దుబాయ్: మసాజ్ చేస్తామంటూ అందమైన అమ్మాయిలను చూపిస్తూ వచ్చిన ఓ యాడ్‌పై క్లిక్ చేశాక రూ. 55 లక్షలు పోగొట్టుకున్న ఘటన దుబాయ్‌లో చోటు చేసుకుంది. భారత్ నుంచి వెళ్లి అక్కడే ఉంటున్న ఓ యువకుడు ఈ ఘటనకు బాధితుడిగా మారినట్లు దుబాయ్‌లోని కోర్టు విచారణను ఉద్దేశిస్తూ అక్కడి మీడియా వార్తను రాసింది. కోర్టు వివరాల ప్రకారం.. ఓ యాప్‌లో అందమైన అమ్మాయిలను చూపిస్తూ మసాజ్ కావాలంటే.. అంటూ ఓ నంబరును ఇచ్చారు. మసాజ్‌కు కేవలం రూ. 3,950 మాత్రమే అడగటంతో భారత్‌కు చెందిన ఓ వ్యక్తి దాన్ని క్లిక్ చేసి వివరాలు తెలుసుకున్నాడు.
2020 నంవంబర్‌లో మసాజ్ కోసం ఆ వ్యక్తిని అల్ రెఫా అనే ప్రాంతంలోకి రావాల్సిందిగా కోరడంతో అక్కడికెళ్లాడు. అనంతరం అక్కడి అపార్ట్‌మెంట్‌లో నైజీరియాకు చెందిన నలుగురు మహిళలు అతన్ని బంధించారు. మెడపై కత్తి పెట్టి బెదిరిస్తూ బ్యాంకు వివరాలను చెప్పాలంటూ బలవంతం చేశారు. ఆయా వివరాలను వెల్లడించడంతో క్రెడిట్ కార్డు, బ్యాంకు ఖాతాల ద్వారా రూ. 55,30,806ను దోచుకున్నారు. ఓ రోజు బంధించి ఉంచిన అనంతరం ఐఫోన్‌ను కూడా తీసుకొని వదిలిపెట్టారు. అనంతరం పోలీసులు, బ్యాంకును సంప్రదించి విషయం తెలిపినట్లు బాధితుడు కోర్టుకు చెప్పారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ముగ్గురు నైజీరియా మహిళలను అరెస్టు చేశారు. వారిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment