
దుబాయ్: లాటరీ ద్వారా దుబాయ్‌లో మరో భారతీయుడు కోటీశ్వరుడయ్యారు. తాజాగా బెంగళూరుకు చెందిన టామ్స్ అరాకల్ మణి దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలినియం డ్రాలో భారత కరెన్సీలో సుమారు రూ.6.42 కోట్లు గెలుచుకున్నారు. 1999లో ఈ డ్రా ప్రారంభమైనప్పటి నుంచి మణితో సహా ఇప్పటి వరకు 124 మంది భారతీయులు రాత్రికి రాత్రే కోటీశ్వరులుగా మారారు.
38 ఏళ్ల మణి దుబాయ్‌లో ఓ అంతర్జాతీయ కంపెనీలో పనిచేస్తున్నారు. గత డిసెంబర్‌లో ఆయన కొన్న టికెట్ ఈ డ్రాలో గెలుపొందిందని ఖలీజ్ టైమ్స్ పేర్కొంది. తన జీవితంలో ఇదే అత్యంత మధుర క్షణమని, ఏం మాట్లాడాలో అర్థం కావడంలేదని మణి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు.
భారతీయుడికి 87 లక్షల జరిమానా
దుబాయ్: యూఏఈ ప్రభుత్వ విభాగంపై ఆరోపణలు చేసిన ఓ భారతీయుడికి ఏకంగా రూ.87 లక్షల జరిమానా పడిందని అక్కడి మీడియా మంగళవారం వెల్లడించింది. సదరు వ్యక్తి యూఏఈలో డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకుని, డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యాడు.
దీంతో విసుగు చెందిన ఆయన వెంటనే రహదారులు, రవాణా విభాగానికి ఈ–మెయిల్ పంపిస్తూ ‘మీరు ప్రజలను ఉద్దేశపూర్వకంగా ఫెయిల్ చేసి, వారు మళ్లీ డ్రైవింగ్ టెస్ట్‌కు డబ్బులు కట్టేలా చేయడం ద్వారా పేద కార్మికుల సొమ్మును దోచుకుంటు న్నారు’ అని పేర్కొన్నారు. దీంతో అధికారులు పోలీసులకు తెలపడంతో వారు ఆయనను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ–మెయి ల్‌ను దుర్వినియోగం చేయడం, ప్రభుత్వ విభాగాన్ని అవమానించడంలాంటి ఆరోప ణలపై కోర్టు విచారణ జరిపి జరిమానాతో పాటు మూణ్నెల్ల జైలు శిక్ష విధించింది.
Comments
Please login to add a commentAdd a comment