massage parlour
-
అమెరికాలో మళ్లీ కాల్పులు
అట్లాంటా: అమెరికాలోని అట్లాంటాలో వరస కాల్పులు కలకలం రేపాయి. ఒక గంట వ్యవధిలోనే మూడు వేర్వేరు మసాజ్ సెంటర్లలో జరిగిన కాల్పుల్లో ఎనిమిది మంది మృతి చెందారు. వీరిలో ఆరుగురు మహిళలు ఆసియా దేశాలకు చెందినవారే ఉన్నారు. కాల్పులకు పాల్పడ్డాడని అనుమానిస్తున్న 21 ఏళ్ల యువకుడిని పోలీసులు అదుపులోనికి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. అట్లాంటా పోలీసు చీఫ్ రాడ్నీ బ్రియాంట్ తెలిపిన వివరాలు ప్రకారం ఉత్తర అట్లాంటాకు 50 కి.మీ. దూరంలోని గ్రామీణ ప్రాంతమైన అక్వర్త్లో మంగళవారం సాయంత్రం 5 గంటలకు యంగ్స్ ఆసియన్ మసాజ్ పార్లర్లో తుపాకుల మోత మోగింది. ఈ కాల్పుల్లో ఇద్దరు అక్కడికక్కడే మరణించగా, మరో ఇద్దరు ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఆ తర్వాత సాయంత్రం 6 గంటలు అవుతుండగా అట్లాంటాకి సమీపంలోని బక్‌హెడ్‌లోని గోల్డ్ స్పాలో జరిగిన కాల్పుల్లో ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. ఆ మసాజ్ సెంటర్లో దోపిడి జరుగుతోందన్న సమాచారం మేరకు పోలీసులు వచ్చి చూడగా ముగ్గురు మహిళలు విగతజీవులై పడి ఉన్నారు. అక్కడికి సమీపంలోనే ఉన్న మరో వీధిలో అరోమాథెరపీ స్పాలో కూడా కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోయినట్టు పోలీసు చీఫ్ వివరించారు. ఈ బీభత్సకరమైన హింసాకాండలో బాధి తుల కోసం మేమంతా ప్రార్థనలు చేస్తున్నామంటూ అట్లాంటా గవర్నర్ బ్రెయిన్ కెంప్ ట్వీట్ చేశారు. కాల్పులు జరిపింది ఒక్కడేనా ? అక్వర్త్ ఘటనలో కాల్పులకు తెగబడినట్టుగా అనుమానిస్తున్న వ్యక్తిని అదుపులోనికి తీసుకొని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. స్పా బయట అతను తిరుగుతున్న దృశ్యాలు సీసీ టీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. వుడ్‌స్టాక్‌కు చెందిన రాబర్ట్ ఆరన్ లాంగ్గా అతనిని గుర్తించారు. మిగిలిన రెండు చోట్ల కాల్పులు జరిపింది అతని పనేనని పోలీసులు అనుమానిస్తున్నారు. మొదటి వీడియోలో కనిపించిన కారు, కాల్పులు జరిగిన ఇతర ప్రాంతాల్లో కూడా కనిపించింది. కరోనా వైరస్ అగ్రరాజ్యాన్ని అతలాకుతలం చేస్తున్న నేపథ్యంలో ఆసియన్ అమెరికన్లపై దాడులు విస్తృతంగా జరుగుతున్నాయి. ఈ కాల్పులు కూడా అందులో భాగమేనన్న ఆందోళన పెరుగుతోంది. మరోవైపు అక్వర్త్లో యంగ్స్ ఆసియన్ మసాజ్ పార్లర్లో మరణించిన వారందరూ దక్షిణ కొరియాకి చెందిన మహిళలేనని ఆ దేశ విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. -
అమ్మాయిలతో మసాజ్.. 55 లక్షలు దోచుకున్నారు
దుబాయ్: మసాజ్ చేస్తామంటూ అందమైన అమ్మాయిలను చూపిస్తూ వచ్చిన ఓ యాడ్‌పై క్లిక్ చేశాక రూ. 55 లక్షలు పోగొట్టుకున్న ఘటన దుబాయ్‌లో చోటు చేసుకుంది. భారత్ నుంచి వెళ్లి అక్కడే ఉంటున్న ఓ యువకుడు ఈ ఘటనకు బాధితుడిగా మారినట్లు దుబాయ్‌లోని కోర్టు విచారణను ఉద్దేశిస్తూ అక్కడి మీడియా వార్తను రాసింది. కోర్టు వివరాల ప్రకారం.. ఓ యాప్‌లో అందమైన అమ్మాయిలను చూపిస్తూ మసాజ్ కావాలంటే.. అంటూ ఓ నంబరును ఇచ్చారు. మసాజ్‌కు కేవలం రూ. 3,950 మాత్రమే అడగటంతో భారత్‌కు చెందిన ఓ వ్యక్తి దాన్ని క్లిక్ చేసి వివరాలు తెలుసుకున్నాడు. 2020 నంవంబర్‌లో మసాజ్ కోసం ఆ వ్యక్తిని అల్ రెఫా అనే ప్రాంతంలోకి రావాల్సిందిగా కోరడంతో అక్కడికెళ్లాడు. అనంతరం అక్కడి అపార్ట్మెంట్లో నైజీరియాకు చెందిన నలుగురు మహిళలు అతన్ని బంధించారు. మెడపై కత్తి పెట్టి బెదిరిస్తూ బ్యాంకు వివరాలను చెప్పాలంటూ బలవంతం చేశారు. ఆయా వివరాలను వెల్లడించడంతో క్రెడిట్ కార్డు, బ్యాంకు ఖాతాల ద్వారా రూ. 55,30,806ను దోచుకున్నారు. ఓ రోజు బంధించి ఉంచిన అనంతరం ఐఫోన్‌ను కూడా తీసుకొని వదిలిపెట్టారు. అనంతరం పోలీసులు, బ్యాంకును సంప్రదించి విషయం తెలిపినట్లు బాధితుడు కోర్టుకు చెప్పారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ముగ్గురు నైజీరియా మహిళలను అరెస్టు చేశారు. వారిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. -
ఒకప్పుడు ఆ మసాజ్ పార్లర్‌కు 600 మంది..
న్యూఢిల్లీ: కరోనా వైరస్ దెబ్బతో అంతర్జాతీయంగా అన్ని రంగాలు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా పర్యాటక రంగం తీవ్రంగా నష్టపోయింది. కరోనా వైరస్ కారణంగా మసాజ్‌లకు పేరొందిన తైపీస్ మసాజ్ పార్లర్ కస్టమర్లు లేక వెలవెలబోతుంది. ఈ పార్లర్‌ను తైవాన్ సరిహద్దులో నెలకొల్పారు. ఈ పార్లర్‌కు రోజు 600 మంది కస్టమర్లు వచ్చే వారని.. ప్రస్తుతం ఒకరు లేదా ఇద్దరు వస్తున్నారని పార్లర్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు కస్టమర్లతో ఎంతో సందడిగా తమ పార్లర్ ఉండేదని.. ప్రస్తుతం పార్లర్ లాబీలో ఎవరు లేకపోవడంతో కాలక్షేపం చేస్తున్నామని ఉద్యోగులు తెలిపారు. ప్రస్తుతం పర్యాటక రంగం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుందని.. తమకు కస్టమర్లు లేక తమ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొందని మసాజ్ పార్లర్ డిప్యూటి జనరల్ మేనేజర్ వాంగ్ జీ క్వాన్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఉపాధి లభించే రంగానికి తమ ఉద్యోగులు ఎంచుకోవాలని జీ క్వాన్ సూచించారు. ఇటీవల పర్యాటక రంగాన్ని అభివృద్ధి చెందే విధంగా తైవాన్ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని పర్యాటక రంగ నిపుణులు తెలిపారు. ప్రపంచ ప్రఖ్యాత ద్వీపం, వైవిధ్యమైన ఆహార అలవాట్లు, ఆసియాలో ఉదారవాద ప్రజాస్వామ్యం తదితర అంశాలు తైవాన్ పర్యాటక రంగ అభివృద్ధికి కీలక అంశాలని తైవాన్ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. తైపీస్ మసాజ్ పార్లర్ 24 గంటల పాటు సేవలందించడం విశేషం. జపాన్, దక్షిణ కొరియా పర్యాటకులు ఎక్కువగా పార్లరును సందర్శిస్తుంటారు. అయితే గత 20ఏళ్లుగా తమకు ఈ రంగంలో అనుభవం ఉందని.. ఇప్పుడు వేరే రంగాన్ని ఎంపిక చేసుకొని ఉపాధి పొందడం అంత సులువు కాదని పార్లర్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చదవండి: రజనీకాంత్‌పై ట్వీట్, ఫ్యాన్స్ ఆగ్రహం -
మసాజ్ సెంటర్ల ముసుగులో వ్యభిచారం
