
కాన్‌బెర్రా: ఒక దారి మూసుకుపోతే మరో దారి తెరుచుకునే ఉంటుందనేందుకు ఓ తండ్రి కథ రుజువుగా నిలిచింది. కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన కోట్లాదిమందిలో ఆస్ట్రేలియాలోని ఆర్మడేల్‌కు చెందిన యువ తండ్రి ఒకరు. కరోనాకు ముందు అతను సెక్యూరిటీ గార్డుగా పని చేసేవాడు. ఎప్పుడైతే వైరస్ ప్రభంజనం మొదలైందో అప్పుడు అతని ఏకైక ఆదాయ మార్గమైన ఉపాధి కూడా కోల్పోయాడు. దీంతో ఆయన తీవ్ర నిరాశలో కూరుకుపోయాడు. ఇదిలా వుంటే ఓరోజు అతను తన మూడేళ్ల కూతురు కోసం దుకాణంలో వస్తువులు కొనడానికి వెళ్లాడు. అయితే ఆ షాపులోని లాటరీ టికెట్లు అతని దృష్టిని ఆకర్షించాయి. (కూరగాయలపై కరోనాను ఖతం చేసే టెక్నిక్!)
ఎందుకైనా మంచిది అని ఓజ్ లాటో నుంచి ఓ లాటరీ టికెట్ కొన్నాడు. ఆ తర్వాత కొద్ది రోజులకు లాటరీ విజేతను నిర్వాహకులు ప్రకటించారు. కానీ ఈ విషయం ఆయనకు తెలియదు. ఓ రోజు అతనికి లాటరీ టికెట్ అమ్మిన వ్యక్తి మాటల మధ్యలో లాటరీ టికెట్ విజేత డబ్బు తీసుకునేందుకు ఇంతవరకూ ముందుకు రాలేదని చెప్పాడు. దీంతో అతను తన టికెట్ నంబర్‌ను చెక్ చేసి చూడగా ఆ విజేత తనేనని తెలిసింది. అక్షరాలా 31 కోట్ల రూపాయలు అతని సొంతమవడంతో ఆయన ఆనందానికి అవధులు లేవు. "వెంటనే ఇంటికి వెళ్లి నా బంగారు బిడ్డను గట్టిగా హత్తుకుంటా" అని సంతోషంగా చెప్పుకొచ్చాడు. అలాగే తన సోదరుడు ఇల్లు కట్టుకునేందుకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడని, ఇప్పుడు తానే ఓ ఇల్లు కొనిస్తానంటున్నాడు. (లైవ్‌లో రచ్చరచ్చ చేసిన రిపోర్టర్)
Comments
Please login to add a commentAdd a comment