మిర్యాలగూడ అర్బన్ (నల్లగొండ) : మిర్యాలగూడలో భర్త వేధింపులు తాళలేక ఓ మహిళ ఆత్మహత్యకు యత్నించింది. స్థానికంగా ట్రాఫిక్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న మురళీచారి భార్య శ్రీదేవి శుక్రవారం సాయంత్రం 5 గంటల సమయంలో పురుగు మందు తాగింది. ఆమె పరిస్థితి విషమంగా మారటంతో హైదరాబాద్‌లోని సన్‌రైజ్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. భర్త వేధింపులతోనే తమ కూతురు ఆత్మహత్యకు యత్నించిందని తల్లిదండ్రులు స్థానిక టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.