విజయవాడ: మసాజ్ సెంటర్లలో బెజవాడ పోలీసులు శుక్రవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మసాజ్ సెంటర్ల ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న సమాచారం అందడంతో టాస్క్ ఫోర్క్ పోలీసులు నాలుగు బృందాలుగా విడిపోయి నగరంలోని మొగల్రాజపురం, లబ్బీపేట, గురునానక్ కాలనీల్లోని నాలుగు మసాజ్ సెంటర్లపై ఆకస్మిక దాడులు చేశారు. వ్యభిచారం జరుగుతోందని నిర్ధారించుకున్న తర్వాత ఇద్దరు మహిళా నిర్వాహకులతో పాటు 11 మంది వ్యభిచారం చేస్తోన్న మహిళలను, ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారిని స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు. డైమండ్ బ్యూటీ పార్లర్, లా రాయల్స్ బ్యూటీ పార్లర్లపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మసాజ్.. అతడి ప్రాణాలు తీసింది
ఒళ్లు నొప్పులుగా ఉన్నాయని మసాజ్ చేయించుకోడానికి వెళ్తే.. మెడ ఎముక విరిగి ప్రాణాలు కోల్పోయాడు! ఈ ఘటనపై దాదాపు ఏడాది పాటు దర్యాప్తు జరిగిన తర్వాత.. అతడి ప్రాణాలు పోవడానికి మసాజే కారణమని తేలింది. గత సంవత్సరం డిసెంబర్ నెలలో ఈ ఘటన జరిగింది. దానిపై ఇన్నాళ్ల పాటు పూర్తిగా దర్యాప్తు చేసిన తర్వాత. మసాజ్ సెంటర్ మేనేజర్‌పై పోలీసులు కేసు నమోదు చేసి, అదుపులోకి తీసుకున్నారు. భోపాల్ పరిసర ప్రాంతాల్లో ఇలాంటి ఘటన జరగడం ఇదే మొదటిసారి. 2015 డిసెంబర్ 12వ తేదీన నజీరాబాద్ ప్రాంతానికి చెందిన హర్నభ్ సింగ్ అనే వ్యక్తి తమ బంధువుల ఇంట్లో పార్టీలో ఉండగా తనకు మెడ బాగా నొప్పిగా ఉందని చెబుతూనే కుప్పకూలిపోయాడు. అతడికి నొప్పి చాలా ఎక్కువగా ఉండటంతో.. స్థానికంగా ఉండే మధు ఠాకూర్ అనే వ్యక్తికి సింగ్ తల్లి ఆ విషయాన్ని చెప్పారు. అది ఎలా తగ్గుతుందో తనకు తెలుసని అతడు చెప్పి, దగ్గర్లో ఉన్న మసాజ్ పార్లర్‌కు వెళ్లమని సూచించాడు. అయితే.. హర్నభ్కు అక్కడ చేసిన మసాజ్ కారణంగా మెడ ఎముకల్లో ఒకటి విరిగిపోయి, అతడు స్పృహ కోల్పోయాడు. వెంటనే ఆస్తప్రికి తీసుకెళ్లగా, అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. అయితే.. పోస్టుమార్టం నివేదికలో డాక్టర్లు అతడి మృతికి కచ్చితమైన కారణం ఏంటో చెప్పకపోవపడంతో కేసు నమోదు చేయడంలో ఆలస్యమైందని పోలీసులు తెలిపారు. చివరకు వైద్య, న్యాయ నిపుణులతో కూడిన బృందం క్షుణ్ణంగా విచారణ జరిపి, అతడి మెడ ఎముక విరిగిన తర్వాతే మరణించాడని, అందుకు కారణం మసాజ్ అని తేల్చడంతో ఇన్నాళ్లకు కేసు నమోదు చేశారు. -
మసాజ్పార్లర్లో ఉద్యోగం - బలవంతంగా వ్యభిచారం
చెన్నై: యువతులకు మొదట మసాజ్ పార్లర్లోఉద్యోగం ఇచ్చి, ఆ తరువాత వారిని బలవంతంగా వ్యభిచార రొంపిలోకి దింపుతున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం మసాజ్ పార్లర్ యజమాని ఆనంద్ ఇతర రాష్ట్రాలకు చెందిన కొందరు యువతులకు పార్లర్లో మసాజ్ చేసే ఉద్యోగం ఇచ్చాడు. ఆ తరువాత వారితో బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నాడు. ఈ విషయం తెలిసి నగర పోలీసులు పార్లర్‌పై దాడి చేసి మణిపూర్, సిక్కింకు చెందిన నలుగురు యువతులను కాపాడారు. ఆనంద్‌ని అరెస్ట్ చేశారు. ఆనంద్‌ను కోర్టులో హాజరుపరిచి, యువతులను ప్రభుత్వ పునరావాస కేంద్రానికి తరలించారు. **