wine shops licence
-
Telangana: ఈనెల 4న మద్యం లాటరీలకు నోటిఫికేషన్!
సాక్షి, హైదరాబాద్: రానున్న రెండేళ్ల కాలానికి (2023–25)గాను రాష్ట్రంలోని 2,620 ఏ4 దుకాణాల (వైన్‌షాపులు) ద్వారా మద్యం విక్రయించడం కోసం లైసెన్సులు మంజూరు చేసే ప్రక్రియను ఎక్సైజ్ శాఖ ప్రారంభించింది. ఈ మేరకు ఈనెల 4న నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నోటిఫికేషన్ ప్రకారం నిర్వ హించాల్సిన ప్రక్రియపై మంగళవారం అన్ని జిల్లాల ఎక్సైజ్ అధికారులతో రాష్ట్ర ఎక్సైజ్ డైరెక్టర్ ఫారూఖీ, ఇతర ఉన్నతాధికారులు సమావేశం నిర్వహించి మార్గదర్శనం చేశారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం..ఈనెల 4న నోటిఫికేషన్ రానుండగా, అదేరోజు నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఈనెల 20 లేదా 21న లాటరీలు నిర్వహించి షాపులు కేటాయించనున్నట్లు సమాచారం. అయితే, గత రెండేళ్ల పాలసీనే ఈసారి కూడా అమలు చేస్తారని, దరఖాస్తు ఫీజు, దుకాణాల సంఖ్యలో ఎలాంటి మార్పు లేదని, ఎస్సీ, ఎస్టీ, గౌడ సామాజిక వర్గాలకు రిజర్వేషన్లు కూడా యథాతథంగా అమలవుతాయని తెలుస్తోంది. చదవండి: హైదరాబాద్‌లో పార్కింగ్ పరేషాన్! కేటీఆర్‌కు ట్వీట్.. ఇలా చేస్తే బెటర్! -
మేమూ అమ్ముతాం!
సాక్షి, హైదరాబాద్: కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలో ఓ వ్యక్తికి ఇద్దరు భార్యలు. ఇద్దరూ చెరో మద్యం దుకాణానికి దరఖాస్తు చేసుకున్నారు. లక్కీ డ్రాలో ఇద్దరినీ అదృష్టం వరించింది. చెరో దుకాణం వచ్చింది. మహబూబ్‌నగర్ పట్టణంలో ఓ మద్యం దుకాణానికి 12 మంది మహిళలు పోటీపడ్డారు. చివరికి డ్రాలో జ్యోతి అనే యువతికి దుకాణం దక్కింది. .. ఇలా ఒక్కరిద్దరు కాదు.. గతంలో ఎన్నడూ లేనంతగా రాష్ట్రంలో ఈసారి దాదాపు 10 వేల మంది మహిళలు మద్యం దుకాణాల లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోగా.. వారిలో 284 మందికి లైసెన్స్‌లు దక్కాయి. శుక్రవారం సెంటిమెంట్, అదే రోజున లక్కీ డ్రా తీస్తుండటంతో పలువురు వ్యాపారులు తమ భార్య, కూతుళ్ల పేరిట దరఖాస్తులు చేసుకున్నారు. దాదాపు 10 శాతం షాపులను మహిళలే దక్కించుకోవడం గమనార్హం. రాష్ట్రవ్యాప్తంగా 2,216 వైన్‌షాపుల ఏర్పాటు కోసం శుక్రవారం ఎక్సైజ్ శాఖ నిర్వహించిన లాటరీ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. జిల్లాల వారీగా చూస్తే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 135 మంది మహిళలకు లైసెన్సులు దక్కాయి. 66 దుకాణాలు పెండింగ్ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న దాదాపు 66 మద్యం దుకాణాలకు ఇంకా లాటరీ నిర్వహించలేదు. ఇక్కడ ప్రజాభిప్రాయం సేకరించిన తర్వాతే దుకాణాల ఏర్పాటు, నిర్వహణ చేయాలనే నిబంధన ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 40, మహబూబాబాద్‌లో 9, భూపాలపల్లి జిల్లాలో 17 దుకాణాలు ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నాయి. గిరిజనుల అభిప్రాయాలు సేకరించిన తర్వాతే అక్కడ దుకాణాలు ఏర్పాటు చేస్తామని భూపాలపల్లి ఎక్సైజ్ సూపరింటెండెంట్ శశిధర్‌రెడ్డి తెలిపారు. వీటితో పాటు హైదరాబాద్‌లో ఒక మద్యం దుకాణానికి ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. సోమాజిగూడలో ఓ మద్యం దుకాణానికి దరఖాస్తు చేసుకున్న వ్యాపారికి అంతకు ముందే మరో దుకాణం లైసెన్స్ దక్కింది. ఒకే వ్యక్తికి రెండు లైసెన్స్‌లు ఇచ్చేందుకు నిబంధనలు అంగీకరించకపోవటంతో రెండో లైసెన్స్‌ను రద్దు చేశారు. వీళ్లది ఏం లక్కుపో.. మహబూబ్‌నగర్‌లోని భగీరథ కాలనీలో మద్యం దుకాణానికి 56 దరఖాస్తులు వచ్చా యి. రవీందర్ అనే వ్యాపారి ఒక్కరే వేర్వేరు పేర్ల మీద 30 దరఖాస్తులు వేశారు. అదృష్ట దేవత ఆయన్ను పక్కనపెట్టి ఒకే ఒక్క దరఖాస్తు దాఖలు చేసుకున్న వినోద్ అనే వ్యక్తిని వరించింది. సూర్యాపేట జిల్లా జాన్ప హాడ్లో మద్యం దుకాణానికి 134 దరఖాస్తులు రాగా.. అందులో ముగ్గురు వ్యాపారులే తమ వారి పేరిట సుమారు 40 వరకు దరఖాస్తులు వేశారు. కానీ ఒక్క దరఖాస్తు వేసిన లచ్చిరెడ్డికి దుకాణం దక్కింది. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలో ఆంజనేయులు అనే వ్యాపారి రెండు దుకాణాలకు 7 దరఖాస్తులు వేసినా ఒక్క లైసెన్సూ దక్కలేదు. ఆయనే తన వారి పేరిట మరోచోట సింగిల్ దరఖాస్తు వేయగా.. అక్కడ అదృష్టం వరించింది. మద్యం దుకాణాలు దక్కించుకున్న మహిళలు జిల్లాల వారీగా.. జిల్లా సంఖ్య రంగారెడ్డి 136 వరంగల్ 39 నల్లగొండ 25 హైదరాబాద్ 16 ఖమ్మం 13 మహబూబ్‌నగర్ 11 మెదక్ 19 కరీంనగర్ 11 నిజామాబాద్ 8 ఆదిలాబాద్ 6 -
కొత్త పాలసీ ఏంటో..?
ఖమ్మం క్రైం: ఎక్సైజ్ కొత్త పాలసీ విధానం ఇంకా ప్రకటించక పోవడంతో అధికారులు అయోమయానికి గురవుతున్నారు. వైన్‌షాపుల లెసైన్స్ గడువు జూన్ 30వ తేదీతో ముగియనుంది. దీంతో కొత్త షాపులకు లెసైన్స్ ఇచ్చేందుకు అనుసరించాల్సిన అంశాలపై ఎక్సైజ్ అధికారులకు ఇప్పటి వరకు స్పష్టత రాలేదు. ఈ కారణంగా గడువు ముగిసేలోపు చేయాల్సిన పనులు ఏ విధంగా చేయాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ విధి విధానాలు ఖరారు కావాల్సి ఉంది. అలాగే ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను సీమాంధ్రలో కలిపారు. షాపుల లెసైన్స్‌లు రెన్యువల్ చేసే సమయంలో ఆ షాపులను పరిగణలోకి తీసుకోవాలా..? వద్దా..? అనే అంశాలపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే జిల్లా ఉన్నతాధికారులు మాత్రం కిందిస్థాయి సిబ్బందిని పూర్తి వివరాలను అందజేయాలని ఆదేశించారు. ఏయే ప్రాంతాల్లో ఎంతెంత అమ్మకాలు జరుగుతున్నాయనే పూర్తి వివరాలను కమిషనర్ కోరినట్లు తెలిసింది. సీమాంధ్రలో కలుస్తున్న తొమ్మిది వైన్‌షాపులకు సంబంధించి ప్రత్యేకంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ షాపులను తెలంగాణ రాష్ట్రంలో కలపాలా... ఆంధ్రా రాష్ట్రంలో ఉంచాలా అనేది ప్రభుత్వం ఇంకా నిర్ణయించకపోవడంతో అధికారులు దానికి సంబంధించి ప్రత్యేక నివేదికను తయారు చేస్తున్నారు. జిల్లాలో ఉన్న 153 వైన్‌షాపులు, 44 బార్ అండ్ రెస్టారెంట్లు, మూడు క్లబ్‌లకు సంబంధించి లెసైన్స్‌లను పాత విధానంతోనే అమలు చేస్తారా... లేక కొత్త రాష్ట్రంలో కొత్త విధానాలు రూపొందిస్తారో... వేచి చూడాల్సి ఉంది. నేడు వైన్‌షాపుల యజమానులతో కమిషనర్ సమావేశం రాష్ట్రంలో లెసైన్స్ విధానంపై శనివారం హైదరాబాద్‌లో జిల్లా వైన్‌షాపుల యజమానులతో కమిషనర్ నదీం అహ్మద్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మద్యం పాలసీ విధానం అమలు తీరు గురించి చర్చించనున్నట్లు తెలిసింది. వరుస ఎన్నికల నేపథ్యంలో షాపు యజమానులకు కొంత నష్టం జరగడంతో.. దీనిపై ప్రభుత్వం దృష్టిసారించి షాపు యజ మానులతో మాట్లాడేందుకు హైదరాబాద్‌కు పిలిపించినట్లు వైన్‌షాపు యజమానులు తెలిపారు.