బుఖారి హత్యకేసులో ఒకరి అరెస్ట్‌ | One arrested in Bakhari murder case | Sakshi
Sakshi News home page

బుఖారి హత్యకేసులో ఒకరి అరెస్ట్‌

Published Sat, Jun 16 2018 4:24 AM | Last Updated on Sat, Jun 16 2018 4:24 AM

One arrested in Bakhari murder case - Sakshi

జుబైర్‌ ఖాద్రీ,షుజాత్‌ బుఖారి

శ్రీనగర్‌: రైజింగ్‌ కశ్మీర్‌ దినపత్రిక ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌ షుజాత్‌ బుఖారి(53) హత్యకేసులో ఓ అనుమానితుడ్ని అరెస్ట్‌ చేసినట్లు కశ్మీర్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌(ఐజీ) స్వయం ప్రకాశ్‌ పానీ మీడియాకు తెలిపారు. నిందితుడ్ని జుబైర్‌ ఖాద్రీగా గుర్తించినట్లు వెల్లడించారు. ఉగ్రవాదుల కాల్పుల అనంతరం కారులో ప్రాణాలు కోల్పోయిన పోలీస్‌ అధికారి నుంచి జుబైర్‌ తుపాకీని ఎత్తుకెళ్లాడని పేర్కొన్నారు.

ఈ వ్యవహారం మొత్తం సీసీటీవీల్లో రికార్డయిందన్నారు. జుబైర్‌ నుంచి ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు.   ఈ కేసును త్వరితగతిన విచారించేందుకు సెంట్రల్‌ కశ్మీర్‌ డీఐజీ వీకే విర్దీ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్‌) ఏర్పాటు చేసినట్లు పానీ పేర్కొన్నారు. మరోవైపు బారాముల్లా జిల్లాలోని స్వగ్రామంలో బుఖారి అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆయన్ను కడసారి చూసేందుకు స్థానికులు, ప్రజలు భారీఎత్తున తరలివచ్చారు. అధికార పీడీపీ, బీజేపీ మంత్రులు, ప్రతిపక్ష నేత ఒమర్‌ అబ్దుల్లా బుఖారి అంత్యక్రియలకు హాజరయ్యారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement