
విజయవాడ: మసాజ్ సెంటర్లలో బెజవాడ పోలీసులు శుక్రవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మసాజ్ సెంటర్ల ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న సమాచారం అందడంతో టాస్క్ ఫోర్క్ పోలీసులు నాలుగు బృందాలుగా విడిపోయి నగరంలోని మొగల్రాజపురం, లబ్బీపేట, గురునానక్ కాలనీల్లోని నాలుగు మసాజ్ సెంటర్లపై ఆకస్మిక దాడులు చేశారు.
వ్యభిచారం జరుగుతోందని నిర్ధారించుకున్న తర్వాత ఇద్దరు మహిళా నిర్వాహకులతో పాటు 11 మంది వ్యభిచారం చేస్తోన్న మహిళలను, ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారిని స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు. డైమండ్ బ్యూటీ పార్లర్, లా రాయల్స్ బ్యూటీ పార్లర్లపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment