంలోనే నిర్వహిస్తారు. ఈ–ఆక్షన్ ప్రక్రియను గరిష్టంగా 72 గంటల్లోగా పూర్తి చేస్తారు. ఈ–ఆక్షన్ ప్రక్రియకు బిడ్డర్ల నుంచి సానుకూల స్పందన వస్తోంది. నెల రోజుల్లోనే 220 మంది కాంట్రాక్టర్లు ఈ–ఆక్షన్ పోర్టల్‌లో నమోదు చేసుకున్నారు. దక్షిణ మధ్య రైల్వే ఇప్పటి వరకు రూ.77.51 కోట్ల విలువైన 54 కాంట్రాక్టులను ఈ–ఆక్షన్ ద్వారా కేటాయించింది. ఇదిలా ఉండగా రాష్ట్రంలో కాంట్రాక్టుల కేటాయింపులో పారదర్శకత, ప్రజా ధనాన్ని పొదుపు చేయడంలో భాగంగా వైఎస్ జగన్ ప్రభుత్వం ఇదే తరహాలో ఇప్పటికే రివర్స్ టెండరింగ్ విధానాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. తద్వారా ఇప్పటికే వందల కోట్ల రూపాయల మేర ప్రజా ధనం ఆదా అయిన విషయమూ విదితమే. ఒక పనికి సంబంధించి జ్యుడీషియల్ ప్రివ్యూ అనంతరం.. కాంట్రాక్టర్ల మధ్య పోటీ పెంచి, తక్కువ ధరకే నాణ్యతతో పనులు అప్పగిస్తోంది. -
వెంకన్న ఆలయ పనులకు ఈ-టెండర్లు ఖరారు
వాడపల్లి (ఆత్రేయపురం) : కోనసీమ తిరుపతిగా ఖ్యాతికెక్కిన వాడపల్లి శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో రూ.32.20 లక్షలతో చేపట్టనున్న ఫిల్లింగ్, సీసీ ఫ్లోరింగ్, పీఈబీ నిర్మాణం, గాల్వినైజ్డ్ మెస్ అభివృద్ధి పనులకు ఈ-టెండర్లు ఖారారైనట్లు ఈఓ బీహెచ్ఈ రమణమూర్తి మంగళవారం తెలిపారు. సుమారు 15 శాతం తక్కువకు పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు టెండర్లు వేశారన్నారు. అన్నదాన సత్రానికి, ప్రహరీకి రూ.10 లక్షలు కేటాయించగా 15.75 శాతం తక్కువకు, పీఈబీ నిర్మాణానికి రూ.10 లక్షలు మంజూరుకాగా 15 శాతం తక్కువకు, ఫ్లోరింగ్ రూ.4.70 లక్షలు కేటాయించగా 10.01 శాతం తక్కువకు, గాల్వినైజెడ్ మెస్ ఏర్పాటుకు రూ.7.5 లక్షలు కేటాయించగా 14.1 శాతం తక్కువకు టెండర్లు ఖారారు చేశారు. ఫిబ్రవరి 16న అధికారులు బాక్సు టెండర్లు ఆహ్వానించడంతో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. రూ.10 లక్షలకు మించిన పనులకు ఈ-టెండర్లు పిలవాల్సి ఉండగా బాక్సు టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లతో కుమ్మక్కై కేవలం రూ.32ల తక్కువకు టెండర్లను అధికార్లు ఖరారు చేసినట్లు ఆలయ ఈఓ రమణ మూర్తి తెలిపారు. దీనిపై ‘అవకతవకలపై టెండరింగ్’ అంటూ ఫిబ్రవరం 17న సాక్షిలో కథనం రావడంతో దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు స్పందించి ఖారారైన బాక్సు టెండర్లను రద్దు చేశారు. తిరిగి ఈ-టెండర్లు ఆహ్వానించడంతో సుమారు రూ.5.50 లక్షల తక్కువకు పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకు వచ్చారు. అయితే గతంలో రూ.32.20 లక్షల పనులను బాక్సు టెండర్లలో రూ.32కే దక్కించుకున్న కాంట్రాక్టర్ మరికొందరితోపాటు ఈ-టెండర్లో రూ.5.50 లక్షల తక్కువకు పనులు చేపట్టేందుకు కోడ్ చేయడంతో తిరిగి అదే కాంట్రాక్టర్‌కు పనులు దక్కాయి. బాక్సు టెండర్ల ద్వారా పచ్చ చొక్కా కాంట్రాక్టరుకు లబ్ధి చేకూర్చుదామని తీవ్రంగా ప్రయత్నించిన ఆలయ అధికారులకు, ఆ పార్టీ నియోజకవర్గ నేతలకు చివరకు ఆశా భంగమే కలిగింది. -
ఇకపై ఈ-టెండర్ విధానంలోనే..
వాహనాల ఫ్యాన్సీ నంబర్ల కేటాయింపు సాక్షి, హైదరాబాద్: కొత్తగా వాహనాల్ని కొనుక్కుని ఫ్యాన్సీ నంబర్లు పొందాలంటే ఇకపై ఈ-టెండర్లలో పోటీ పడాల్సిందే. ఇందుకు సంబంధించి ఫిబ్రవరి నుంచి రవాణా శాఖ కొత్త విధానానికి శ్రీకారం చుట్టనుంది. ఫ్యాన్సీ నంబర్లకున్న గిరాకీ దృష్ట్యా అధిక ఆదాయం ఆర్జించేందుకు కొత్త రిజిస్ట్రేషన్ చట్టాన్ని అమలు చేయనుంది. దీనిద్వారా బ్రోకర్లకు చెక్ పెట్టవచ్చని భావిస్తోంది. ఆ మేరకు ఫ్యాన్సీ నంబరు కావాలంటే వాహన యజమానులు రిజిస్ట్రేషన్‌కు ముందు ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. రవాణాశాఖ నిర్దేశించిన ఫ్యాన్సీ నంబర్లు దక్కించుకోవాలంటే కచ్చితంగా ఈ-టెం డర్ విధానంలో పాల్గొనాలి. ఇప్పటివరకు ఆయా నంబర్లకున్న డిమాండ్‌ను బట్టి ధరను నిర్ణయించి ఆయా జిల్లాల్లో రవాణాశాఖ అధికారులు సీల్డ్ టెండర్లు కోరేవారు. వాహన డీలర్ వద్దే రిజిస్ట్రేషన్ ప్రక్రియ..: ఇదిలా ఉండగా వాహనాలు విక్రయించే డీలర్ వద్దే ఇకనుంచీ రిజిస్ట్రేషన్ ప్రక్రియను నిర్వహించాలని రవాణాశాఖ యోచిస్తోంది. ఏదైనా వాహనం కొనుగోలు చేసిన సమయంలో డీలర్ వద్ద ఇప్పటివరకు తాత్కాలిక రిజిస్ట్రేషన్ నంబరును కేటాయిస్తున్నారు. ఇకపై షోరూమ్‌లోనే శాశ్వత రిజిస్ట్రేషన్లకు వీలు కల్పిస్తూ రవాణాశాఖ నిర్ణయం తీసుకుంది. -
ముందుకు సాగని ‘మిషన్ కాకతీయ’
* 89 చెరువులకు రూ.24.19 కోట్లు విడుదల * ‘పునరుద్ధరణ’కు మూడుసార్లు నోటిఫికేషన్ * అయినా ముందుకు రాని కాంట్రాక్టర్లు * వెంటాడుతున్న పర్సెంటేజీల భయం * ఆయా పనులపై ప్రజాప్రతినిధుల కన్ను సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ‘మిషన్ కాకతీయ’కు బాలారిష్టాలు తప్పడం లేదు. మంత్రి మాటలు, వాస్తవ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. చెరువుల పునరుద్ధరణ పనులపై కొందరు ప్రజాప్రతినిధులు కన్నేయడంతో, కాంట్రాక్టర్లను ‘పర్సెంటేజీ’లు భయపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో నిధులు విడుదలైనాటెండర్లు జరగడం లేదు. ఈ కార్యక్రమం కింద జిల్లాలో మొత్తం 3,251 చెరువులు, కుంటలలో మొదటి విడతగా చేపట్టే 701 పనుల అంచనాల ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. 356 చెరువుల పునరుద్ధరణకు సంబంధించిన అంచనాలను స్వీకరించిన ప్రభుత్వం 89 చెరువుల పనులను తక్షణమే మొదలు పెట్టాలని రూ.24.19 కోట్లు విడుదల చేసింది. నిజామాబాద్, బోధన్, కామారెడ్డి డివిజన్ల పరిధిలోని ఈ పనులను చేపట్టేందుకు నీటిపారుదలశాఖ అధికారులు ఇప్పటికీ మూడు పర్యాయాలు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ-టెండర్ల ద్వారా పనులను దక్కించుకునేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. చెరువు పనులు లాభదాయకంగా ఉన్నా ఎందుకు ముందుకు రావడం లేదని ఆరా తీస్తే, అధికారులు సైతం పెదవి విప్పడం లేదు. కొం దరు ప్రజాప్రతినిధులు పనులు మొదలెట్టే ముందు ‘మమ్మ ల్ని కలవాల్సిందే’ అంటూ ఆర్డర్లు వేయడంతోనే చెరువుల పనులపై మొగ్గు చూపడం లేదంటూ కాంట్రాక్టర్లు చర్చించుకుంటుండటం ఆసక్తికరంగా మారింది. ఇదీ పరిస్థితి మొదటి విడతగా 701 చెరువుల పనులను ఈ ఏడాదిలో పూర్తి చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. నిజామాబాద్, బోధన్, కామారెడ్డి డివిజన్లలో సర్వే చేసి అన్ని ప్రాంతాలకు సమాన ప్రాతినిధ్యం కలిగేలా అంచనాలు తయారు చేయాలని డిసెంబర్ ఐదున మంత్రి హరీష్‌రావు నిర్వహించిన సమీక్షా సమావేశంలో అధికారులకు సూచించారు. అంతకు ముందు నుంచే నీటి పారుదల శాఖ 456 చెరువులు, కుంటలను సర్వే చేసి 356 చెరువులు, కుంటలపై రూ.131.19 కోట్ల అంచనా వ్యయం (ఎస్టిమేట్ కాస్ట్)కు సం బంధించిన రికార్డులు ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాల మేరకు ప్రతి జిల్లాలో 20 శాతం చెరువులు, కుంటల పునరుద్ధరణ పనులను 2015 మార్చిలోగా పూర్తి చేయాల్సి ఉంది. అయితే క్షేత్రస్థాయిలో వివిధ కారణాల చేత చెరువుల పనుల ఎస్టిమేట్లు ఆశించిన రీతిలో ముందుకు సాగకపోగా, 89 చెరువుల కోసం ప్రభుత్వం విడుదల చేసిన రూ.24.19 కోట్ల పనుల ఖరారుకు కొం దరు ప్రజాప్రతినిధులు కాంట్రాక్టర్లకు మోకాలడ్డుతుండటం తో ఆ ప్రక్రియ ముందుకు సాగడం లేదన్న చర్చ ఉంది. రూ. 24.19 కోట్ల పనులకు కోసం మూడు పర్యాయాలు నోటిఫికేషన్ విడుదల చేసిన ఈ-టెండర్లకు కాంట్రాక్టర్లు ముందుకు రాలేదంటే, చెరువుల పునరుద్ధరణ పనులపై ప్రజాప్రతి నిధుల పాత్ర ఏ మేరకు ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదే పరిస్థితి కొనసాగితే నిధులు విడుదలైన చెరువుల పునరు ద్ధర ణ ఎలా పూర్తవుతుంది? 345 చెరువుల ఎస్టిమేట్లు ఎప్పుడు పూర్తి చేస్తారు? ఎస్టిమేట్లు సమర్పించి సిద్ధంగా ఉన్న మిగిలిన 256 చెరువులకు నిధులు ఎప్పుడిస్తారు? టెండర్లు ఎలా చేపడుతారు? మార్చిలోగా మొదటి విడత చెరువుల పునరుద్ధరణ ఎలా సాధ్యం? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. -
మిషన్ కాకతీయ రెడీ
⇒ చెరువుల పునరుద్ధరణకు కసరత్తు ⇒ నేడు జెడ్పీటీసీ, ఎంపీపీలకు అవగాహన సదస్సు ⇒ హాజరుకానున్న రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు 556 మైనర్ ఇరిగేషన్ చెరువులు 4193 చిన్ననీటి చెరువులు (పంచాయతీరాజ్) 13 అటవీశాఖ పరిధిలో చెరువులు 4762 మొత్తం చెరువుల సంఖ్య మొదటిదశలో చెరువుల మరమ్మతులు ఇలా... ⇒ 952 పునరుద్ధరణ జరిగే చెరువులు ⇒ 185 ఇప్పటి వరకు సర్వే చేసిన చెరువులు ⇒ 102 ప్రభుత్వానికి అంచనావ్యయం సమర్పించిన చెరువుల సంఖ్య ⇒ రూ.83కోట్లు ఖర్చు అంచనా,మంజూరు ఈ-టెండరు ద్వారా పనుల కేటాయింపు నల్లగొండ: చెరువులకు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ప్రభుత్వ కార్యాచరణ సిద్ధమవుతోంది. కబ్జాకోరల్లో చిక్కుకుపోయి, ఆనవాళ్లు కోల్పోయిన ఆనాటి చెరువులకు మళ్లీ మంచిరోజులు రాబోతున్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న కార్యక్రమాల్లో ‘మిషన్ కాకతీయ’ ప్రధానమైనది. ఈ పథకం అమలు తీరుతెన్నులు సమీక్షించేందుకు రాష్ట్ర భారీ నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు జిల్లాల వారీగా అధికారులు, ప్రజాప్రతినిధులతో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి ఆదివారం జిల్లాకు వస్తున్నారు. కలెక్టర్ కార్యాలయంలో మధ్యాహ్నం రెండుగంటలకు జెడ్పీ ప్రత్యేక సర్వసభ్యసమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలకు కాకతీయమిషన్ ముఖ్య ఉద్దేశాలను మంత్రి వివరిస్తారు. ఈ సమావేశానికి జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు. కాకతీయ మిషన్ తీరు జిల్లావ్యాప్తంగా మొత్తం 4,762 చెరువులు, నీటి కుంటలు ఉన్నాయి. దీంట్లో 556 చెరువుల పరిధిలో వంద ఎకరాలపైబడి ఆయకట్టు సాగవుతోంది. మరో 4,193 చెరువుల కింద వందఎకరాల్లోపు ఆయకట్టు ఉంది. అటవీశాఖ పరిధిలో 13 చెరువులు ఉన్నాయి. దీంట్లో చాలా చోట్ల చెరువులు ఆక్రమణకు గురిగాక, చిన్నచిన్న నీటి కుంటలను పూడ్చేసి రియల్ వ్యాపారులు వెంచర్లు చేసి అమ్మేశారు. కోదాడ, నల్లగొండ, నకిరేకల్, సూర్యాపేట, మిర్యాలగూడ, భువనగిరి ప్రాంతాల్లో చెరువులు కబ్జాకు గురైనట్లు జిల్లా పంచాయతీ శాఖ గతంలో చేపట్టిన విచారణలో తేలింది. ప్రస్తుతం సాగునీటి పారుదలశాఖ అధికారులు జిల్లావ్యాప్తంగా చెరువుల సర్వే నిర్వహిస్తున్నారు. ఈ సర్వే పూర్తయిన తర్వాతగానీ ఎన్ని చెరువులు ఆక్రమణకు గురయ్యాయనేది తేలుతుంది. అయితే ప్రభుత్వం ముందుగా 20 శాతం చెరువులు అంటే.. 952 చెరువులను 2014-15 ఆర్థిక సంవత్సరానికిగాను మిషన్ కాకతీయ కింద పునరుద్ధరించేందుకు కసరత్తు చేస్తోంది. ఇప్పటి వరకు 185 చెరువులసర్వే పూర్తయ్యింది. దీంట్లో 102 చెరువులకు ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి సమర్పించారు. ఈ పనుల అంచనా విలువ సుమారు రూ.83 కోట్లు. ఈ పనులను ఈ-టెండర్ ద్వారానే చేపడతారు. టెండర్ల ప్రక్రియ పూర్తయిన 15రోజుల్లోగా అగ్రిమెంట్, ఇతర వ్యవహారాలన్నీ పూర్తిచేసి పనులు ప్రారంభించాలి. ఈ నెలాఖరునాటికి సర్వే పూర్తిచేసి ప్రతిపాదనలు ప్రభుత్వానికి సమర్పిస్తారు. మొత్తం మీద జనవరి మొదటివారంలో మిషన్ కాకతీయ ఆచరణలోకి వస్తుంది. నీటి నిల్వ ఉన్న చెరువుల పనులు ఆలస్యం... నాగార్జునసాగర్, మూసీ ఆయకట్టు ప్రాంతాలైన హుజూర్నగర్, భువనగిరి, రామన్నపేట, తదితర ప్రాంతాల్లో సుమారు 65 చెర్వుల్లో నీటినిల్వలు వచ్చే ఏడాది మార్చి వరకు ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. వరికోతలు పూర్తయిన తర్వాత ఆ చెరువుల పరిధిలో పనులు ప్రారంభిస్తారు. ఇవీ చేపట్టే పనులు అలుగులు రిపేరు, చిన్నచిన్న నీటి కుంటల నుంచి పంట పొలాలకు వెళ్లే కాల్వల మరమ్మతులు, స్లూయీస్ మరమ్మతులు, చెరువుల పూడికతీత, సర్కారు చెట్లు, గుర్రపు డెక్క తొ లగింపు, ఫీడర్‌ఛానల్ మరమ్మతులు, చెరువుల పూడకతీతలో భాగంగా తీసిన మట్టి తో చెరువుల కట్టలు నిర్మిస్తారు. -
ఏపిలో నేటి నుంచి ఎర్రచందనం వేలం
-
ఆదోని మార్కెట్లో నిఘానేత్రాలు
రూ.50 లక్షల వ్యయంతో ఏర్పాటు అక్రమాల అడ్డుకట్టే లక్ష్యం ఆదోని: సాంకేతిక పరిజ్ఞానంను వినియోగించుకోవడంలో ఆదోని యార్డు ముందుంది. వ్యవసాయ దిగుబడుల క్రయ, విక్రయాల ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఈ-టెండర్లు ప్రారంభించిన అధికారులు అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు యార్డులో 60 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు రూపొందించారు. రాష్ట్ర మార్కెటింగ్ శాఖ కమిషనరు వెంకటరామిరెడ్డి సీసీ కెమెరాల ఏర్పాటుకు ఓకే చెప్పారు. ఏటా దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు విలువైన వ్యవసాయ దిగుబడులను రైతులు యార్డులో అమ్ముకుంటున్నారు. అయితే కొంత మంది వ్యాపారులు ఏటా రూ.కోట్ల రూపాయలు విలువైన దిగుబడులను జీరోలో కొనుగోలు చేసి ఇతర రాష్ట్రాలకు తరలించుకుని సొమ్ముచేసుకుంటున్నారు. దీనివల్ల యార్డు, వాణిజ్య పన్నుల శాఖల ఖజానాకు రూ.కోట్లు గండి పడుతోంది. కొంతమంది యార్డు సిబ్బంది చేతులు కలుపడంతో అక్రమ వ్యాపారుల ఆగడాలు యథేచ్ఛగా సాగిపోతున్నాయి. తమకు సహకరిస్తున్న అధికారులకు, సిబ్బందికి అక్రమ వ్యాపారులు వేరుశనగ బస్తాకు రూ.8, పత్తి డోక్రాకు రూ.వంద చొప్పున ఇచ్చుకుంటున్నారనే ఆరోపణలున్నారు. జీరోలో కొనుగోలు చేస్తున్న వ్యాపారులు నేరుగా రైతులతో సంప్రదించి ధర మాట్లాడుకుంటున్నారు. దీంతో పలు సందర్బాలలో ధర రూపంలో రైతులు కూడా నష్టపోతున్నారు. యార్డులో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే ఇటు అక్రమ వ్యాపారులు, అందుకు సహకరించే అధికారులు, సిబ్బంది కదలికలను గుర్తించవచ్చని భావించారు. రూ.50 లక్షల వ్యయంతో.. యార్డులో ఐదు ప్రధాన గేట్లు ఉన్నాయి. టీఎంసీ యార్డుతో కలుపుకుని మొత్తం 7 ప్లాట్ ఫారంలు ఉన్నాయి. ప్రధాన గేట్లు, ప్లాట్ ఫారంలు, టెండర్హాలు, ప్రధాన కార్యాలయంలో మొత్తం 60 చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే ప్రతిపాదన ఉందని యార్డు కార్యదర్శి రామారావు, డీఈఈ సుబ్బారెడ్డి తెలిపారు. ఇందుకు దాదాపు రూ.50లక్షల వరకు వ్యయం అవుతోందని అంచనా వేశామని అన్నారు. ఇప్పటికే ముంబరుుకి చెందిన ప్రధాన సంస్థ ప్రతినిధులు సీసీ కెమెరాలు ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలో పరిశీలించి నివేదిక అందించారని పేర్కొన్నారు. ఈ-టెండర్లు ప్రారంభోత్సవంకు వచ్చిన మార్కెటింగ్ శాఖ కమిషనరు వెంకటరామిరెడ్డి సీసీ కెమెరాల ఏర్పాటుపై యార్డు అధికారులతో చర్చించారు. సొంతంగా కొనుగోలు చేయడం కన్నా అద్దెకు ఏదైనా ప్రముఖ సంస్థకు ఇవ్వడం బాగుంటుందేమో పరిశీలించాలని తమకు సూచించినట్లు డీఈఈ సుబ్బారెడ్డి తెలిపారు. సొంతంగా కొనుగోలుచేయూలా లేక అద్దెకు ఇవ్వాలా అనేది ఉన్నత స్థాయిలో నిర్ణయం తీసుకుని ఆదేశాలు జారీ చేస్తారని, ఆదేశాలు రాగానే కెమెరాల ఏర్పాటు చేస్తామని యార్డు కార్యదర్శి, డీఈఈ వివరించారు.