
రాజుగారింటి భోజనం
ఏప్రిల్ 27న డచ్ మహారాజుగారి బర్త్ డే. 50వ పుట్టిన రోజు.
ఏప్రిల్ 27న డచ్ మహారాజుగారి బర్త్ డే. 50వ పుట్టిన రోజు. ఆ సందర్భంగా కింగ్ విలియమ్ అలెగ్జాండర్ 150 మంది సామాన్య పౌరులకు రాజధాని ఆమ్‌స్టర్‌డామ్‌లో ఘనమైన విందును ఇవ్వబోతున్నారు. ఆ రోజు రాజుగారు, రాణి మాక్సిమా గారు వారితో కలిసి భోంచేస్తారు.
డచ్ (నెదర్లాండ్స్) జనాభా కోటీ 70 లక్షలు. మరి వారిలో అదృష్టవంతులైన ఆ 150 ఎవరై ఉంటారు? ఏప్రిల్ 27న ఎవరైతే పుట్టారో వారు! అంతకంటే ఎక్కుమంది అదే రోజున పుట్టి ఉంటే? లాటరీ వేసి ఎంపిక చేస్తారు. లాటరీ మార్చి 3న.