![Indian Man Wins One Million Dollars Lottery In Dubai - Sakshi](/styles/webp/s3/article_images/2018/08/1/lottery.jpg.webp?itok=LtqaAm9L)
దుబాయ్: దుబాయ్ లాటరీలో మరో భారతీయుడిని అదృష్టం వరించింది. కువైట్‌లో నివసిస్తున్న సందీప్ మీనన్ రూ.6.8 కోట్లు గెలుచుకున్నారు. దుబాయ్ డ్యూటీఫ్రీ రాఫిల్‌గా పిలుస్తున్న ఈ లాటరీలో గెలుపొందిన 132వ భారతీయుడిగా మీనన్ నిలిచారని ‘ఖలీల్ టైమ్స్’ వెల్లడించింది. ‘నా జీవితంలో ఇంత పెద్ద మొత్తం ఎప్పుడూ గెలుచుకోలేదు. ఇంత గొప్ప అదృష్టాన్ని కల్పించిన దుబాయ్ డ్యూటీఫ్రీ రాఫల్‌కు ధన్యవాదాలు’ అని మీనన్ అన్నారు.
ఈ లాటరీలో మీనన్‌తో పాటు మరో భారతీయుడు సహ విజేతగా నిలిచారు. దుబాయ్‌కే చెందిన శాంతిబోస్ బీఎండబ్ల్యూ ఆర్9టీ కారును గెలుచుకున్నారు. ఈజిప్టుకు చెందిన హొస్సాం హుస్సేన్ సల్మాన్ బీఎండబ్ల్యూ 750ఐ లగ్జరీ సిల్వర్ మెటాలిక్ కారును సొంతం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment