దుబాయ్‌లో భారతీయుడికి జాక్‌పాట్
సాక్షి, దుబాయ్: అబుదాబి మెగా లాటరీలో ఓ భారతీయుడికి జాక్‌పాట్ తగిలింది. గురువారం జరిగిన డ్రాలో ఎంఎన్ మ్యాథ్యూ బంపర్ ప్రైజ్ గెలుచుకున్నాడు. ఈ లాటరీలో కేరళకు చెందిన మ్యాథ్యూ భారత కరెన్సీలో దాదాపు రూ 12 కోట్ల విలువైన ఏడు మిలియన్ దీరాంలు గెలుపొందాడు.
డ్రాలో మరో ఆరుగురు భారతీయులు, ఒక ఎమిరేట్ వాసి కూడా లక్ష దీరాంలు గెలుచుకున్నారని ఖలీజ్ టైమ్స్ వెల్లడించింది.గత నెలలో అబుదాబి రాఫిల్ డ్రాలో కృష్ణంరాజు అనే తెలుగు వ్యక్తి 50 లక్షల దీరాంలు గెలుచుకున్న విషయం విదితమే.