
65 వేల హెచ్1బీ వీసాలు
ఈ ఆర్థిక సంవత్సరానికి హెచ్1బీ వీసాల ఎంపికను అమెరికా పూర్తి చేసింది.
లాటరీ ద్వారా ఎంపిక చేసిన అమెరికా
వాషింగ్టన్: ఈ ఆర్థిక సంవత్సరానికి హెచ్1బీ వీసాల ఎంపికను అమెరికా పూర్తి చేసింది. 2.36 లక్షల దరఖాస్తుల నుంచి కంప్యూటరైజ్డ్ లాటరీలో పూర్తికోటా 65వేల మందిని ఎంపిక చేసింది. ఈ ప్రక్రియ ప్రారంభించిన ఐదు రోజుల్లోనే పరిమితికి మించి మూడు రెట్ల అప్లికేషన్లు వచ్చాయి.
దరఖాస్తుదారుల్లో భారత్ సహా వివిధ దేశాల ఐటీ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో ఉన్నట్టు సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ పేర్కొంది. అమెరికాలో సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ (స్టెమ్)లో ఉన్నతవిద్యకు 20 వేల మంది విదేశీ విద్యార్థులకు సంబంధించిన వీసాల ఎంపిక ప్రక్రియ కూడా పూర్తిచేశామంది. డ్రాలో ఎంపిక కాని అర్హమైన దరఖాస్తులు, చెల్లించిన ఫీజులను తిప్పి పంపుతామంది.