
ఫ్యాన్సీ నంబర్లకు బీఎస్‌ఎన్‌ఎల్ ఈ-వేలం
హైదరాబాద్: మరోసారి ఫ్యాన్సీ మొబైల్ నంబర్ల వేలానికి బీఎస్‌ఎన్‌ఎల్ సిద్ధమైంది. ఆకర్షణీయమైన ఫోన్ నంబర్లను వినియోగదారులు దక్కించుకోడానికి వీలుగా బుధవారం(29వ తేదీ) నుంచి వచ్చే నెల 8వ తేదీ వరకు 14వ దశ ఈ-వేలం నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. వెబ్ ఆధారిత ఈ-వేలం ద్వారా జీఎస్‌ఎం ప్రీమియం మొబైల్ నంబర్లను జారీ చేస్తున్నట్లు పేర్కొంది. అలాగే ప్రిపెయిడ్ కస్టమర్లలో ‘పర్ మినిట్ ప్లాన్’లో ఉన్న వారి కోసం ‘బ్యాలెన్స్ బేస్డ్ టారిఫ్ ఆఫర్’ను కూడా బీఎస్‌ఎన్‌ఎల్ బుధవారం ప్రకటించింది.