
సాక్షి, హైదరాబాద్: రానున్న రెండేళ్ల కాలానికి (2023–25)గాను రాష్ట్రంలోని 2,620 ఏ4 దుకాణాల (వైన్‌షాపులు) ద్వారా మద్యం విక్రయించడం కోసం లైసెన్సులు మంజూరు చేసే ప్రక్రియను ఎక్సైజ్ శాఖ ప్రారంభించింది. ఈ మేరకు ఈనెల 4న నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నోటిఫికేషన్ ప్రకారం నిర్వ హించాల్సిన ప్రక్రియపై మంగళవారం అన్ని జిల్లాల ఎక్సైజ్ అధికారులతో రాష్ట్ర ఎక్సైజ్ డైరెక్టర్ ఫారూఖీ, ఇతర ఉన్నతాధికారులు సమావేశం నిర్వహించి మార్గదర్శనం చేశారు.
విశ్వసనీయ సమాచారం ప్రకారం..ఈనెల 4న నోటిఫికేషన్ రానుండగా, అదేరోజు నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఈనెల 20 లేదా 21న లాటరీలు నిర్వహించి షాపులు కేటాయించనున్నట్లు సమాచారం. అయితే, గత రెండేళ్ల పాలసీనే ఈసారి కూడా అమలు చేస్తారని, దరఖాస్తు ఫీజు, దుకాణాల సంఖ్యలో ఎలాంటి మార్పు లేదని, ఎస్సీ, ఎస్టీ, గౌడ సామాజిక వర్గాలకు రిజర్వేషన్లు కూడా యథాతథంగా అమలవుతాయని తెలుస్తోంది.
చదవండి: హైదరాబాద్‌లో పార్కింగ్ పరేషాన్! కేటీఆర్‌కు ట్వీట్.. ఇలా చేస్తే బెటర్!
Comments
Please login to add a commentAdd a comment