విజయవాడ నగరంలోని కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి నుంచి 580 పైరసీ డీవీడీలు స్వాధీనం చేసుకున్నారు.
విజయవాడ (కృష్ణా జిల్లా) : విజయవాడ నగరంలోని కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి నుంచి 580 పైరసీ డీవీడీలు స్వాధీనం చేసుకున్నారు. బాహుబలి, శ్రీమంతుడు, ధనలక్ష్మి తలుపుతడితే, సినిమా చూపిస్త మావ లాంటి తెలుగు సినిమాలకు సంబంధించిన డీవీడీలు సదరు వ్యక్తి వద్ద ఉన్నాయి.
విజయవాడలోని కుమ్మరవీధికి చెందిన సురేష్ బాబు చెన్నై నుంచి పైరసీ డీవీడీలు తీసుకొస్తుండగా కొత్తపేట వద్ద పోలీసులకు పట్టుబడ్డాడు. సురేష్‌పై కేసు నమోదు చేసి స్టేషన్‌కు తరలించారు.