బాలికకు ప్రేమ పేరుతో వేధింపులు | Man arrested for harassing teenage girl | Sakshi
Sakshi News home page

బాలికకు ప్రేమ పేరుతో వేధింపులు

Published Tue, Mar 8 2016 7:59 PM | Last Updated on Sun, Sep 3 2017 7:16 PM

Man arrested for harassing teenage girl

మిర్యాలగూడ రూరల్ (నల్లగొండ) : పదో తరగతి చదువుతున్న బాలికను ప్రేమ పేరుతో వేధిస్తున్న యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం పరిధిలో జరిగిన ఈ ఘటనలో పోలీసుల కథనం మేరకు... ఊట్లపల్లి ఎస్సీ కాలనీకి చెందిన బాలిక స్థానిక ప్రభుత్వ హైస్కూల్లో పదో తరగతి చదువుతోంది. అదే కాలనీకి చెందిన జగడాల హరికుమార్ ప్రేమ పేరుతో నెల రోజులుగా బాలిక వెంటపడి వేధిస్తున్నాడు. దీనిపై బాలిక మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేసి నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement